ఒకే తరహా పిటిషన్లపై భిన్న తీర్పులా?విజయమ్మ రిట్ పిటిషన్ తిరస్కరణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఒకే తరహా పిటిషన్లపై భిన్న తీర్పులా?విజయమ్మ రిట్ పిటిషన్ తిరస్కరణ

ఒకే తరహా పిటిషన్లపై భిన్న తీర్పులా?విజయమ్మ రిట్ పిటిషన్ తిరస్కరణ

Written By ysrcongress on Thursday, February 16, 2012 | 2/16/2012

బాబు...ఆయన బినామీల ఆస్తులపై వైఎస్ విజయమ్మ వేసిన రిట్ పిటిషన్ ను జస్టిస్ రోహిణి బెంచ్ కొట్టివేసింది. కేవలం 15 సెకన్లలోనే తీర్పు ఇచ్చింది. 

ఈ అంశంపై వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ హైకోర్టు తీర్పును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తోందన్నారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తామన్నారు. వైఎస్ విజయమ్మ వేసిన పిటిషన్ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ఎందుకు కాదో న్యాయస్థానం తెలియ చేయాలని వాసిరెడ్డి పద్మ అన్నారు.




తీర్పును విజయమ్మ ముందే ఊహించారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు తలుపుతట్టనున్నట్టు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. శంకర్రావు లేఖ ఎలా ప్రజాప్రయోజన వ్యాజ్యం అయిందో విజయమ్మ పిటిషన్ ఎందుకు కాదో సామాన్యులకు అర్థంకాని విషయమని వాసిరెడ్డి ఎద్దేవా చేశారు. ఒకే హైకోర్టులో రెండు విభిన్న తీర్పులు వెలువడ్డాయని న్యాయ నిపుణులు దీనిపై చర్చించాలన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ఆమె అన్నారు. 

కాగా హైకోర్టు తీర్పుపై న్యాయనిపుణులతో చర్చించి ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు అవినీతిని నిరూపిస్తామన్నారు. ఇది చంద్రబాబు విజయం కానేకాదని అంబటి స్పష్టం చేశారు.


హైకోర్టు ఇచ్చిన తీర్పును చూసి టీడీపీ శ్రేణులు చంద్రబాబుకు న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చిందని సంబరపడిపోతున్నారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి అన్నారు. హైకోర్టు రిట్ పిటిషన్ ను కొట్టేసిందే కానీ, బాబు నిజాయితీపరుడని చెప్పలేదన్నారు. ప్రజలను, మీడియాను టీడీపీ నేతలు తప్పుదోవ పట్టించవద్దని శోభా నాగిరెడ్డి కోరారు. నిజంగానే చంద్రబాబు ఏ తప్పు చేయకపోతే స్టేలు ఎందుకు తెచ్చుకుంటున్నారని ప్రశ్నించారు.

Vasireddy Padma Press Meet on High Court rejects YS Vijayamma writ Petition





Shobha Nagi Reddy Comments on High Court rejects YS Vijayamma writ Petition

Srikanth Reddy Comments on Haigh Court rejects YS Vijayamma writ Petition

Share this article :

0 comments: