సీబీఐ స్థాయిని లక్ష్మీనారాయణ దిగజార్చారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐ స్థాయిని లక్ష్మీనారాయణ దిగజార్చారు

సీబీఐ స్థాయిని లక్ష్మీనారాయణ దిగజార్చారు

Written By ysrcongress on Thursday, February 2, 2012 | 2/02/2012

సీబీఐ స్థాయిని లక్ష్మీనారాయణ దిగజార్చారు
వైఎస్ జగన్‌ను అపఖ్యాతి చేయాలన్న రాజకీయ క్రీడలో ఆయనో పాత్రధారి
నన్ను ప్రశ్నించిన వివరాలను సీబీఐ అధికారులే ఈనాడుకు చెప్పారు

 ఎమ్మార్ సహా సీబీఐ చేపట్టిన కేసుల దర్యాప్తు లోపభూయిష్టంగా సాగుతోంద ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. బుధవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సీబీఐ జాయింట్ డెరైక్టర్(జేడీ) లక్ష్మీనారాయణ ఎక్కడి నుంచో అందుతున్న రహస్య ఆదేశాల ప్రకారమే విచారణను కొనసాగిస్తున్నారు తప్ప స్వేచ్ఛగా వ్యవహరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘విచారణ తీరు చూస్త్తుంటే కానిస్టేబుల్ నుంచి ప్రమోషన్ మీద ఎస్సై అయిన అధికారి కేసును దర్యాప్తు చేస్తున్నట్లుగా ఉంది తప్పితే.. సీబీఐ స్థాయికి అనుగుణంగా లేదు. రాష్ట్రంలో సీబీఐ స్థాయిని లక్ష్మీనారాయణ వంటి అధికారులు దిగజార్చారు. ఇదొక దౌర్భాగ్యమైన పరిస్థితి’ అని అన్నారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని అపఖ్యాతి పాలు చేయాలన్న ఓ రాజకీయ క్రీడ లో లక్ష్మీనారాయణ పాత్రధారిగా మారారని విమర్శించారు.

బాబువైపు కన్నెత్తి చూడరేం?
ఎమ్మార్ ప్రాపర్టీస్ ఉదంతంలో 2002లో చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నపుడు జరిగిన భూమి కేటాయింపు.. ఆ తర్వాత ఒప్పందాల్లో జరిగిన సవరణలకు సంబంధించి తాము నిర్దిష్టంగా కొన్ని అంశాలు సీబీఐ దృష్టికి తెసుకువచ్చినా.. అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడలేదని రాంబాబు ధ్వజమెత్తారు. ‘బాబు ఎమ్మార్‌కు 535 ఎకరాలను తక్కువ ధర (రూ.29 లక్షలు)కు కేటాయించిన అంశాన్ని గానీ, ఆ పక్కనే ఉన్న బాబు సతీమణికి చెందిన భూమిని ఎకరం రూ.కోటికి అమ్ముకున్న విషయాన్ని గానీ సీబీఐ అసలు పరిగణనలోకి తీసుకోలేదు. అసలు ఈ కేసులో చంద్రబాబును గానీ, వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక ఎమ్మార్ ఒప్పందాన్ని సమీక్షించిన ఉపసంఘాన్ని గానీ విచారించకుండానే సీబీఐ చార్జిషీటు దాఖలు చేసిందంటే ఆ సంస్థ ఎంత పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తోందో ఇట్టే అర్థం అవుతోంది. వైఎస్ కుటుంబీకులను ఇరికించి, వారిని రాజకీయంగా అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారు తప్ప.. మరో లక్ష్యం కనిపించడం లేదు’ అంటూ సీబీఐ జేడీపై మండిపడ్డారు.

లీక్ చేసింది మీరు కాదా?
సీబీఐ దర్యాప్తును ఏ మాత్రం గోప్యంగా ఉంచడం లేదని.. ఉద్దేశపూర్వకంగానే ఆ రెండు పత్రికలకూ పనిగట్టుకుని లీక్ చేస్తోందని అంబటి దుయ్యబట్టారు. విచారణ సందర్భంగా సీబీఐ ఎలా వ్యవహరిస్తుందనడానికి తన స్వీయానుభవమే నిదర్శనమన్నారు. ‘నన్నుఎమ్మార్ కేసులో సాక్షిగా పిలిచి నలుగురు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. ఆ మరుసటి రోజు ఈనాడులో సీబీఐ అధికారులు నన్ను ఏ ప్రశ్నలు అడిగిందీ పూసగుచ్చినట్లు వార్త వచ్చింది. అంటే ఈ వివరాలన్నీ ఈనాడుకు ఎవరు వెల్లడించినట్లు? సీబీఐ అధికారులు కాదా? ఆ వివరాలు నాకు, సీబీఐ అధికారులకు మాత్రమే తెలిసినపుడు అవి ఆ పత్రికలో ఎలా వచ్చాయో లక్ష్మీనారాయణే చెప్పాలి. నేనైతే ఆ పత్రిక వాళ్లకు చె ప్పనే చెప్పను. నన్ను ప్రశ్నించిన అధికారులైనా లీక్ చేసి ఉండాలి లేదా లక్ష్మీనారాయణ స్వయంగా ఆ పత్రికకు చెప్పి ఉండాలి’ అని ఆయన అన్నారు. 

ఎవరితో ఏమేం మాట్లాడుతున్నారో తెలుసు.. 
‘లక్ష్మీనారాయణ ఎవరి వద్ద ఏమేం మాట్లాడుతున్నారో.. ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో మాకు తెలుసు. అవసరం వచ్చినపుడు అన్నీ బయట పెడతాం’ అని అంబటి హెచ్చరించారు. దర్యాప్తు ఎవరి ఆదేశాల ప్రకారం జరుగుతోందో వెల్లడి కావాలంటే లక్ష్మీనారాయణ నార్కో పరీక్షలకు సిద్ధం కావాలని.. ఒకవేళ అందుకు అంగీకరించకపోతే కనీసం అంతరాత్మ ప్రబోధానుసారమైనా దర్యాప్తు చేయాలని హితవు పలికారు. ప్రజాదరణ కలిగిన నాయకుడుగా ఎదుగుతున్న వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని అపఖ్యాతి పాలు చేయడానికి.. వైఎస్సార్ కాంగ్రెస్‌ను అణగదొక్కడానికి.. ఓ పథకం ప్రకారమే సీబీఐ జేడీ ఆ రెండు పత్రికల సాయం తీసుకుంటున్నారని విమర్శించారు. ‘కోరిన విధంగా స్టేట్‌మెంట్లు ఇస్తున్న తుమ్మల రంగారావు వంటి వారికి ముందస్తు బెయిలు ఇచ్చినా పరవాలేదని సీబీఐ చెబుతోంది. శ్రీలక్ష్మి, రాజగోపాల్ వంటి అధికారుల విషయంలో మాత్రం వారికి వచ్చిన బెయిల్‌ను రద్దు చేయడానికి పై కోర్టులకు వెళుతున్నారు. ఈ ద్వంద్వ ప్రమాణాలేమిటి?’ అని నిలదీశారు.
Share this article :

0 comments: