చనిపోయిన వైఎస్‌కు ఒక న్యాయమట, బతికున్న చంద్రబాబుకు, మంత్రులకు వేరొక న్యాయమట - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చనిపోయిన వైఎస్‌కు ఒక న్యాయమట, బతికున్న చంద్రబాబుకు, మంత్రులకు వేరొక న్యాయమట

చనిపోయిన వైఎస్‌కు ఒక న్యాయమట, బతికున్న చంద్రబాబుకు, మంత్రులకు వేరొక న్యాయమట

Written By ysrcongress on Thursday, February 23, 2012 | 2/23/2012


పేదవాడి గురించి తపన పడాలనే ఆలోచనను ఈ పాలకులు ఎప్పుడో పక్కనపెట్టారు
మూడో పార్టీని లేకుండా చేయాలని కాంగ్రెస్, టీడీపీ నీచమైన ఆలోచనలు చేస్తున్నాయి
చనిపోయిన వైఎస్‌కు ఒక న్యాయమట, బతికున్న చంద్రబాబుకు, మంత్రులకు వేరొక న్యాయమట
గుంటూరు జిల్లాలో ఓదార్పు యాత్ర పునః ప్రారంభం.. 


ఓదార్పు యాత్ర నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి.. పేదవాడి గురించి తపన పడాలనే ఆలోచనను పక్కనబెట్టి, సోనియా గాంధీని ఎలా ఒప్పించాలీ.. ఆమెను ఎలా మెప్పించాలీ అనే ఆలోచనలతోనే పనిచేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ప్రజలు కన్నీళ్లు పెడుతున్న దారుణమైన పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

బుధవారం పునఃప్రారంభమైన గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర(63వ రోజు)లో భాగంగా ఆయన రొంపిచర్ల మండలంలోని రాంరెడ్డిపాలెం, బుచ్చిబాపనపాలెం గ్రామాల్లో పర్యటించా రు. హైదరాబాద్ నుంచి గన్నవరం వరకు విమానంలో వచ్చిన జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరు జిల్లా రొంపిచర్లకు చేరుకున్నారు. రొంపిచర్ల చెరువుసెంటర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రజలతో మమేకమయ్యారు. రాంరెడ్డిపాలెం గ్రామంలో ప్రతి వీధికి ఒక విగ్రహం చొప్పున ఎనిమిది వైఎస్సార్ విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు. వాటితోపాటు మొత్తం 13 వైఎస్ విగ్రహాలను జగన్ ఆవిష్కరించారు. బుచ్చిబాపనపాలెంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సారాంశం ఆయన మాటల్లోనే..

దివంగత నేత మీద బురదజల్లేందుకు పాలకపక్షం, ప్రతిపక్షం పార్టీలకు అతీతంగా ఒక్కటయ్యాయి. వీళ్లిద్దరి రాజకీయాలూ ఎంతకు దిగజారిపోయాయి అంటే.. పేదవాడి గురించి ఆలోచన చేయాల్సిన అవసరమే లేదనుకుంటున్నారు. ఇవాళ ఉన్న రాజకీయ రణరంగంలో.. మూడో పార్టీ రాకపోతే, మూడో వ్యక్తి లేకపోతే.. ఇక రెండే రెండు పార్టీలు మిగిలి ఉంటాయి. అప్పుడు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద విసుగెత్తినప్పుడు టీడీపీకి ఓటు వేస్తారు. టీడీపీ మీద విసుగుపుడితే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు. కాబట్టి ప్రజల గురించి ఎందుకు ఆలోచించాలి? మూడో పార్టీ లేకుండా చేస్తే చాలుకదా.. అని నీచమైన ఆలోచనలు చేస్తున్నారు వీళ్లు. ఇంతలా దిగజారిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను చూస్తున్నప్పుడు, విశ్వసనీయత లేని ఈ రాజకీయ నాయకులను చూస్తున్నప్పుడు బాధనిపిస్తోంది. చనిపోయిన వైఎస్సార్‌కు ఒక న్యాయమట.. అదే బతికున్న చంద్రబాబు నాయుడుకు వేరొక న్యాయమట! అంతటితో సరికాదు.. బతికున్న క్యాబినెట్ మంత్రులకు ఇంకొక న్యాయమట! ఇవాళ అధికారం వీళ్ల చేతిలో ఉంది కాబట్టి ఏమైనా చేయొచ్చు. కానీ పై నుంచి దేవుడు చూస్తున్నాడని ఈ ఇద్దరికీ చెప్తున్నాను.

పరిస్థితులు మెరుగుపడ్డాయేమోనని ఆశతో అడిగా..
నేను ఇక్కడికి రాకముందు చాలా గ్రామాలు తిరుగుతూ వచ్చా. పొలాల్లో కూలి పనిచేస్తున్న అక్కా చెల్లెమ్మలు కనిపించారు. వాళ్లు నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి నాతో ఆప్యాయంగా మాట్లాడారు. నేను ఇక్కడ నుంచి వెళ్లినప్పటికీ..ఇప్పటికీ పరిస్థితుల్లో ఏమైనా మార్పులు వచ్చాయేమో అన్న ఆశతో ‘అమ్మా.. ఎంత కూలి గిడుతోంది తల్లీ’ అని అడిగా..! ‘అన్నా! రూ.100 కూడా సరిగా గిట్టని పరిస్థితుల్లో మేం ఉన్నామన్నా’ అని అక్కా చెల్లెమ్మలు నాతో చెప్పారు. 

వారు ఇంకొక మాట కూడా అన్నారు. ‘అన్నా.. చాలీచాలని వర్షాలు పడి పంట కూడా అంతంత మాత్రంగానే వచ్చిన పరిస్థితి ఉంది. వైరస్ సోకి రైతన్నలు ఇబ్బందుల్లో ఉన్నారు. అంతటితో సరిపోదు అన్నట్లుగా ఈ మధ్యకాలంలోనే అకాల వర్షాలు కురిసి కాయ తాలుబోయింది. ఇవాళ రైతన్న మిరపను తీసుకొని యార్డుకుపోయి అమ్మితే... రూ. నాలుగు- ఐదు వేల కంటే పెచ్చు రాని పరిస్థితుల్లో రైతన్నలు ఉన్నారన్నా..! ఇటువంటి పరిస్థితుల్లో వాళ్లు ఇంతకంటే ఎక్కువ ఇంకా మాకు ఏమిస్తారన్నా’ అని ఆ అక్కాచెల్లెమ్మలు కూడా రైతన్నమీద సానుభూతి చూపిస్తున్నారు. బాదెక్కడనిపిస్తోందంటే.. తోటి మనిషి మీద ఇంకో మనిషి సానుభూతి చూపిస్తున్నాడు కానీ, సానుభూతి చూపించాల్సిన ప్రభుత్వం మాత్రం తనకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది.
Share this article :

0 comments: