కాంగ్రెస్ ప్రముఖుడిపై ఏసీబీ నివేదికను తొక్కిపెడుతున్న వైనం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్ ప్రముఖుడిపై ఏసీబీ నివేదికను తొక్కిపెడుతున్న వైనం

కాంగ్రెస్ ప్రముఖుడిపై ఏసీబీ నివేదికను తొక్కిపెడుతున్న వైనం

Written By ysrcongress on Saturday, February 11, 2012 | 2/11/2012


కాంగ్రెస్ ప్రముఖుని కనుసన్నల్లో యథేచ్ఛగా ‘జీరో మాల్’
పొరుగు రాష్ట్రాల నుంచి సుంకం లేని మద్యం దొంగ రవాణా 
గోవా నుంచి రోజుకు ఎనిమిది లారీల మద్యం అక్రమ దిగుమతి 
బ్రాండెడ్ మద్యాలకు స్థానికంగా నకిలీలు తయారు చేసి విక్రయం 
ఏడాదిగా వ్యవహారం సాగుతున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం 
కాంగ్రెస్ ప్రముఖుడిపై ఏసీబీ నివేదికను తొక్కిపెడుతున్న వైనం 
మద్యం మాఫియాపై ఫిర్యాదు చేసిన ఎక్సైజ్ అధికారిపై బదిలీ వేటు 
పదేళ్లలో మొదటిసారిగా భారీగా పడిన సర్కారీ మద్యం అమ్మకాలు


హైదరాబాద్, న్యూస్‌లైన్:ఉత్తరాంధ్రలో ఒక కాంగ్రెస్ ప్రముఖుడి కనుసన్నల్లో మద్యం మాఫియా రాజ్యమేలుతోంది. రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న సదరు కాంగ్రెస్ ప్రముఖుడి సోదరుడి నేతృత్వంలో అక్రమ మద్యం దందా యథేచ్ఛగా సాగుతోంది. పొరుగు రాష్ట్రాల నుంచి సుంకం లేని మద్యాన్ని (జీరో మాల్) లారీలకు లారీలు దొంగతనంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు రవాణా చేస్తూ.. అక్కడి మద్యం దుకాణాల్లో విక్రయిస్తున్నారు. అంతేకాదు.. కొన్ని డిస్టిలరీల నుంచి నేరుగా మద్యం కొని.. దానిని నకిలీ బ్రాండెడ్ మద్యంగా రూపొందించి నేరుగా దుకాణాల్లో అమ్ముతున్నారు. ఏడాది కాలంగా సాగుతున్న ఈ మద్యం మాఫియా అక్రమ దందా గురించి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నివేదిక ఇచ్చినా కూడా.. రాష్ట్ర ప్రభుత్వం దానిని తొక్కి పెట్టింది. కాంగ్రెస్ ప్రముఖుడి కనుసన్నల్లో నడుస్తున్న ఈ మద్యం మాఫియాపై నివేదిక అందించిన ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారిని బదిలీ చేసి సత్కరించింది కూడా. ఇక ఉత్తరాంధ్రలో మద్యం దందా గురించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కూడా ఒక నివేదికలో విడమరచి చెప్పింది. 

అయినా సర్కారు వారు తమకేమీ తెలియదన్నట్లు మిన్నకుండిపోయారు. అక్రమ మద్యం విక్రయాల కారణంగా ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లోనూ ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీబీసీఎల్) సరఫరా చేసే మద్యం పరిణామం గణనీయంగా పడిపోయింది కూడా. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు ఏటా 15 శాతం వరకూ పెరగటం సహజం కాగా.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో గత ఏడాది కన్నా ఈ ఏడాది ఏపీబీసీఎల్ అమ్మకాలు తగ్గిపోవటం.. మద్యం మాఫియా దందా ఏ స్థాయిలో సాగుతోందో స్పష్టం చేస్తోంది. ఈ కారణంగానే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13 శాతం మద్యం అమ్మకాల పెరుగుదలను లక్ష్యంగా పెట్టుకున్న ఎక్సైజ్ శాఖ ఈ ఏడాది ఇప్పటిదాకా ఐదు శాతం పెరుగుదలను కూడా అధిగమించలేకపోయింది. 

గోవా నుంచి ‘జీరో మాల్’ స్మగ్లింగ్ 

ఉత్తరాంధ్ర జిల్లాలకు గోవా నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ మద్యంతో పాటు.. ఒడిశాలోని కొన్ని డిస్టిలరీలు, రాష్ట్రంలోని కొన్ని డిస్టిలరీల నుంచి కూడా పన్ను చెల్లించని అక్రమ మద్యం దొంగ రవాణా జరుగుతోందని ఎక్సైజ్ విభాగం సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ‘గోవా నుంచి విశాఖపట్టణానికి అక్రమంగా తరలిస్తున్న ఒక మద్యం లారీని తాటిచెట్లపాలెం వద్ద మా అధికారులు పట్టుకున్నారు. ఇందులో 1,100 కేసుల ఓల్డ్ టవెరన్, బ్యాగ్‌పైపర్ మద్యం సీసాలు రవాణా అవుతున్నట్లు గుర్తించారు. గోవాలోని రెండు డిస్టిలరీల నుంచి వీటిని అక్రమంగా కొనుగోలు చేసినట్లు తేలింది. హైదరాబాద్‌లోనిబీహెచ్‌ఈఎల్ గోదాం నుంచి తెచ్చినట్లు లారీ డ్రైవర్ చెప్పారు. మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్లతో గోవా నుంచి కటక్‌కు వెళుతున్నట్లు చిరాగ్‌పల్లి చెక్‌పోస్టు అధికారులకు వే బిల్లులు చూపించి మద్యం తరలించారు. 
Share this article :

0 comments: