రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే ప్రసాదరాజు తండ్రి మృతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే ప్రసాదరాజు తండ్రి మృతి

రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే ప్రసాదరాజు తండ్రి మృతి

Written By ysrcongress on Saturday, February 4, 2012 | 2/04/2012

యలమంచిలి (పశ్చిమగోదావరి), న్యూస్‌లైన్: నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు తండ్రి సత్యనారాయణరాజు (62) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ సంఘటన యలమంచలి మండలం కలగంపూడిలో శుక్రవారం రాత్రి జరిగింది. పొలం నుంచి ఇంటికి వెళ్తున్న ఆయన రోడ్డు దాటుతుండగా అంతర్వేది నుంచి వస్తున్న నరసాపురం డిపో ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఆయన తలకు తీవ్ర గాయమై దుర్మరణం చెందారు. 2009లో కాజ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేసిన సత్యనారాయణరాజుకు భార్య వెంకట సరోజిని, కుమారుడు ప్రసాదరాజు, కుమార్తె రాధిక ఉన్నారు. ప్రమాద విషయం తెలియగానే తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలో ఉన్న ప్రసాదరాజు హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. మంత్రి పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు తదితరులు ప్రసాదరాజును పరామర్శించారు.
Share this article :

0 comments: