హోరెత్తిన జనం.. darmavgaram images - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హోరెత్తిన జనం.. darmavgaram images

హోరెత్తిన జనం.. darmavgaram images

Written By ysrcongress on Monday, February 13, 2012 | 2/13/2012

* జగన్ పులివెందుల నుంచి ధర్మవరం వచ్చే మార్గంలో హోరెత్తిన జనం.. పూలవర్షాలు, హారతులతో ఎదురొచ్చిన అభిమానులు
* జన తాకిడితో దీక్షాస్థలికి ఆలస్యంగా చేరుకున్న జగన్
* దీక్షా ప్రాంగణానికి భారీగా తరలివచ్చిన నేతన్నలు

అనంతపురం, న్యూస్‌లైన్ ప్రతినిధి: చేనేతల సమస్యలపై ధర్మవరంలో నిరాహార దీక్ష చేపట్టేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఉదయం 10 గంటలకు వైఎస్సార్ జిల్లా పులివెందుల నుంచి బయల్దేరారు. సుమారు 115 కిలోమీటర్ల ప్రయాణం. షెడ్యూలు ప్రకారం ఆయన మధ్యాహ్నం 2 గంటలకల్లా దీక్షా ప్రాంగణానికి చేరుకోవాలి. అయితే సాయంత్రం ఆరు గంటలకుగానీ అక్కడకు వెళ్లలేకపోయారు. కారణం.. ఆయన ప్రయాణం సాగిన ప్రతి దారి పొడవునా, గ్రామగ్రామాన జనం పోటెత్తారు. ఎండలు మండిపోతున్నా రోడ్లపైనే వేచి చూశారు. ఆయన రాగానే పూల వర్షం కురిపించారు. డప్పులు, మంగళవాయిద్యాలతో అపూర్వ స్వాగతం పలికారు. మంగళహారతులు పట్టి ఆశీర్వదించారు.

మార్గమధ్యంలో వైఎస్ విగ్రహావిష్కరణలు
జగన్ ఉదయం 10 గంటలకు పులివెందుల నుంచి ముదిగుబ్బ మీదుగా ధర్మవరానికి బయలుదేరారు. దారిపొడవునా ఎదురుచూస్తున్న అభిమానులకు అభివాదం చేస్తూ అనంతపురం జిల్లా సరిహద్దు అయిన ముదిగుబ్బ మండలం పాలెంక్రాస్ వద్దకు చేరుకునేసరికి 11.50 గంటలైంది. ఇక్కడ జిల్లా నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. షెడ్యూలు సమయం కన్నా రెండు గంటలు ఆలస్యంగా 12.15 గంటలకు ఆయన దొరిగల్లుకు చేరుకున్నారు. జగన్ వస్తున్నారని తెలిసి జనమంతా ఇళ్లల్లో నుంచి బయటకు రావడంతో ఆ గ్రామం జనసంద్రమైంది. అభిమాన నేతపై దొరిగల్లు ప్రజలు బంతిపూల వర్షం కురిపించారు. అక్కడ ఆయన మహానేత వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

అనంతరం ఈదులపల్లెకు చేరుకుని వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ముదిగుబ్బ వచ్చారు. షెడ్యూలు ప్రకారం ఇక్కడకు మధ్యాహ్నం 12 గంటలకు రావాల్సి ఉండగా.. మూడు గంటలు ఆలస్యమైంది. అక్కడ జగన్‌ను చూసేందుకు భారీసంఖ్యలో వచ్చిన జనం పూలవర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు. తర్వాత బత్తలపల్లి చేరుకున్నారు. స్థానిక ఆర్డీటీ ఆసుపత్రి నుంచి ధర్మవరం రోడ్డు వరకూ జనం అడుగడుగునా బంతిపూలు, కనకాంబరాల వర్షం కురిపించారు.

కిక్కిరిసిన దీక్షా ప్రాంగణం
జగన్ ధర్మవరం మున్సిపల్ కార్యాలయం వద్దకు సాయంత్రం 5.15కు చేరుకున్నారు. అప్పటికే ఆ ప్రాంతమంతా జనంతో నిండిపోయింది. కదిరి గేటు, క్లాక్ టవర్ సర్కిల్ మీదుగా రోడ్‌షో నిర్వహిస్తూ దీక్షా ప్రాంగణానికి (ధర్మవరంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానం) చేరుకుని 48 గంటల దీక్షను ప్రారంభించారు. అప్పటికే ఆ మైదానమంతా ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. వారినుద్దేశించి జగన్ కాసేపు మాట్లాడారు. ప్రసంగం ముగిశాక.. దీక్షా శిబిరానికి తరలివచ్చిన ప్రజలతో ఆయన మమేకమయ్యారు. తన వద్దకు వచ్చిన నేతన్నల సమస్యలు, కష్టనష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికులకు చెందిన కుటుంబసభ్యులు జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి దీక్షకు సంఘీభావం తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, గురునాథరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు దేవగుడి నారాయణరెడ్డి, దేశాయి తిప్పారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వై.వి.సుబ్బారెడ్డి, రెహ్మాన్, భూమా నాగిరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, సినీనటుడు విజయచందర్, జిల్లా నాయకులు వై.విశ్వేశ్వరరెడ్డి, పైలా నర్సింహయ్య, తోపుదుర్తి కవిత, గిర్రాజు నగేష్, భాస్కరరెడ్డి, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 
















Share this article :

0 comments: