కాంగ్రెస్(ysr) ప్రభుత్వాన్ని దోషిగా చిత్రీకరిస్తున్న ఎమ్మార్ కేసులో ఇదొక సరికొత్త మలుపు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్(ysr) ప్రభుత్వాన్ని దోషిగా చిత్రీకరిస్తున్న ఎమ్మార్ కేసులో ఇదొక సరికొత్త మలుపు

కాంగ్రెస్(ysr) ప్రభుత్వాన్ని దోషిగా చిత్రీకరిస్తున్న ఎమ్మార్ కేసులో ఇదొక సరికొత్త మలుపు

Written By ysrcongress on Wednesday, February 15, 2012 | 2/15/2012

ఎమ్మార్ ప్రాపర్టీస్ భూ కేటాయింపుల్లో అవకతవకల వ్యవహారం తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పీకకూ చుట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనూ సాగిన ఎమ్మార్ భూ పందేరాలపైనా విచారణ సాగిస్తున్నట్టు సిబిఐ తనకుతానుగా సోమవారం సుప్రీం కోర్టుకు వివరణ ఇవ్వటం, అవినీతి వ్యవహారం కొత్త మలుపునకు సంకేతమేనని అంటున్నారు. ఇప్పటి వరకూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దోషిగా చిత్రీకరిస్తున్న ఎమ్మార్ కేసులో ఇదొక సరికొత్త మలుపుగానే అభివర్ణిస్తున్నారు. ఎమ్మార్ సంస్థకు భూములు కేటాయించిన వ్యవహారంపై ఎవరి ఒత్తిళ్లకూ లొంగకుండా నిర్భయంగా విచారణ సాగించాలని జస్టిస్ దల్భీర్ భంఢారీ, జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సిబిఐని ఆదేశించింది.

 
దీంతో ఇప్పటి వరకూ భూ కేటాయింపుల్లో తన ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందని నమ్మించేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొట్టే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు ఎకరం ఇరవై ఐదు లక్షల రూపాయలకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భూములను కేటాయించింది. అయితే ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు కేటాయించిన భూమిని ఆనుకుని ఉన్న తన భార్య భువనేశ్వరి పేరిట ఉన్న మూడు ఎకరాల భూమిని ఎకరం కోటి రూపాయలకు బాబు విక్రయించిన సంగతి తెలిసిందే. బాబుకు అత్యంత సన్నిహితుడైన కోనేరు ప్రసాద్ దుబాయి నుంచి ఈ భూమిని ఎమ్మార్‌కు కేటాయింపు చేయటంలో కీలకపాత్ర పోషించి, వందల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించినట్టు రుజువు కావటంతో జైలుకు వెళ్లారు.

 ఎమ్మార్‌ను రంగంలోకి దించి భూములను కేటాయించిన 2000 సంవత్సరం నుంచీ జరిగిన లావాదేవీలపై విచారణ సాగిస్తున్నట్టు సిబిఐ సోమవారం సుప్రీం కోర్టుకు మొట్టమొదటిసారి తెలియచేసింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రారంభమైన భూ పందేరంపై విచారణ జరపకుండా రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన లావాదేవీలపై మాత్రమే విచారించటం వల్ల నిజానిజాలు పూర్తిగా బయటపడవని వాదిస్తూ చంద్రబాబు హయాంలో జరిగిన కేటాయింపుపైనా దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ స్వాతంత్య్ర సమరయోధుడు భీమ్‌రెడ్డి ఎల్లారెడ్డి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను జస్టిస్ భండారీ, జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన బెంచి విచారణకు స్వీకరించింది. రాష్ట్ర హైకోర్టు విచారణకు సంబంధించి తమపై ఎలాంటి ఆంక్షలు, గడువు విధించలేదని సిబిఐ తరఫు వాదించిన రావత్ బెంచికి తెలిపారు. అంతేకాక ఎమ్మార్ ప్రాపర్టీస్‌ను రంగంలోకి దించి భూములను కేటాయించిన 2000నుంచీ జరిగిన అన్ని లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన కోర్టుకు వెల్లడించారు. ఇప్పటికే ఒక చార్జిషీటు దాఖలు చేశామని, అవసరమైతే అదనపు చార్జిషీటు దాఖలు చేస్తామని ఆయన తెలియచేశారు. 2000 నుంచీ జరిగిన లావాదేవీలను కూడా సిబిఐ విచారిస్తున్నందున ఎల్లారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నట్టు బెంచి ప్రకటించింది. తమపై సిబిఐ చేపట్టిన దర్యాప్తును నిలిపివేయాల్సిందిగా కోరుతూ ఎమ్మార్, జగతి పబ్లికేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను బెంచి కొట్టివేసింది.

source:  http://www.andhrabhoomi.net/content/emmar
Share this article :

2 comments:

SRINIVASA REDDY GUNTURU said...

Recently N.Chandra Babu Naidu said that a person has to be feel shamed when so many people are going to jail because of him, but I think he was forget that so many farmers died because of his ruling in his cm period

SRINIVASA REDDY GUNTURU said...

Monna chnadrababu matladuthu annadu, "oka vyakthi valla intha mandi jail ki veltunnananduku aa vyakthi siggupadalai" ani, mari chandra babu palanlo chandra babu valla entho mandi rythulu suicide chesukunnaru, daniki chandra babu ki siggu padalsina avasaram leda?