14న వైఎస్ జగన్ పర్యటన బుచ్చిరెడ్డిపాళెం మండలంలో - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 14న వైఎస్ జగన్ పర్యటన బుచ్చిరెడ్డిపాళెం మండలంలో

14న వైఎస్ జగన్ పర్యటన బుచ్చిరెడ్డిపాళెం మండలంలో

Written By ysrcongress on Monday, March 12, 2012 | 3/12/2012

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోవూరు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 14వ తేదీన బుచ్చిరెడ్డిపాళెం మండలంలో పర్యటించనున్నట్లు తాజా మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తెలిపారు. మండలంలోని రే బాలలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 14వ తేదీ ఉదయం 9 గంటలకు దామరమడుగు నుంచి ప్రారంభమై చెల్లాయపాళెం,రేబాల,నాగమాంబాపురం,ఇస్కపాళెం,పల్లాపల్లి, పోలినాయుడు చెరువు,మునులపూడి,రెడ్డిపాళెం, రామచంద్రాపురం, కట్టుబడిపాళెం మీదుగా బుచ్చిరెడ్డిపాళెం వరకూ సాగుతుందన్నారు. అనంతరం బుచ్చి పట్టణంలో జరిగే బహిరంగసభలో జగన్‌మోహన్ రెడ్డి ప్రసంగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని ప్రజలను కోరారు.
Share this article :

0 comments: