1,42,29,000 ‘సాక్షి’ పాఠకుల సంఖ్య - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 1,42,29,000 ‘సాక్షి’ పాఠకుల సంఖ్య

1,42,29,000 ‘సాక్షి’ పాఠకుల సంఖ్య

Written By ysrcongress on Tuesday, March 6, 2012 | 3/06/2012

* ఇండియన్ రీడర్‌షిప్ సర్వేలో వెల్లడి
* మూడు నెలల కాలంలోనే 93 వేలు పెరిగిన పాఠకులు
* సంచిక సగటు పాఠకుల సంఖ్యలోనూ దూసుకుపోతున్న ‘సాక్షి’

దినదిన ప్రవర్ధమానమై ఎదుగుతున్న తెలుగువారి మనస్సాక్షి ‘సాక్షి’ మరో ఘనతను సొంతం చేసుకుంది. ‘సాక్షి’ పాఠకుల సంఖ్య 2011 మూడో త్రైమాసికంతో పోల్చుకుంటే.. నాలుగో త్రైమాసికంలో గణనీయంగా పెరిగినట్లు ఇండియన్ రీడర్‌షిప్ సర్వే (ఐఆర్‌ఎస్)లో వెల్లడైంది. మూడో త్రైమాసికంలో ‘సాక్షి’ పాఠకుల సంఖ్య 1,41,36,000 ఉండగా నాలుగో త్రైమాసికానికి వారి సంఖ్య 1,42,29,000కు చేరినట్లు ఐఆర్‌ఎస్ అధ్యయనంలో స్పష్టమైంది. అంటే మూడు నెలల వ్యవధిలోనే ‘సాక్షి’ కుటుంబంలోకి అదనంగా93,000 మంది పాఠకులు చేరారన్నమాట! అదే సమయంలో ‘ఈనాడు’ పత్రిక.. తన పాఠకుల సంఖ్యను కోల్పోయింది. 

సగటు సంచిక పాఠకుల సంఖ్య (యావరేజ్ ఇష్యూ రీడర్‌షిప్-ఏఐఆర్)లో కూడా సాక్షి దూసుకుపోతోంది. 2011 మూడో త్రైమాసికంలో సాక్షి సంచిక సగటు పాఠకుల సంఖ్య 52,19,000 ఉండగా.. నాలుగో త్రైమాసికానికి అది 53,03,000కు పెరిగింది. ఇదే కాలానికి ఈనాడు పత్రిక సగటు సంచిక పాఠకుల సంఖ్య 1,10,000 తగ్గిపోవడం గమనార్హం. 2009 సంవత్సరం రెండో త్రైమాసికంలో ఐఆర్‌ఎస్ సర్వే పరిధిలోకి వచ్చినప్పట్నుంచి ఇప్పటిదాకా సాక్షి పత్రిక సగటు సంచిక పాఠకుల సంఖ్య 8,70,000 పెరగగా.. ఈనాడు పత్రిక సంచిక సగటు పాఠకుల సంఖ్య 5,35,000 పడిపోయింది.
Share this article :

0 comments: