19 నుంచి గుంటూరు జిల్లాలో ఓదార్పుయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 19 నుంచి గుంటూరు జిల్లాలో ఓదార్పుయాత్ర

19 నుంచి గుంటూరు జిల్లాలో ఓదార్పుయాత్ర

Written By ysrcongress on Thursday, March 8, 2012 | 3/08/2012

 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పుయాత్ర ఈ నెల 19నుంచి గుంటూరు జిల్లాలో ప్రారంభం కానుంది. చిలకలూరిపేట పట్టణంలోని భాస్కర్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన దివంగత వైఎస్సార్ విగ్రహాన్ని 19న ఆవిష్కరించి అనంతరం జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి మలివిడత ఓదార్పుయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఇప్పటివరకు 71 రోజులపాటు 13 నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగింది. యాత్రద్వారా జగన్ మొత్తం 1790.5 కి.మీ పర్యటించి 611 మహానేత వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. 

అడుగడుగునా పట్టుబట్టి అభిమానంతో జగన్‌ను గ్రామాల్లోకి తీసుకెళ్లడంతో షెడ్యూల్‌లో లేని గ్రామాలనుసైతం పర్యటించాల్సి వచ్చింది. దీంతో నిర్ణీత షెడ్యూల్ కంటే ఆలస్యంగా ఓదార్పుయాత్ర కొనసాగుతోంది. ఈ నెల 9 నుంచి చిలకలూరిపేటలో యాత్ర ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ కోవూరు ఉపఎన్నికల ప్రచారం షెడ్యూలు కంటే కొంత ఆలస్యంగా సాగుతోంది. దీంతో జిల్లాలో ఓదార్పుయాత్రను కొద్ది రోజులు వాయిదా వేశారు. 

19వ తేదీ నుంచి యాత్ర ప్రారంభించేలా షెడ్యూలు ఖరారు చేశారు. ఈ క్రమంలో బుధవారం పార్టీ నేతలు చిలకలూరిపేటలో జరిగే బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మండల నేతలతో సమావేశమై గ్రామాల వారీగా పరిస్థితిని సమీక్షించి విగ్రహాల ఏర్పాటు, ఇతర అంశాలపై చర్చించారు. జిల్లాలో ఓదార్పుయాత్ర షెడ్యూలులో లేని గ్రామాల్లో కూడా పర్యటించాల్సి వస్తోందని పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, ప్రోగ్రామ్ కమిటీ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్‌లు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. 

మార్చి ఒకటిని వినుకొండ నియోజకవర్గంలో రూపొందించిన షెడ్యూలు కాకుండా ప్రజలు పట్టుబట్టి మరీ జగన్ పర్యటించాల్సిందేనని కోరడంతో షెడ్యూలు లేని గ్రామాల్లో పర్యటించారని వివరించారు. చిలకలూరిపేట, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, ప్రత్తిపాడులోని మిగిలిన రెండు మండలాలు, వినుకొండ నియోజకవర్గంలో మిగిలిన మండలాల్లో యాత్ర కొనసాగుతుందని వివరించారు. 

బహిరంగసభ ఏర్పాట్లు పరిశీలన.. జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్, రాష్ట్ర ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘరామ్, పార్టీ నాయకులు తేళ్ళ సుబ్బారావుతో కలసి భాస్కర్ సెంటర్‌లో ఉన్న వైఎస్సార్ శిలాఫలకం వద్ద సభా వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. బహిరంగ సభ నిర్వహించే ప్రదేశాన్ని, పార్కింగ్ వసతి, పట్టణంలోని ప్రధాన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం నేతలు విలేకరులతో మాట్లాడుతూ కోవూరు ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న జననేత వైఎస్ జగన్‌మోహనరెడ్డికి ప్రజల అభిమానం అడుగడునా అడ్డుపడుతూ ఉండటంతో ఈ నెల 9 తేదీ చిలకలూరిపేటలో జరగాల్సిన పర్యటన వాయిదా పడిందన్నారు. 

19 తేదీ భాస్కర్ సెంటర్‌లో ఉన్న వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారని వివరించారు. కార్యకర్తలు, పార్టీ నాయకులు, అభిమానులు మార్పును గమనించి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైఎస్ ైచె ర్మన్ షేక్ అబ్దుల్లా, మాజీ కౌన్సిలర్లు గేరాలింకన్, గ్రంధి ఆంజనేయులు, మాజీ యార్డు డైరక్టర్ కొండవీటి ఆంజనేయులు, పార్టీ నాయకులు హిదయతుల్లా, లక్ష్మణ, అంజిరెడ్డి, రిక్షా జిలానీ, జాన్ ఉన్నారు.
Share this article :

0 comments: