మేలోగా ఎన్నికలు జరగకపోతే సెప్టెంబర్ 2 వరకు గడువు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మేలోగా ఎన్నికలు జరగకపోతే సెప్టెంబర్ 2 వరకు గడువు

మేలోగా ఎన్నికలు జరగకపోతే సెప్టెంబర్ 2 వరకు గడువు

Written By ysrcongress on Saturday, March 3, 2012 | 3/03/2012

ఎట్టకేలకు 17 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేశారు. ఈ స్థానాలకు ఎప్పటిలోగా ఉప ఎన్నికలు జరుగుతాయన్నది ఇప్పుడు ప్రధానాంశం. ప్రస్తుతం రాష్ట్రంలో 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై ఇంతకు ముందే వేటు వేసి ఉంటే, వాటితోపాటే, ఈ 17 స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరిగేవి. వీటన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరిగితే రాజకీయంగా ఇబ్బంది తప్పదని గ్రహించిన కాంగ్రెస్ నాయకత్వం అనర్హతలపై నిర్ణయం విషయంలో జాప్యం చేసింది. ఉప ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగియడంతో, ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. మరో ఆరు నెలల వరకు ఈ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగవన్న ధీమాతోనే కాంగ్రెస్ నాయకత్వం ఈ నిర్ణయాన్ని ప్రకటించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 

ప్రస్తుతం జరుగుతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (ఈనెల 6వ తేదీ) వెలువడిన వెంటనే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూలు వెలువడనుంది. ఏప్రిల్ 4తో రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వాటికి ఈనెల మొదటి వారంలో షెడ్యూలు వెలువడే అవకాశముంది. ఈ తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల విషయంలో నిర్ణయం తీసుకోకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన కారణంగానే 17 మంది శాసన సభ్యులపై వేటు వేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోపక్క.. ప్రస్తుత రాష్ట్రపతి పదవీ కాలం జూలై 24 తో ముగియనుంది. ఆ తేదీకి 60 రోజుల ముందే అంటే మే రెండో వారంలోనే రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూలు వెలువడే అవకాశాలున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన రాష్ట్రపతి ఎన్నికలకు ముందే ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయాలన్న సంప్రదాయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పాటిస్తోంది. అందువల్ల ఈ 17 స్థానాలకు మే నెల రెండో వారంలోగా ఎన్నికలు నిర్వహించే వీలుంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెల్లూరు లోక్‌సభ స్థానం కూడా ఖాళీగా ఉంది. ఈ ప్రకారం ఎన్నికలు జరగని పక్షంలో సెప్టెంబరు 2వ తేదీలోగా ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం ఎన్నికలకు సిద్ధంగా లేమని అధికారపక్షం ఎన్నికల సంఘానికి చెప్పే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
Share this article :

0 comments: