21న చిలకలూరిపేటలో వైఎస్సార్‌సీపీ సభ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 21న చిలకలూరిపేటలో వైఎస్సార్‌సీపీ సభ

21న చిలకలూరిపేటలో వైఎస్సార్‌సీపీ సభ

Written By ysrcongress on Monday, March 19, 2012 | 3/19/2012

గుంటూరు జిల్లా చిలుకలూరిపేటలో మార్చి 21 తేదిన జరుగనున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాట్లను ఆపార్టీ నేతలు మర్రి రాజశేఖర్, ఆళ్ల రామకృష్ణారెడ్డిలు పరిశీలించారు. ఈనెల చిలకలూరిపేటలో జరిగే సభలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పాల్గొంటారు. ఆ తర్వాత మార్చి 22, 23 తేదిల్లో చిలకలూరిపేటలో పర్యటించి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహావిష్కరణలను చేస్తారని మర్రి రాజశేఖర్ తెలిపారు.

జనం తిరగబడే రోజు ముందుంది: భూమన

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై జనం తిరగబడే రోజు ఎంతో దూరంలో లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేత భూమన కరుణాకరరెడ్డి అన్నారు. తిరుపతి నిర్వహించిన మహాధర్నాలో కరుణాకరరెడ్డి మాట్లాడుతూ... ప్రజల కష్టాల్ని పట్టించుకోని నేతలకు మనుగడ ఉండదు అని అన్నారు. 

తిరుపతి పట్టణంలో ఉన్న పలు వార్డుల్లో నెలకొని ఉన్న సమస్యలపై మహిళలు మండిపడ్డారు. వేలాది మందిగా తరలివచ్చిన జనంతో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో బైఠాయించారు. 

నెల రోజుల్లో తిరుపతి పట్టణంలో ప్రజా సమస్యల్ని తీర్చకపోతే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది. మున్సిపల్ అధికారుల్ని వార్డుల్లో తిరుగనీయమని మహిళలు అన్నారు.
Share this article :

0 comments: