టీడీపీ ఓటుకు రూ. 500 నుంచిరూ. 800 పంచితే కాంగ్రెస్ పార్టీ వెయ్యి నోట్లు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీ ఓటుకు రూ. 500 నుంచిరూ. 800 పంచితే కాంగ్రెస్ పార్టీ వెయ్యి నోట్లు

టీడీపీ ఓటుకు రూ. 500 నుంచిరూ. 800 పంచితే కాంగ్రెస్ పార్టీ వెయ్యి నోట్లు

Written By ysrcongress on Saturday, March 17, 2012 | 3/17/2012

 దేశ ఎన్నికల చరిత్రలో ఎన్నడూ ఎక్కడా లేని విధంగా నెల్లూరు జిల్లా కోవూరు ఉప ఎన్నికలో విచిత్ర రాజకీయ పర్వానికి తెర లేచింది. ఇప్పటి వరకూ జరిగిన ఏ ఎన్నికల్లో అయినా రాజకీయ పార్టీలు తమకు ఓట్లు సంపాదించుకోవడానికి డబ్బులు పంచుతూ వస్తున్నాయి. కోవూరులో మాత్రం కాంగ్రెస్, టీడీపీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓటేయవద్దంటూ విచ్చల విడిగా డబ్బులు పంపిణీ చేస్తున్నాయి. 

ఈ ఎన్నిక ఫలితం రాష్ట్ర రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసే వాతావరణం ఏర్పడింది. అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తాము గెలవడానికి కాకుండా, వైఎస్సార్ కాంగ్రెస్‌కు భారీ విజయం దక్కకుండా చేయాలని తీవ్రంగా కష్టపడుతున్నాయి. పోలింగ్‌కు సమయం దగ్గర పడడంతో ఈ రెండు పార్టీలు బుధవారం అర్ధరాత్రి నుంచి గ్రామాల్లో నోట్ల వరద పారిస్తున్నాయి. టీడీపీ ఓటుకు రూ. 500 నుంచిరూ. 800 పంచితే కాంగ్రెస్ పార్టీ వెయ్యి నోట్లు వెదజల్లుతోంది. ప్రజల ఫిర్యాదులతో పోలీసులు అరకొర దాడులు చేసినా పంపిణీ జోరు మాత్రం తగ్గలేదు.

వైఎస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్, టీడీపీలకు కోవూరు ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. ఎన్నిక ఫలితం ఎలా ఉండబోతుందో కాంగ్రెస్, టీడీపీలకు బాగా అర్థమైంది. తమ పార్టీల సిద్ధాంతాలు, అధినేతల ప్రసంగాలను న మ్మి జనం తమకు పట్టం కట్టరనే వాస్తవాన్ని వారు గుర్తించారు. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ ఆధిక్యత దక్కితే ఈ రెండు పార్టీల్లో బ్లోఅవుట్ పేలే ప్రమాదం ముంచుకొస్తోంది. 

దీంతో ఈ రెండు పార్టీల అగ్రనాయకులు కోవూరులో విస్తృతంగా పర్యటించారు. రెండేళ్లుగా రోజూ ఏడుస్తున్న ఏడుపులే కోవూరు జనం ముందు ఏడ్చారు. అవినీతి పేరుతో అవాస్తవ ప్రచారం చేసి, జనం బుర్రలు పాడు చేసేందుకు శక్తికి మించి ప్రయత్నాలు చేశారు. తాము గెలిస్తే కోవూరును భూలోక స్వర్గం చేస్తామనే రీతిలో హామీల వర్షం కురిపించారు. ఇంతా చేసి నానా పాట్లు పడినా తమ కోరిక తీరే అవకాశమే లేదనే విషయం గుర్తించారు. చివరి ప్రయత్నంగా ఓటర్లను నోట్లతోను, మద్యం సీసాలతోను ప్రలోభాలకు గురి చేయడానికి బరితెగించారు.

కోట్లకు కోట్ల రూపాయల నోట్ల సంచులు నెల్లూరుకు దిగుమతి చేసుకున్నారు. టీడీపీ శ్రేణులు బుధవారం రాత్రి నుంచి గ్రామాల్లో నిద్దర పోతున్న వారిని లేపి ఓటుకు రూ. 500 నుంచి రూ. 800 వరకూ ముట్టజెప్పాయి. ఈ డబ్బు తీసుకుని ఓటు తమకు వేయక పోయినా ఫర్వాలేదు, వైఎస్సార్ కాంగ్రెస్‌కు మాత్రం వేయవద్దని వేడుకున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ మెజారిటీ ఎంత భారీగా తగ్గితే తమ రాజకీయ భవిష్యత్తుకు అంత గట్టి పునాది పడుతుందనుకుంటున్న కాంగ్రెస్ నేతలు జనాన్ని వెయ్యి రూపాయల నోట్లతో కొట్టే రాజకీయం ప్రారంభించారు. 

ఎన్నికల సంఘం, పోలీసు అధికారులు హడావుడి చేస్తున్నా ఏమాత్రం తొణుకు, బెణుకు లేకుండా యథేచ్చగా నోట్ల పంపిణీ కానిచ్చేస్తోంది. ఈ బరితెగింపు చూసి ఆగ్రహిస్తున్న జనం పోలీసులకు ఫోన్లు చేసి డబ్బులు పట్టుకోండంటూ సమాచారం ఇస్తున్నారు. రూ 50 వేలు, రూ లక్ష లాంటి చిన్నమొత్తాలను మాత్రం స్వాధీనం చేసుకుంటున్నారు. భారీ మొత్తాలు దొరికితే మాత్రం తమకెక్కడ ఇబ్బందులు ఎదురవుతాయోననే భయంతో వారు నిశ్చేష్టులై చూడడం మినహా ఏమీ చేయలేక పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గురువారం నుంచి నోట్ల పంపిణీ మరింత ఊపందుకుంది.

గ్రామాల్లో ఎక్కడ చూసినా నోట్ల జాతర సాగుతోంది. శుక్రవారం రాత్రి దాకా వెయ్యి నోట్లు చేరని గ్రామాల వాసులు ఇది తమ సొమ్మేలే అనే విధంగా నిద్దుర మేలుకుని ఎదురు చూస్తున్నారు. రెండు పార్టీల నేతలు మండలాల వారీగా మద్యం నిల్వలు సిద్ధం చేసుకుని గ్రామాలకు తరలించి మందుబాబులకు అందిస్తున్నారు. ఓటుకు వెయ్యిచ్చినందువల్ల తమకుపడే ఓట్లు గట్టిగా నిలవడంతో పాటు, వైఎస్సార్ కాంగ్రెస్‌కు వేయాలనుకున్న ఓట్లలో కొన్నయినా చీలకపోతాయా? అనే ఆశ కాంగ్రెస్‌లోనూ, ఇదే రకమైన అంచనా టీడీపీలోనూ వ్యక్తమవుతోంది. 

కోవూరు ఉప ఎన్నిక పుణ్యమా అని తమకు ఊహించనంత డబ్బులు అందుతుండటంతో ఓటర్లు ఆనందంగా ఉన్నారు. డబ్బు ఎవరు ఎంత ఇచ్చినా ఓటు మాత్రం తాము ఎవరికి వేయాలనుకుంటున్నామో వారికే వేస్తామని జనం చెబుతుండడం ఈ రెండు పార్టీలకు చెమటలు పట్టిస్తోంది. కాంగ్రెస్, టీడీపీ భారీ మొత్తంలో నోట్లిచ్చి ఓట్లను ఏమాత్రం బదిలీ చేయించుకోగలిగారనే విషయం ఈనెల 21వ తేదీ తేలనుంది. 

నిఘా వైఫల్యం 
కోవూరు ఓటర్లకు డబ్బు పంపిణీ విచ్చలవిడిగా సాగుతున్నా అరికట్టడంలో పోలీసులు, నిఘా శాఖ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కోవూరు నియోజకవర్గం చుట్టుపక్కల భారీ ఎత్తున పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వచ్చే పోయే వాహనాలన్నీ తనిఖీ చేసి సామాన్యులను వేధిస్తూ హడావుడి చేస్తున్న పోలీసులకు డబ్బు ఎలా తరలి వెళుతున్నదనే విషయం పట్టడం లేదు. ఓవైపు నుంచి కాంగ్రెస్, మరో వైపు నుంచి టీడీపీ నాయకులు భారీ ఎత్తున ఓటర్లను కొనుగోలు చేసేందుకు గ్రామాల్లో జొరబడుతున్నా వారి కదలికలను మాత్రం నిఘా విభాగం సిబ్బంది పసిగట్ట లేక పోతున్నారా? అనే అనుమానం కలుగుతోంది. 

విషయం తెలిసి కూడా ఊరకుంటున్నారా? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. ఉన్నత స్థాయిలో కాంగ్రెస్, టీడీపీలతో అధికారులు కుమ్మక్కు అయ్యారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఓటుకు రూ.500 నుంచి రూ.1000 రూపాయల వరకూ పంపిణీ జరుగుతోందంటే ఆ మేరకు కొన్ని పదుల కోట్లు కోవూరు పొలిమేరల్లో నుంచి లోపలికి వెళుతూ ఉండాలి. ఇంత పెద్దమొత్తం ప్రవహిస్తున్నా అధికారులు కళ్లు మూసుకున్నారంటే ఇక ఎన్ని పోలీసు చెక్‌పోస్టులు పెడితే మాత్రం ప్రయోజనం ఏమిటని అంటున్నారు.
Share this article :

0 comments: