అవినీతి గురించి మాట్లాడుతున్న చంద్రబాబూ.. కోవూరులో ఓటుకు రూ.500 చొప్పున పంచిన డబ్బంతా ఎక్కడిది? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అవినీతి గురించి మాట్లాడుతున్న చంద్రబాబూ.. కోవూరులో ఓటుకు రూ.500 చొప్పున పంచిన డబ్బంతా ఎక్కడిది?

అవినీతి గురించి మాట్లాడుతున్న చంద్రబాబూ.. కోవూరులో ఓటుకు రూ.500 చొప్పున పంచిన డబ్బంతా ఎక్కడిది?

Written By ysrcongress on Monday, March 26, 2012 | 3/26/2012

* రానున్న ఉపఎన్నికల కోసం కాంగ్రెస్, టీడీపీ లోపాయికారీ ఒప్పందం
* ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ.. మిగతా వాటిలో కాంగ్రెస్ పోటీ చేసేటట్లుగా పరస్పరం ఒప్పందం చేసుకున్నాయి
* ఈ రెండు పార్టీలు డబ్బు వెదజల్లి ప్రజల ఆత్మగౌరవాన్ని కొనాలనుకుంటున్నాయి.. మనఃసాక్షి ప్రకారం ఓటు వేయండి..
* మీ తీర్పు ఈ సర్కారు కళ్లు తెరిపించాలి.. ఢిల్లీ దిమ్మ తిరగాలి
* పల్లెల్లో రైతన్నలు పడుతున్న బాధలు వారికి అర్థం కావాలి
* విలువలకు, వంచనకు మధ్య ఎన్నికలివి.. విశ్వసనీయతకే పట్టం కట్టండి
* అవినీతి గురించి మాట్లాడుతున్న చంద్రబాబూ.. కోవూరులో ఓటుకు రూ.500 చొప్పున పంచిన డబ్బంతా ఎక్కడిది?
* రెండెకరాల నుంచి వేల కోట్లు ఎలా సంపాదించావు?
* పక్కరాష్ట్రాల్లో కూడా హెరిటేజ్ షాపులు ఎలా వచ్చాయి?

ఓదార్పుయాత్ర నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: త్వరలో రానున్న ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మధ్య అప్పుడే లోపాయికారీ ఒప్పందం కుదిరిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ప్రత్తిపాడు, ఎమ్మిగనూరు, పాయకరావుపేట, అనంతపురం, రాయదుర్గం నియోజకవర్గాలను చంద్రబాబు నాయుడుకి వదిలేసి మిగిలిన వాటిల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేలా ఒప్పందం కుదిరినట్లు చెప్పారు. 

రానున్న ఉప ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు డబ్బును వెదజల్లి, ప్రజల ఆప్యాయతను, అనురాగాన్ని, ఆత్మగౌరవాన్ని వేలం వేసి కొనేందుకు సిద్ధమవుతున్నాయని నిప్పులు చెరిగారు. వారు డబ్బులు ఇస్తే వద్దనకుండా తీసుకుని.. ఓటును మాత్రం మనఃసాక్షి ప్రకారం వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో భాగంగా ఆదివారం చిలకలూరిపేట నియోజకవర్గ కేంద్రంలో జగన్ పర్యటించారు. ఏడు వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. ప్రత్తిపాడు నియోజకవర్గ కేంద్రంలో వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి, పెద్ద ఎత్తున తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఆ ప్రసంగం సారాంశం ఆయన మాటల్లోనే...

ఒకవైపు విలువలు.. మరోవైపు వంచన..
త్వరలో ఇక్కడ (ప్రత్తిపాడు) ఎన్నికలు జరుగుతాయి. ఇవి ఇద్దరు పార్టీల మధ్య జరుగుతున్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికల్లో రైతన్న, పేదవాడు వీళ్లిద్దరు ఒకవైపు ఉంటే.. కుళ్లుకుతంత్రాలతో కూడిన రాజకీయ వ్యవస్థ మరోవైపు ఉండి పోటీ పడుతున్నాయి. ఈ పోటీలో విలువలు, విశ్వసనీయత ఒకవైపున ఉంటే.. వంచనతో కూడిన రాజకీయాలు మరోవైపున ఉన్నాయి. ఈ పోరులో మనం విలువలను గెలిపించుకుందాం.. విశ్వసనీయతకు తోడుగా నిలబడదాం.. రైతన్నకు అండగా నిలబడుదాం.. మీరు వేసే ఓటుతో ఈ రాష్ట్ర సర్కారు కళ్లు తెరవాలి. పల్లెల్లో రైతన్న పడుతున్న బాధలు వీళ్లకు అర్థం కావాలి. వీళ్లను నడిపిస్తున్న ఢిల్లీ పెద్దల దిమ్మ తిరగాలి. నేను ఒక్కమాట చెప్తున్నాను.. రానున్న ఎన్నికల్లో ఈ రాజకీయ పార్టీల నేతలు మూటలకు మూటలు డబ్బుల సంచులు తీసుకొని వస్తారు. ఆప్యాయతలను.. ఆత్మీయతను వేలం వేసి కొనే ప్రయత్నాలు చేస్తారు. 

వాళ్లు డబ్బులు ఇస్తామని వచ్చినప్పుడు ఏ ఒక్కరు కూడా వద్దు అని అనబోకండి.. డబ్బులు తీసుకోండి కానీ మనఃసాక్షి ప్రకారం ఓటేయండి. ఈ వ్యవస్థ మారాలి. డబ్బు, మద్యంతో వీళ్లు రాజకీయాలు చేయలేరు. ప్రజ లకు మనోభావాలున్నాయి.. వారికి ఆత్మగౌరవం ఉందన్న సంకేతాలు వీళ్లిద్దరికీ తెలియాలి. ఈ జిల్లా నుంచి రామకృష్ణన్న, మీ నియోజకవర్గం నుంచి నా చెల్లెమ్మ సుచరితమ్మ నిలబడ్డారు. నా చెల్లి డిస్‌క్వాలిఫై అవుతానని తెలిసి కూడా రైతన్న పక్షాన నిలబడింది. పేదవానికి అండగా నిలిచింది. నేను వీళ్లిద్దరిని చూసి గర్వపడుతున్నా. ఎన్నికలు వచ్చినప్పుడు మీ చల్లని దీవెనలు.. చల్లని ఆశీస్సులు సుచరితమ్మకు అందివ్వాలని సవినయంగా చేతులు జోడించి పేరుపేరునా ప్రార్థిస్తున్నా.

బాబూ.. ఆ డబ్బెక్కడిది?
కాంగ్రెస్, టీడీపీల నీచరాజకీయాలు ఎంతకు దిగజారి పోయాయి అంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీరిద్దరూ కలిసికట్టుగా పోటీ చేస్తారు. ఇద్దరూ ఒక్కటై ఆర్టీఐ కమిషనర్ పదవులు కలిసి పంచుకుంటారు. చివరికి చంద్రబాబునాయుడును ప్రసన్నం చేసుకోవడం కోసం కాంగ్రెస్‌కు చెందిన ముఖ్యమంత్రులు... హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న అమీర్‌పేటలో ఐదెకరాల భూమిని చంద్రబాబు మనుషులకు కేటాయిస్తారు. కోవూరు ఎన్నికల్లో చంద్రబాబునాయుడు, కాంగ్రెస్ పెద్దలు మైకులు పట్టుకుని మాట్లాడారు. అవినీతి.. అవినీతి.. అవినీతి అని ప్రచారం చేశారు. తీరా చూస్తే.. అవినీతి గురించి మాట్లాడే ఈ ప్రబుద్ధులే ఎన్నికల్లో మళ్లీ డబ్బు పంచుతారు. అయ్యా.. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఓటుకు రూ.500 చొప్పున పంచిన డబ్బు ఎక్కడ్నుంచి తెచ్చావు అని అడుగుతున్నా.. ఇదే చంద్రబాబు గ్రామగ్రామంలో బెల్టు దుకాణాలు పెట్టి ప్రతి గ్రామంలో మద్యాన్ని సెలయేరులాగా పారించారు. రెండెకరాల భూమి నుంచి వేల కోట్లు సంపాదించారు. 

మన రాష్ట్రంలోనే కాదు పక్కరాష్ట్రాల్లో కూడా ఎక్కడ చూస్తే అక్కడ హెరిటేజ్ షాపులు పెట్టారు. అలాంటి చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడుతున్నారు. స్కూలు పిల్లల దగ్గరకు, కాలేజీ పిల్లల దగ్గరకు వెళ్లి వాళ్లకు అవినీతి గురించి పాఠాలు చెప్తారు. చంద్రబాబు నిన్ను ఒకే ఒక మాట అడగాలనుకుంటున్నా.. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. మీ హయాంలో ఏ ఒక్కరోజైనా ఆ పిల్లల దగ్గకు వెళ్లావా? ఆ పిల్లలు ఎలా చదువుకుంటున్నారని ఆలోచన చేశావా? పిల్లల చదువు కోసం ఆ తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారనే ఆలోచన నీకు ఎప్పుడైనా తట్టిందా..?

అప్పుడే అవిశ్వాసం పెట్టి ఉంటే..
అన్యాయమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంటే విపక్షంలో కూర్చున్న చంద్రబాబు అసెంబ్లీ వేదికగా చేసుకొని రాజకీయాలు చేయటం మొదలుపెట్టాడు. ఈ చంద్రబాబు.. పీఆర్పీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాకముందు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఉంటే.. ఈ ప్రభుత్వం కుప్పకూలిపోయేది. కానీ చిరంజీవి పార్టీ కాంగ్రెస్‌లో కలిసిపోయాక, ఇక కాంగ్రెస్‌కు ఎలాంటి ముప్పు ఉండదని తెలుసుకున్న తర్వాత అవిశ్వాసం పెట్టారు. అప్పుడు నాకు బాగా గుర్తుంది. రైతుల బతుకులు అతలాకుతలంగా ఉన్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో అయితే వరలక్ష్మి అనే విద్యార్థిని ఫీజులు అందక ఆత్మహత్య చేసుకుంది. అప్పుడు మాత్రం చంద్రబాబుకు అవిశ్వాసం పెట్టాలని అనిపించలేదు. చిరంజీవి పార్టీ విలీనం అయ్యాక.. ఈ ప్రభుత్వం పడిపోదు అని నిర్ధారించుకున్న తర్వాతే అవిశ్వాస తీర్మానం పెట్టారు. 

విలువలకు కట్టుబడాలని నా ఎమ్మెల్యేలకు చెప్పా..
అవిశ్వాసం సమయంలో నేను నా ఎమ్మెల్యేలకు ఒక్కటే చెప్పా... వాళ్లు ఏ ఉద్దేశంతో అవిశ్వాసం పెట్టినా నాయకుడు అనే వాడికి విలువలు.. విశ్వసనీయత ఉండాలని. ఎన్నాళ్లు బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నదే ముఖ్యమని చెప్పా. డిస్‌క్వాలిఫై అయినా.. ఎమ్మెల్యే పదవి పోయినా.. ఉప ఎన్నికలు వస్తాయని తెలిసినా.. పేదలు, రైతుల పక్షాన నిలబడాలని వారికి చెప్పా. ఆ మాటను గౌరవించి ఎమ్మెల్యేలు ముందుకు వచ్చి అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేశారు. విశ్వసనీయతకు, విలువలకు గౌరవం ఇచ్చి రైతు, పేదవాని పక్షాన నిలబడ్డ ఏకైక పార్టీ ఒక్క వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని ఆ 17 మంది ఎమ్మెల్యేలు చాటారు. వారందరికీ నేను సగర్వంగా సెల్యూట్ కొడుతున్నా.

కూలుతున్న వైఎస్ స్వప్నాలు..
గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులెవరూ ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉండొద్దని, వారి సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించేందుకు దివంగత వైఎస్ ఒక స్వప్నం చూశారు. ఆ స్వప్నం పేరు రచ్చబండ. ఈ కార్యక్రమం ద్వారా కులాలు, మతాలు, పార్టీలు, రాజకీయాలకు అతీతంగా పథకాలన్నీ ప్రజలకు అందాలని ఆయన తపిం చారు. ఆ స్వప్నాన్ని ఈరోజు ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. ఒక్క నాయకుడు గ్రామాలకు రాడు. పేదల బాధలను చూసే నాథుడే కరువయ్యాడు.
Share this article :

0 comments: