కేసులో హైకోర్టు జగన్‌ను 52వ బాధ్యునిగా పేర్కొంటే సీబీఐ మాత్రం తన ఎఫ్‌ఐఆర్‌లో మొదటి ముద్దాయిగా చేర్చింది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేసులో హైకోర్టు జగన్‌ను 52వ బాధ్యునిగా పేర్కొంటే సీబీఐ మాత్రం తన ఎఫ్‌ఐఆర్‌లో మొదటి ముద్దాయిగా చేర్చింది

కేసులో హైకోర్టు జగన్‌ను 52వ బాధ్యునిగా పేర్కొంటే సీబీఐ మాత్రం తన ఎఫ్‌ఐఆర్‌లో మొదటి ముద్దాయిగా చేర్చింది

Written By news on Monday, March 12, 2012 | 3/12/2012

‘‘జగన్ ఆస్తుల కేసు విషయమై వివాదాస్పదంగా మారిన 26 జీవోల విషయంలో సీబీఐ చేస్తున్న విచారణ పూర్తిగా చట్టవిరుద్దంగా ఉంది. సీబీఐ బరితెగించి ప్రవర్తిస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సార్లు చెప్పినప్పటికీ లాభం లేకపోయింది. జగన్ విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని చూసి ఒక స్వసంత్ర న్యాయవాది పి.సుధాకర్‌రెడ్డి న్యాయస్థానం తలుపు తట్టారు. రాష్ట్రంలో సీబీఐ కోర్టు, హైకోర్టులో విఫలమైన సుప్రీంలో విజయం సాధించారు. దేశంలో అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన నోటీసులు సీబీఐకి చెంపపెట్టు లాంటివే కాక ప్రభుత్వ డొల్లతనాన్ని బయటపెట్టింది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యుడు డి.ఎ.సోమయాజులు వ్యాఖ్యానించారు. పార్టీ నేతలు వాసిరెడ్డి పద్మ, గట్టు రామచంద్రరావుతో కలిసి సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీబీఐ విచారణ బిజినెస్ నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతుందని విమర్శించారు. 

‘‘సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో మొదటి 15 పేజీలు 26 జీవోలను ఉంటంకించింది. అలాంటిది సంబంధిత వ్యక్తులు సెక్రటరీలు, జీవోలను ఆదేశించిన మంత్రులను చేర్చలేదు. ఈ కేసులో హైకోర్టు జగన్‌ను 52వ బాధ్యునిగా పేర్కొంటే సీబీఐ మాత్రం తన ఎఫ్‌ఐఆర్‌లో మొదటి ముద్దాయిగా చేర్చింది. కేసులో ఎక్కడా ప్రస్తావనకు రాని విజయసాయిరెడ్డిని రెండో ముద్దాయిగా చేర్చింది. ప్రధానంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్న 26 జీవోలను విడుదల చేసిన సెక్రటరీలను, సంబంధిత మంత్రులను ఎందుకు చేర్చలేదు? 2జీ కుంభకోణంలో అవకతవకలు జరిగాయని జీవోలు విడుదల చేసిన సెక్రటరీలను, మంత్రులను జైల్లో వేసింది. అక్కడ ప్రధాని ఎక్కడా తప్పు పట్టలేదు. కానీ ఇక్కడ అదే సీబీఐ వింతగా ప్రవర్తిస్తుంది. దీంతో సీబీఐ ధోరణిని ఏంటనేది తేటతెల్లం చేస్తుంది’’ అని అన్నారు. 

ప్రభుత్వం లాయర్‌ను కూడ పెట్టలేదు 

‘‘హైకోర్టులో సంబంధిత 26 జీవోలపై ప్రభుత్వ స్పందన కోరితే ఎలాంటి సమాధానం లేదు. కేసు 8 నెలలుగా కోర్టులో వాదనలు జరుగుతున్నా అడ్వకేట్ జనరల్ కన్నెత్తి చూడకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. శంకర్రావు, టీడీపీ నేతలు కలిసి చేసిన ఆరోపణ ప్రభుత్వ జీవోలపైనే! ప్రధాన ఆరోపణ రాష్ట్ర ప్రభుత్వం, సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలను బాధ్యులుగా చేశారు. దురదష్టమేంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాయర్‌ను కూడా పెట్టుకోలేదు. ఒక్క జీవోపై వివాదం తలెత్తితేనే అడ్వకేట్ జనరల్ కౌంటర్ దాఖలు చేస్తారు. అలాంటిది 26 జీవోలకు సంబంధించిన దానిపై 8నెలలు వాదనలు కొనసాగుతున్నా ప్రభుత్వం కన్నెత్తి చూడలేదు. వింత ఏంటంటే ఎక్కడా లేని విధంగా ప్రధాన ప్రతిపక్షం, అధికార పక్షంతో కలిసి వేసిన పిల్ వేయడం ప్రపంచంలో ఇదే మొదటిది కావచ్చు’’ అని తెలిపారు. 



జీవోలు విడుదల చేసిన సెక్రటరీలు, మంత్రులను వదిలేసిన సీబీఐ జగన్‌ను ప్రశ్నిస్తాననటం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. జీవోలతో జగన్ ఏంటి సంబంధం? జగన్ ఏనాడైనా సచివాలయనాకి వచ్చారా? మంత్రులను ప్రభావితం చేసే విధంగా జగన్ ఎలాంటి ప్రభుత్వ పదవి చేపట్టలేదు కదా అని సోమయాజులు నిలదీశారు. సీబీఐ వ్యవహరిస్తున్న తప్పుడు విధానాలను విజయమ్మ లేఖల ద్వారా ప్రధాని దష్టికి తీసుకెళ్లినట్లు ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా సీబీఐ సరైన పద్దతిలో విచారణ చేపట్టాలని, అదే విధంగా వివాదాస్పద 26 జీవోలు కరెక్టా కాదా అనేది ప్రభుత్వం స్పందించాలని సోమయాజులు డిమాండ్ చేశారు.

Share this article :

0 comments: