కోవూరు నియోజక వర్గంలో అత్యధికంగా 80 శాతం పోలింగ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కోవూరు నియోజక వర్గంలో అత్యధికంగా 80 శాతం పోలింగ్

కోవూరు నియోజక వర్గంలో అత్యధికంగా 80 శాతం పోలింగ్

Written By news on Sunday, March 18, 2012 | 3/18/2012

రాష్ర్టంలో ఏడు శాసనసభ నియోజక వర్గాలకు ఆదివారం జరిగిన ఉప ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదయింది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజక వర్గంలో అత్యధికంగా 80 శాతం పోలింగ్ నమోదయినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. సాయంత్రం 5 గంటలకు నమోదయిన పోలింగ్ శాతం ఈ విధంగా ఉంది. 

నాగర్ కర్నూలు-65
మహబూబ్ నగర్-70
కొల్లాపూర్-61
కామారెడ్డి-68
స్టేషన్ ఘన్ పూర్-76
కోవూరు-81
ఆదిలాబాద్-61

 రాష్ర్టంలో ఏడు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో రాజీనామా చేసిన అభ్యర్థులే గెలుస్తారని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పారు. టీఆర్ ఎస్ ఐదు స్థానాల్లో గెలుస్తుందని తన సర్వేలో తేలిందన్నారు. ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత ఆదివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లడారు. కోవూరులో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రసన్నకుమార్ రెడ్డి, నాగర్ కర్నూలులో నాగం జనార్దనరెడ్డి విజయం సాధిస్తారని పేర్కొన్నారు. టీఆర్ ఎస్ కు 20 శాతం ఓట్లు తగ్గే అవకాశం ముందన్నారు. రెండేసి స్థానాల్లో టీడీపీ, కాంగ్రెస్ రెండో స్థానంలో నిలుస్తాయని అంచనా వేశారు. కాంగ్రెస్ కు ఓటెయ్యలా, వద్దా అనే అయోమయ పరిస్థితిలో ఓటర్లు ఉన్నారన్నారు. ఉప ఎన్నికలు తమకో గుణపాఠమని చెప్పారు. త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న 17 స్థానాలకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని లగడపాటి సూచించారు. 
Share this article :

0 comments: