సాక్షి టీవీ’కి మొత్తం 8 అవార్డులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సాక్షి టీవీ’కి మొత్తం 8 అవార్డులు

సాక్షి టీవీ’కి మొత్తం 8 అవార్డులు

Written By ysrcongress on Thursday, March 29, 2012 | 3/29/2012

* జాతీయ ఉత్తమ వార్తా వినోద కార్యక్రమంగా ఎన్‌టీ అవార్డు
* పలు విభాగాల్లో ‘సాక్షి టీవీ’కి మొత్తం 8 అవార్డులు

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: ప్రతిష్టాత్మక నేషనల్ టెలివిజన్ అవార్డుల్లో ‘సాక్షి టీవీ’ తన సత్తా చాటింది. పలు విభాగాల్లో సాక్షి టీవీ కార్యక్రమాలకు మొత్తం 8 అవార్డులు లభించాయి. గతంలో జాతీయ అవార్డును కైవసం చేసుకున్న ‘డింగ్ డాంగ్’ మరోమారు ఉత్తమ జాతీయ వార్తా వినోద కార్యక్రమంగా అవార్డు అందుకుంది. దీనితోపాటు.. సాక్షి టీవీలో ప్రసారమైన ‘బడ్జెట్ 2011’ - ఉత్తమ బిజినెస్ టాక్ షో, ‘రూపాయి’ - ఉత్తమ బిజినెస్ ఫీచర్ షో, ‘సాక్షి బిజినెస్’ - ఉత్తమ బిజినెస్ షో, ‘వేద ఘోష’- ఉత్తమ పరిశోధనాత్మక ఫీచర్‌గా జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి. 

ఉత్తమ ప్రైమ్ టైమ్ షోగా సాక్షి ప్రసారం చేసే ‘7 పీఎం ప్రైమ్ టైమ్ షో’ అవార్డు, ఉత్తమ పాపులర్ న్యూస్ షో గా ‘వరల్డ్ టుడే’, బెస్ట్ ప్రోమో క్యాంపెయినర్ విభాగంలో సాక్షి ‘సేవ్ గర్ల్ చైల్డ్’కు అవార్డులు దక్కాయి. బుధవారం ఢిల్లీలోని లలిత్ హోటల్‌లో ఘనంగా జరిగిన కార్యక్రమంలో సాక్షి టీవీ మార్కెటింగ్ డెరైక్టర్ రాణీరెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అరవింద్‌యాదవ్‌లు ఈ అవార్డులను అందుకున్నారు. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ ఈ అవార్డులను ప్రదానం చేశారు.
Share this article :

0 comments: