పరకాలలో విజయం మాదే: సురేఖ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పరకాలలో విజయం మాదే: సురేఖ

పరకాలలో విజయం మాదే: సురేఖ

Written By ysrcongress on Friday, March 9, 2012 | 3/09/2012

కడప ఎన్నికల్లో వైఎస్సా ర్ పార్టీ ఎంతమెజారిటీ సాధించిందో ప్రజలకు తెలుసునని.. రేపు కొవ్వూరులో...తర్వాత వచ్చే పరకాల ఉప ఎన్నికల్లోనూ అదే మెజారిటీ పునరావృత మవుతుందని మాజీ మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలకు తామెన్నడూ భయపడలేదని, పరకాల ప్రజలు తనను ఆదరించి గెలిపించేందుకు ఎప్పుడైనా సరే సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. తమకు సుశిక్షుతులైన సైనికుల్లాంటి కార్యకర్తలున్నార ని,వారే కొండంత అండగా నిలబడతారని తెలి పారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవాన గీసుకొండ మండలంలోని కొమ్మాల జాతర వేడుకగా.. మాజీమంత్రి కొండా సురేఖ ప్రచారశంఖం పూరించారు. పరకాల ఉపఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరతారనే దుష్ర్పచారం జరుగుతోందని.. ఆయన కాంగ్రెస్‌లో చేరాల్సిన అవసరం రానే రాదని.. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌పార్టీనే వైఎస్‌ఆర్ పార్టీలో వీలనమయ్యే పరిస్థితి వస్తుందని సురేఖ జోస్యం చెప్పారు. ఐదు రాష్ట్రాల్లో జరి గిన ఎన్నికల ఫలితాలు దేశంలో కాంగ్రెస్ ఎలాంటి పరిస్థితిలో ఉందో.. ఎంత పతనమైం దో తేల్చి చెప్పాయని ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ భావి ప్రధాని, సోనియా త్యాగశీలి అని ఊదరగొట్టిన ఆ పార్టీ నేతలు... వారి సొంత స్థానాలైన రాయ్‌బరేలీ, అమేథీలో ఎందుకు ఓడిపోయారో ప్రశ్నించుకోవాలన్నారు. రాష్ట్రం లో జగన్ చరిష్మా ముందు రాహుల్ చరిష్మా నిలబడదని తేల్చిచెప్పారు. గతంలో ఓదార్పుయాత్ర సందర్భంగానే కాంగ్రెస్ దుష్ట రాజకీయాలు చేస్తోందని, పూర్తిగా పతనమవుతోం దని తాను చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

వైఎస్‌ఆర్‌పై ఉన్న అభిమానంతోనే మంత్రి పదవికి రాజీనామా చేశానని, ప్రత్యేక తెలంగాణకు కట్టుబడి శాసనసభ్యత్వాన్ని వదులుకున్నానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజకీయాలు నీచస్థితికి చేరుకున్నాయని, అధికార దాహంతో వరంగల్ జిల్లాకు చెందిన మంత్రు లు సీఎం కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ‘మేం ప్రజల మనుషులం... రేపు కూడా ప్రజల్లోనే ఉంటాం. కొమ్మాల లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా చివరి శ్వాసవరకు కార్యకర్తలను కాపాడుకుంటాం.. నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటాం...’ అని సురేఖ స్పష్టం చేశారు.
Share this article :

0 comments: