నీ పిచ్చి రాతల వల్లే ముప్పు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నీ పిచ్చి రాతల వల్లే ముప్పు

నీ పిచ్చి రాతల వల్లే ముప్పు

Written By ysrcongress on Saturday, March 10, 2012 | 3/10/2012

* జగన్‌ను అరెస్టు చేస్తారని రామోజీకి అంత ఖచ్చితంగా ఎలా తెలుసు?
* తమకు పోలీసు బందోబస్తు కావాలంటూ సీఎంకు రామోజీ లేఖ రాశారు
* అరెస్ట్ చేస్తామని రామోజీకి సీబీఐ చెప్పిందా? సీబీఐకి రామోజీ చెప్పారా?.. జగన్‌ను ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఆధారాలున్నాయా?
* రెండున్నరేళ్లుగా జగన్‌పై విషం చిమ్ముతున్నా.. ఒక్క ఘటన జరిగిందా?
* వైఎస్‌పై ఎన్ని అసత్య కథనాలు రాశారు.. ఏనాడైనా వైఎస్ రాళ్లు వేయించారా?.. రామోజీకి మా వల్ల కాదు.. ప్రజల వల్లే ప్రమాదం
* మా కార్యకర్తలను కుక్కలు, పందులతో పోల్చి చిత్రీకరిస్తారా?

హైదరాబాద్, న్యూస్‌లైన్: ‘‘టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతిస్తున్న ‘ఈనాడు’ సంస్థల అధినేత రామోజీరావు మరో విషప్రచారానికి తెరదీశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేస్తారని, దానివల్ల తన సంస్థలపై దాడులు జరిగే అవకాశముందని పేర్కొంటూ.. పోలీసు బందోబస్తు కోసం పోలీసు శాఖకు, ముఖ్యమంత్రికి రామోజీ లేఖలు రాశారు. జగన్‌ను అరెస్టు చేస్తారని రామోజీకి అంత పక్కాగా ఎలా తెలుసు? సీబీఐ రామోజీకి చెప్పిందా? ఈయనే సీబీఐకి సూచించారా? లేక కాంగ్రెస్ నేతలేమైనా చెప్పారా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నిలదీశారు. ఆయన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కొన్ని ఆంగ్ల పత్రికల్లో వచ్చిన వార్తలను ఉటంకించారు. ‘‘రాష్ట్రంలో ఏదైనా జరిగితే ఎక్కడ ఎవరికి బందోబస్తు ఇవ్వాలో ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అలాంట ప్పుడు రామోజీరావు ముందుగానే ఎందుకంత ఉలిక్కిపడుతున్నారు?’’ అని నిలదీశారు. ‘‘అయినా జగన్‌ను సీబీఐ ఎందుకు అరెస్టు చేస్తుంది? సీబీఐ వద్ద ఏ విధమైన ఆధారాలున్నాయి? ఏమీ లేనప్పుడు అరెస్టు ఎందుకు చేస్తారు?’’ అని ప్రశ్నించారు.

తండ్రిని అంతమొందించి.. కొడుకును జైలుకు పంపుతారా?
‘‘రాష్ట్రాన్ని ఐదేళ్ల మూడు నెలలు విజయవంతంగా పాలించిన మహానేత వై.ఎస్‌ను అందరూ కలిసి రాజకీయ కుట్ర చేసి అంతమొందించారు. ఆయన కుమారుడు జగన్‌పై దొంగ అనే ముద్రవేసి జైలుపాలు చేసి రాష్ట్రాన్ని దోచుకోవాలని కాంగ్రెస్ - చంద్రబాబు - రామోజీ కుట్ర చేస్తున్నారు’’ అని అంబటి ఆరోపించారు. ‘‘అసెంబ్లీలో సీపీఐ సభ్యుడు ప్రస్తావించిన విషయాన్ని మేం చాలా కాలంగా చెప్తున్నాం. వైఎస్ మరణం ప్రమాదం కాదు.. నూటికి నూరు పాళ్లు రాజకీయ కుట్ర అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే వైఎస్ మరణం తర్వాత ఆయన కొడుకును అణచివేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్ని చూస్తున్న ప్రజలకు అర్థమవుతుంది. దేశంలో ఎంతో మందిపై సీబీఐ విచారణ జరగుతోంది. ఎవరిపై లేనంతగా జగన్ విష యంలో సీబీఐ ఎందుకంత దూకుడుగా వ్యవహరిస్తుంది?’’ అని ప్రశ్నించారు.

జగన్‌పై కుట్ర జరుగుతుందనటానికి అనేక ఆధారాలున్నాయన్నారు. ‘‘వైఎస్ కాలం నాటి 26 జీవోలపై హైకోర్టు ప్రశ్నిస్తే ప్రభుత్వం ఎందుకు సమాధానం ఇవ్వలేదు? జీవోలు విడుదల చేసిన సచివాలయ సిబ్బందికి, మంత్రులకు ఎలాంటి సంబంధం లేదట! కేవలం సీఎంగా వైఎస్‌కు, ఎక్కడో బెంగళూరులో వ్యాపారం చేసుకుంటున్న జగన్‌కు సంబంధం ఉందట! జగన్ ఏనాడైనా సచివాలయానికి వెళ్లారా? ఏ అధికారికైనా ఫోన్లు చేసి ఫలాన పనిచేయని చెప్పారా? వీటితో ఎలాంటి సంబంధంలేని జగన్‌ను ఎందుకు వేధిస్తున్నారు? వైఎస్ కడుపున పుట్టటమే జగన్ చేసిన పాపమా?’’ అని నిలదీశారు. జగన్‌పై కుట్రలు, కుతంత్రాలు చేస్తున్న వారికి, వీటన్నింటినీ గమనిస్తున్న ప్రజలే వారికి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.

నీ పిచ్చిరాతలే నీకు ప్రమాదం!
‘‘దివంగత వైఎస్ హయాంలో ఆయనకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనాడు పత్రిక ద్వారా ఎన్ని అసత్య కథనాలు రాశావో రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. విజయవంతంగా పాలిస్తున్న వైఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎన్ని టక్కుటమార విద్యలు చేశావో పాఠకులు గమనించారు. అయినా ఏనాడైనా వైఎస్ నీపై రాళ్లు వేయించారా? ఒక్క మట్టిపెళ్ల నీపై పడిందా? కనీసం ఒక్క మాటైనా అన్నారా? లేదే..! ‘ఆ రెండు పత్రికలు అబద్ధాలు రాస్తున్నాయి’ అని మాత్రమే అన్నారు. అలాంటి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జగన్‌పై ఎందుకు అభాండాలేస్తున్నారు? రెండున్నరేళ్లుగా జగన్‌పై అనునిత్యం విషం చిమ్ముతున్నారు మీరు.. ఏనాడైనా ఒక్క సంఘటనైనా జరిగిందా? లేదే’’ అని రామోజీపై అంబటి ధ్వజమెత్తారు.

‘‘రామోజీకి మా వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ రామోజీకి ఆయన రాసే పిచ్చిరాతలు, కూతల వల్ల ప్రజల నుంచి ప్రమాదం ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ‘‘రామోజీకి ప్రజలంటే ఎంత చులకన భావనంటే.. జగన్‌ను అరెస్టు చేస్తారంటూ వదంతులు విని వేలాది మంది కార్యకర్తలు వెళ్తే.. చేతిలో పేపరుందని వారిని కుక్కలు, పందులతో పోల్చి చిత్రీకరిస్తావా? నీ పాపం పండిన రోజున ఆ ప్రజలే తగిన బుద్ధి చెప్తారు’’ అని హెచ్చరించారు. చంద్రబాబు-రామోజీ ఇద్దరూ కలిసి తొమ్మిదేళ్ల పాటు రాష్ట్రాన్ని దోచుకున్న విధానాన్ని ప్రజలు గమనించినందు వల్లే.. బాబును రెండు సార్లు ఛీకొట్టారని మండిపడ్డారు. పేదల పొట్టకొట్టి స్టూడియోలు నిర్మించుకున్న రామోజీ పాపం పండిన రోజు ఆ భగవంతుడు కూడా కాపాడలేడని హెచ్చరించారు.

జగన్‌ను అరెస్టు చేస్తారంటూ ప్రజల్లో భయాందోళన రేకెత్తించి కోవూరు ఉప ఎన్నికల్లో టీడీపీకి లబ్ధిచేకూర్చేందుకు రామోజీ మరో కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కడప లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికల సందర్భంగా కూడా రామోజీ ఇలాంటి విషప్రచారాలతో ప్రజల్ని మభ్యపెట్టాలని చూశారని.. అక్కడ తన పాచిక పారకపోయే సరికి ప్రస్తుతం అదే కోవలో మరో కుట్రకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. అన్యాయం జరుగుతుంటే గొంతు ఎత్తాల్సిన పత్రికలే వ్యక్తిగత కక్షలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ప్రవర్తించటం దురదృష్టకరమన్నారు.

కాంగ్రెస్, టీడీపీ చేతులెత్తేశాయి...
రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరూ ముందుగానే చేతులెత్తేశారని అంబటి ఎద్దేవా చేశారు. ‘‘బొత్స మాట్లాడుతూ... ఏడు ఉప ఎన్నికల్లో టీడీపీకి మూడో స్థానమే అంటారు. చంద్రబాబు కూడా అదే విధంగా కాంగ్రెస్‌కు మూడో స్థానమే అంటున్నారు. అంటే ఈ రెండు పార్టీలు ఎన్నికలకు ముందుగానే చేతులెత్తేశాయని తేటతెల్లమవుతోంది’’ అని వ్యాఖ్యానించారు. జగన్‌పై చంద్రబాబు దుష్ర్పచారం చేస్తున్నారని.. ఎవరు నీతిమంతులనే దానిపై ఈ నెల 21న కోవూరు ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారని ఆయన పేర్కొన్నారు. కోవూరు ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని.. ఫలితాల తర్వాత జగన్ చెప్తున్న సువర్ణయుగానికి నాంది పలుకుతుందని చెప్పారు.
Share this article :

0 comments: