బొత్స సత్యనారాయణ సీబీఐ ముందు చెప్పిందేంటి? ‘ఈనాడు’ రాసిందేంటి? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బొత్స సత్యనారాయణ సీబీఐ ముందు చెప్పిందేంటి? ‘ఈనాడు’ రాసిందేంటి?

బొత్స సత్యనారాయణ సీబీఐ ముందు చెప్పిందేంటి? ‘ఈనాడు’ రాసిందేంటి?

Written By ysrcongress on Wednesday, March 28, 2012 | 3/28/2012

వైఎస్ ప్రతిష్టను టార్గెట్ చేస్తూ దిగజారుడు రాతలు 
తన అభ్యంతరాల్ని వైఎస్‌కు సీక్రెట్ నోట్‌గా పంపానన్న బొత్స 
దాన్ని వైఎస్ ఆమోదించారని ఒప్పుకోలు
అయినా అడ్డగోలు జీవోలంటూ వైఎస్‌పై రామోజీ విషం 
టెండర్ల దాఖలుకు ముందే ఎమ్మార్‌కు ఖరారైన ప్రాజెక్టు
దీన్ని సీబీఐకి చెప్పిన ఎమ్మార్ మాజీ సీఈఓ జగన్నాథన్ 
2001 మేలోనే తాము స్థలాల్ని ఖరారు చేసుకున్నామని వెల్లడి 
ప్రాజెక్టుకోసం 2001 జూలైలో నోటిఫికేషన్ ఇచ్చిన ఏపీఐఐసీ 
అంతకు ముందు నుంచే టచ్‌లో ఉన్న కోనేరు
ఇవేవీ పట్టించుకోకుండానే సాగుతున్న సీబీఐ దర్యాప్తు; దాని దార్లోనే ఎల్లో మీడియా శివాలు

అసలు బొత్స సత్యనారాయణ సీబీఐ ముందు చెప్పిందేంటి? ‘ఈనాడు’ రాసిందేంటి? వార్తలో లేని అంశాన్ని సైతం పతాక శీర్షికల్లో పెట్టి దివంగత నేత వైఎస్సార్ ప్రతిష్టను దిగజార్చటానికి రామోజీ ఎందుకిన్ని కుట్రలు చేస్తున్నారు? తన అభ్యంతరాలన్నిటినీ నాటి ముఖ్యమంత్రి వైఎస్ పరిగణనలోకి తీసుకున్నారని, సమావేశంలో పెట్టి ఆమోదించారని సీబీఐ ఎదుట బొత్స చెప్పిన అంశాన్ని రామోజీ ఎందుకు ప్రస్తావించలేదు? పెపైచ్చు దానికి వ్యతిరేక అర్థం వచ్చేలా శీర్షిక పెట్టి వైఎస్సార్ పేరు ప్రతిష్టల్ని ఎందుకు టార్గెట్ చేశారు? వీటన్నిటికీ తోడు ఎమ్మార్‌లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రను బొత్సతో సహా ఎందరు ప్రస్తావించినా రామోజీ అస్సలు ఆ ఊసెత్తటమే లేదు!!. ఇదంతా చూస్తున్నవారికి మరో అనుమానం వస్తోంది. బాబు కుట్రలో రామోజీకీ భాగం ఉందేమో... అని. లేకుంటే దొంగల్ని కాపాడటానికి రామోజీ ఎందుకింత తాపత్రయపడుతున్నారన్నది కూడా దర్యాప్తులో చేర్చాల్సిన అంశమే!!

ఇవీ... బొత్స చెప్పిన ప్రధానాంశాలు

ప్రాజెక్టు అమలుకు చంద్రబాబు ప్రభుత్వం ఆమోదించిన పద్ధతి పారదర్శకంగా లేదు. 
కన్వెన్షన్ సెంటర్, హోటల్‌లను నిర్మించే ఎస్‌పీవీ-3లో తొలుత ఏపీఐఐసీ వాటా 49, ఎమ్మార్ వాటా 51 శాతంగా ఉండేది. కాకుంటే వీటిని నిర్మించేది లీజు భూమి లో. లీజు కాలం 66 ఏళ్లు. అది ముగిశాక ఆ రెండిటినీ భూమితో సహా ఏపీఐఐసీకి అప్పగించాలి. అది ఎలాగూ ఏపీఐఐసీకి వచ్చేదే కనక దాన్లో వాటాను పెంచుకోవటం దండగని, అందుకు అదనపు పెట్టుబడి అనవసరమని భావించి వాటా తగ్గించుకోవటానికి ప్రభుత్వం సమ్మతించింది. 

2005 జనవరి 11న జీవో-14 జారీ చేసి... దాన్లో కొన్ని అంశాలపై స్పష్టత లేకపోవటంతో సవరించి జనవరి 27న జీవో-22 జారీ చేశారు. దీన్ని జారీ చేసేటపుడు పరిశ్రమల మంత్రినైన నా ద్వారా ఫైల్‌ను సర్క్యులేట్ చేయాల్సినా ప్రిన్సిపల్ కార్యదర్శి అలా చేయలేదు. జీవో ఇచ్చాక ఫైల్ నాకొచ్చింది. నేను కొన్ని లోటుపాట్లు గమనించి కామెంట్స్ రాశా. తర్వాత సీఎంతో జరిగిన సమావేశంలో ఇవి చర్చకొచ్చాయి కానీ పరిష్కారం కాలేదు. ఇవే అంశాలతో సీఎంకు సీక్రెట్ నోట్ రాశా. వాటిని ఆయన తదుపరి సమావేశంలో అధికారికంగా పెట్టి... 2005 మార్చి 23న ఆమోదించారు. 

ఇవీ సీబీఐకి బొత్స చెప్పిన ప్రధానాంశాలు. వీటిలో ఎక్కడైనా బొత్స చెప్పినట్లు... అయినా వినకుండా నాటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అడ్డగోలుగా జీవోలిచ్చినట్లు ఉందా? ఇది కేవలం రామోజీ పైత్యమని అర్థం కావటానికి ఇంతకన్నా ఏం కావాలి? బాబును కాపాడటానికి రామోజీ ఎంతకైనా దిగజారతారని తెలియటానికి ఇంకా ఏం కావాలి? అసలు ఎమ్మార్ కేసులో చంద్రబాబు పాత్రను స్పష్టంగా బయటపెడుతూ నాటి ఎమ్మార్ సీఈఓ ఎ.జె.జగన్నాథన్ కూడా సాక్ష్యమిచ్చారు. నాటి నోట్‌ఫైళ్లు చూసినా, విజిలెన్స్ విభాగం దీనిపై జరిపిన దర్యాప్తు నివేదికను చూసినా కూడా బాబు పాత్ర స్పష్టంగా బయటపడుతుంది. అయినా సరే తాను చెప్పాలనుకున్న అంశాన్ని మాత్రమే మీడియాకు లీకు చేస్తున్న సీబీఐ కానీ, తాను రాయాలనుకున్నదానికే పతాక శీర్షికలు కడుతున్న రామోజీ గానీ, ‘ఈనాడు’ తోకలుగానీ వీటినెంతమాత్రం పట్టించుకోవటం లేదు. కావాలంటే ఆ క్రమాన్ని...ఆ అక్రమాన్ని... సాక్ష్యాలు, వాంగ్మూలాలతో సహా మీరే చూడండి...

టెండర్లకు ముందే... ఎమ్మార్‌కు ఓకే!

ఆరోగ్యస్వామి జోసెఫ్ జగన్నాథన్. సింపుల్‌గా ఎ.జె.జగన్నాథన్. దుబాయ్‌కి చెందిన ఎమ్మార్‌లో 2000 నవంబర్లో చేరారు. 2001 జూలైలో దానికి సీఈఓ అయ్యారు. ఈయన సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలాన్ని చూస్తే బుర్ర తిరిగిపోతుం ది. అసలు టెండరు దాఖలు చేయకముందే ఈ ప్రాజెక్టు ఎమ్మార్‌కు ఖరారైపోయిందని ఈయన చెప్పటం చూస్తే... బాబు కుట్ర త్రీడీ చిత్రంలా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 
‘‘నేను ఎమ్మార్‌లో చేరేటప్పటికే ఈ ప్రాజెక్టు కథ నడుస్తోంది. నేను చేరక ముందు నుంచే దీన్లో కోనేరు ప్రసాద్ బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎమ్మార్ చైర్మన్ అలబ్బర్‌కు కోనేరు బాగా క్లోజ్. 2001 మేలో నేను తొలిసారి అలబ్బర్‌తో కలిసి హైదరాబాద్ వచ్చా. ఎయిర్‌పోర్టులో మమ్మల్ని ఆహ్వానించింది కోనేరు ప్రసాదే. గోల్ఫ్‌కోర్సు, విల్లాలు, కన్వెన్షన్ సెంటర్ కోసం పలు స్థలాల్ని చూశాం. కొన్ని స్థలాల్ని ఖరారు చేసుకుని వెళ్లాం’’.

‘‘ప్రాజెక్టును దక్కించుకునేందుకు ఏపీఐఐసీతో 2001లోనే చర్చలు ఆరంభమయ్యాయి. పలు దఫాలుగా చర్చలు జరిగాయి. కాకపోతే రియల్టీ ప్రాజెక్టును టెండర్ల ద్వారా అప్పగించటానికి మాత్రమే ఏపీఐఐసీ మొగ్గు చూపించింది. దాని ప్రకారమే టెండర్లకు నోటిఫికేషన్ విడుదల చేయటం... చివరకు ఎమ్మార్‌కు దక్కటం జరిగింది. దీని ఫలితంగానే 2002లో జీవో విడుదల కావటం... ఆ తరవాత ఎంఓయూ కుదరటం జరిగాయి...’’

... ఇదీ ఎ.జె.జగన్నాథన్ బయటపెట్టిన చంద్రబాబునాయుడి కుట్ర కోణం. 
కుట్ర అమలు జరిగిందిలా...
నోటిఫికేషన్‌కు ముందే సీన్‌లోకి ఎమ్మార్...

కన్వెన్షన్ సెంటర్, గోల్ఫ్ కోర్సు నిర్మించడానికి ఆసక్తి ఉన్న సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చంటూ ఏపీఐఐసీ పత్రికా ప్రకటనలు విడుదల చేసింది 2001 జూలై 6న. దీన్లో విల్లాలను కూడా చేర్చి... భూమిని 235 నుంచి 500 ఎకరాలకు పెంచి సవరణ విడుదల చేసింది 2001 ఆగస్టులో. కానీ విచిత్రమేంటంటే ఎమ్మార్ చైర్మన్ అలబ్బర్ 2000వ సంవత్సరం మేలోనే వచ్చి చంద్రబాబును కలిసి వెళ్లారు. 2001లో సీఈఓ జగన్నాథన్‌తో కలిసి మళ్లీ వచ్చారు. ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు కోసం పలు స్థలాల్ని చూసి ఖరారు చేసుకుని వెళ్లారు. ఇది చాలదూ... ఎమ్మార్‌కు ప్రాజెక్టును ఖరారు చేసేసి కూడా బాబు టెండర్ల డ్రామా ఎంత సమర్థంగా ఆడారో చెప్పటానికి? ఇది చాలదూ ఎమ్మార్‌కు బాబు దీన్ని కుట్రపూరితంగా కట్టబెట్టారనటానికి? ఇది చాలదూ బాబు ముడుపుల ప్రహసనాన్ని చెప్పటానికి?

1999లో విల్లాలు లేకుండా... హోటల్, కన్వెన్షన్ సెంటర్, గోల్ఫ్‌కోర్స్‌తో ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ నిర్మించాలని చంద్రబాబు భావించారు. 2000 నుంచే ఈ ప్రాజెక్టు కోసం బాబుతో ఎమ్మార్ టచ్‌లో ఉంది. 
2000 మేలో ఎమ్మార్ చైర్మన్ అలబ్బర్ వచ్చి బాబును కలిసి వెళ్లారు. (ఫోటోలో చూడొచ్చు.)
2001 మేలో తానూ అలబ్బర్‌తో కలిసి వచ్చానని, కోనేరు ప్రసాద్‌తో కలిసి ఇక్కడ ప్రాజెక్టు కోసం స్థలాల్ని చూసి వెళ్లామని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ఎమ్మార్ మాజీ సీఈఓ ఎ.జె.జగన్నాథన్ స్పష్టంచేశారు. 

2000వ సంవత్సరం నుంచే దీనికి సంబంధించి ఎమ్మా ర్ తరఫున కోనేరు ప్రసాద్ బాబుతో టచ్‌లో ఉన్నట్లు సీబీఐ కూడా తన రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టంగా చెప్పింది. 

2001 జులై 23న... గోల్ఫ్‌కోర్సు, కన్వెన్షన్ సెంటర్, హోటల్‌తో కూడిన ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు కోసం ఆసక్తి ఉన్న సంస్థలు దరఖాస్తు చేసుకోవచ్చునంటూ ఏపీఐఐసీ పత్రికల్లో ప్రకటనలిచ్చింది. 

ఇంతలో చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు. విల్లాల్ని కూడా దీన్లో చేర్చాలనుకున్నారు. అధికారులకు హుకుం జారీచేశారు. స్థలాన్ని 250 నుంచి 500 ఎకరాలకు పెంచమన్నారు. 

ముఖ్యమంత్రి మహా ఆసక్తితో ఉన్నారని నోట్‌ఫైల్స్‌లో పేర్కొన్న అధికారులు... ఈ మేరకు మరో ప్రకటన ఇచ్చారు.

2001 సెప్టెంబర్ 7కల్లా ఐదు సంస్థలు వచ్చాయి. ఎమ్మార్‌తో పాటు మలేసియాకు చెందిన ఐఓఐ, హాంకాంగ్‌కు చెందిన సోమ్ ఏసియా, దేశీయ సంస్థలు ఎల్ అండ్ టీ, షాపుర్జీ పల్లోంజీ వీటిలో ఉన్నాయి. 
2001 సెప్టెంబర్ 26 నాటికి సోమ్ ఏసియా, షాపుర్జీ పల్లోంజీలను ప్రభుత్వం పక్కకు తప్పించింది. 
2001 సెప్టెంబర్ 29న మిగిలిన మూడింటికీ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్‌ఎఫ్‌పీ) పంపించారు.

2001 అక్టోబర్ 25న ఆ మూడు సంస్థలతో ప్రీ బిడ్ సమావేశం ఏర్పాటు చేశారు. 

2001 డిసెంబర్ 15... టెండర్ల గడువు ముగిసింది. ఐఓఐ, ఎల్ అండ్ టీ తప్పుకున్నాయి. ఎమ్మార్ ఒక్కటే మిగిలింది. ఎల్ అండ్ టీకి అప్పటికే బాబు కాకినాడ పోర్టు ప్రాజెక్టును, హైటెక్‌సిటీనీ అప్పగించారు. ప్రతిఫలంగా ఎన్టీయార్ ట్రస్ట్ భవన్‌ను అది ఉచితంగా నిర్మించిందనే ఆరోపణలూ ఉన్నాయి. నిజానికి అప్పట్లో ఏ ప్రాజెక్టుకైనా బాబు పిలిస్తే తొలుత వచ్చేది ఎల్ అండ్ టీనే. ఐఓఐ ఇండియా కూడా చంద్రబాబు సన్నిహితుడు చుక్కపల్లి సురేష్‌ది. దానికి హైటెక్‌సిటీ రెండో దశను, ఏపీ జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్క్‌ను అప్పగించింది కూడా బాబే. అంటే తెలివిగా ఆ రెండింటినీ చివరిదాకా ఉంచి... చివర్లో తానే తప్పించారన్నది సుస్పష్టం. 

2002 జనవరి 8న ఎమ్మార్‌ను డెవలపర్‌గా ఎంపిక చేశారు. 

2002 జూలై 10న నానక్‌రామ్ గూడలో 80.35 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్ విడుదలయింది. 
2002 సెప్టెంబరు 4న ఎమ్మార్‌కు 535 ఎకరాలు ఇస్తున్నట్లుగా, ప్రాజెక్టు అప్పగిస్తున్నట్లుగా జీవో-359 విడుదలైంది. అదే ఏడాది నవంబరు 6న ఏపీఐఐసీ- ఎమ్మార్ మధ్య ఎంఓయూ కుదిరింది. 

కొల్లగొట్టేందుకే కొలాబరేషన్!

ఎమ్మార్ వ్యవహారంలో మొత్తం దర్యాప్తు సాగుతున్నది విల్లాల చుట్టూనే! ఆ విల్లాలనేవి ప్రాజెక్టు మొదట్లో ప్రతిపాదించినపుడు లేవు. మధ్యలో చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకుని... అధికారులకు హుకుం జారీ చేసి... మరో 250 ఎకరాలివ్వటానికి ఒప్పుకోవటంతో పుట్టుకొచ్చినవి. పోనీ అంతటితో ఊరుకున్నారా అంటే... అదీ లేదు. తన బినామీ కోనేరు ప్రసాద్‌కు విల్లాల సొమ్ము దోచిపెట్టడానికి చంద్రబాబు హఠాత్తుగా కొలాబరేషన్ ఒప్పందానికీ తెరతీశారు. భూమిని ఎమ్మార్‌కు కట్టబెట్టేశాక... ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాక... 2003 ఆగస్టు 19న దీనికి సంతకాల రూపమిచ్చారు. దీని ప్రకారం ప్రాజెక్టులో ఏ భాగాన్నయినా అభివృద్ధి, నిర్వహణ, ఇతర సహకారాల నిమిత్తం మూడో పక్షానికివ్వొచ్చు. దీనికి ఏపీఐఐసీ అంగీకారం ఉండాలి కానీ... ‘‘సహేతుకమైన కారణం లేకుంటే ఏపీఐఐసీ దీన్ని అడ్డుకోజాలదు’’. ఇదిగో... ఈ ఒక్క క్లాజుతోనే చంద్రబాబు ఏపీఐఐసీ చేతులు కట్టేశారు. ఎందుకంటే ఏపీఐఐసీ ఏదైనా నిర్ణయాన్ని అడ్డుకుని దానికి కారణం చూపించినా... అది సహేతుకం కాదని ప్రభుత్వమో, ఎమ్మారో కొట్టి పారేయొచ్చు. ఈ కొలాబరేషన్ ఒప్పందమే కుంభకోణానికి మూలమని విజిలెన్స్ నివేదిక స్పష్టంగా చెప్పింది. 

బాబు తన తెలివితేటల్ని ప్రదర్శించింది ఇక్కడే. 2004లో ఎన్నికలుండటంతో... తాను అధికారంలో లేకు న్నా కూడా ఎమ్మార్‌లో తన హవా సాగటానికి వీలుగా 2003 ఆగస్టులో థర్డ్‌పార్టీకి పచ్చజెండా ఊపేశారు. అయితే దింపుడు కల్లం ఆశతో 2004 ఎన్నికలయ్యేదాకా ఎదురుచూశారు. ఓటమి పాల య్యేసరికి... ఎమ్మార్‌లోని తన మనుషుల ద్వారా కొలాబరేషన్ ఒప్పందాన్ని అమల్లోకి తెప్పించారు. తన బినామీ కోనేరు ప్రసాద్‌ను రంగంలోకి దింపి ఆయన ద్వారా 2004 సెప్టెంబర్లో స్టైలిష్ హోమ్స్ రియల్‌ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేయించారు. ఎమ్మార్ విల్లాలను అమ్ముకునే మూడో పక్షంగా దాన్ని రంగంలోకి దించారు. కోనేరు ప్రసాద్ తన స్నేహితుడు తుమ్మల రంగారావుతో కలిసి బాబు నేర్పిన చాతుర్యం ప్రదర్శించారు. విల్లా స్థలాల్ని చదరపు గజం రూ.5వేలకే అమ్మినట్లు చూపిస్తూ... అది మాత్ర మే అధికారికంగా ఎమ్మార్‌కు అందజేశారు. మిగతా సొమ్ము ఆయన బ్లాక్‌లో తీసుకున్నారని ఆరోపణలొచ్చాయి. 

2003 ఆగస్టు 19న ప్రభుత్వం- ఎమ్మార్ మధ్య కొలాబరేషన్ అగ్రిమెంట్ రిజిస్టరయింది. 

2004లో వైఎస్సార్ అధికారంలోకి వచ్చారు. పలు ప్రాజెక్టుల్ని సమీక్షించాలంటూ జూలైలో కేబినెట్ సబ్‌కమిటీకి అప్పగించారు. దాన్లో ఎమ్మార్ కూడా ఉంది. 


2004 సెప్టెంబర్ నాటికి సబ్‌కమిటీ సిఫారసులు చేసింది. కన్వెన్షన్ సెంటర్, హోటల్ ప్రాజెక్టులున్న ఎస్‌పీవీ-3లో అదనపు పెట్టుబడి పెట్టేకంటే... ఉన్న పెట్టుబడికి తగ్గట్టుగా వాటాను సర్దుబాటు చేస్తే సరిపోతుందని అది సిఫారసు చేసింది. ఈ ప్రాజెక్టులపై లాభాలు రావటానికి సుదీర్ఘకాలం పడుతుందని, పెపైచ్చు 66 ఏళ్ల లీజు తరవాత ఎలాగూ ఇవి ప్రభుత్వం చేతికే వస్తాయి కనక వాటిపై అదనపు సొమ్ము పెట్టి వాటా పెంచుకోవటం దండగని నాటి మంత్రి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రోశయ్య నేతృత్వంలోని సబ్ కమిటీ అభిప్రాయపడింది. 

సబ్ కమిటీ సూచనలకు అనుగుణంగా ఎమ్మార్‌తో ఒప్పందాన్ని సవరించారు. 2005లో ఈ మేరకు జీవో జారీ అయింది. దీని ప్రకారం కన్వెన్షన్ సెంటర్, ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఏపీఐఐసీ వాటా 49 నుంచి 26 శాతానికి తగ్గింది. విల్లాలు, గోల్ఫ్‌కోర్సుల్లో వాటా 26 శాతంగా యథాతథంగా ఉంది. 

ఆదిలోనే వాటాల తకరారు...

రైతుల నుంచి సేకరించి మరీ ఎమ్మార్‌కు ఏకంగా 535 ఎకరాల భూమిని అప్పగించిన చంద్రబాబునాయుడు... వాటాల విషయంలో చిత్రవిచిత్రమైన పిల్లిమొగ్గలు వేశారు. మొత్తం 535 ఎకరాల్లో హోటల్, కన్వెన్షన్ సెంటర్లకు 15, గోల్ఫ్‌కోర్సుకు 200, విల్లాలకు 285 ఎకరాలు కేటాయిం చారు. విశేషమేంటంటే భారీ పెట్టుబడి అవసరమై... లాభా లు తక్కువగా వచ్చే 15 ఎకరాలు మాత్రమే ఉన్న హోటల్, కన్వెన్షన్ సెంటర్లో ఏపీఐఐసీ వాటాను 49 శాతంగా ఉంచారు. పెద్దగా పెట్టుబడి అవసరం లేకుండానే తక్షణం భారీ లాభాలొచ్చే విల్లాలు, గోల్ఫ్‌కోర్సుల్లో మాత్రం ఏపీఐఐసీ వాటాను 26 శాతానికే పరిమితం చేశారు. అది కూడా 520 ఎకరాలిచ్చి మరీ. ఇది ఒక్కటి చాలదా... బాబు ఏ స్థాయిలో కుట్ర చేశారో చెప్పటానికి!!. 


ఎకరా 29 లక్షలకు... భార్య స్థలమైతే ఎకరా రూ.కోట్లకు!

ఎమ్మార్‌లో చంద్రబాబు కుట్రను స్పష్టంగా బయటపెట్టే మరో అంశం ధర. 535 ఎకరాల స్థలాన్ని ఎకరా కేవలం రూ.29 లక్షలకు కేటాయించేసిన బాబు... అంతకు మూడేళ్ల కిందటే దానికి సమీపంలోని తన భార్య స్థలాన్ని ఎకరా రూ.కోటికి విక్రయించుకోవటం అక్రమాలకు పరాకాష్ట. తల్లి అమ్మణ్ణమ్మ, భార్య భువనేశ్వరి, తనయుడు లోకేష్ పేరిట ఉన్న ఈ స్థలాన్ని 2000వ సంవత్సరంలో బాబు ఎకరం రూ.కోటి చొప్పున అమ్మారు. మూడేళ్ల తరవాత అక్కడ ఎకరా రూ.4 కోట్లకు తక్కువ లేని సమయంలో కేవలం రూ.29 లక్షలకే అప్పజెప్పారంటే రాష్ట్ర ఖజానాను ఎంతగా దెబ్బతీశారో తెలియక మానదు. తన స్థలాన్ని ఖరీదైన ధరకు, సర్కారు స్థలాన్ని కారుచౌకగాను విక్రయించటంలో బాబుకెలాంటి దురుద్దేశమూ లేదనుకోవాలా? బరిలో ఉన్న సంస్థల్ని ‘షార్ట్‌లిస్ట్’ చేసి... తన సన్నిహిత, బినామీ సంస్థలు మాత్రమే రంగంలో ఉండేలా ప్లాన్ చేసిందెందుకు? ఎల్ అండ్ టీ, ఐఓఐ ఎందుకు వెనక్కి తగ్గాయి? తర్వాత ఆ రెండింటికీ విలువైన ఇతర ప్రాజెక్టులెందుకు దక్కాయి? 

2007లో గజం 5 వేలట?

2007లో నానక్‌రామ్‌గూడలో రియల్ ఎస్టేట్ ధరలు తెలియని వేమీ కావు. గజం రూ.40 వేలకు పైగా పలుకుతున్న రోజులవి. కానీ అదేం చిత్రమో! నందమూరి బాల కృష్ణ భార్య వసుంధరకు మాత్రం ఎమ్మార్ టౌన్‌షిప్‌లో గజం కేవలం రూ.5 వేలకే కేటాయించారు. తన కుమార్తె బ్రాహ్మణి (ప్రస్తుతం చంద్రబాబునాయుడి కోడలు) పేరిట తాను కొనుగోలు చేసిన 2,440 గజాల ప్లాట్ కోసం ఎప్పుడెప్పుడు ఎంత మొత్తం చెల్లించిందీ చెక్కు నెంబర్లతో సహా ఆమె సీబీఐకి తెలియజేశారు. ఇంతా చేస్తే ఆమె చెల్లించింది గజానికి రూ.5 వేలు. మరి ఇంత చౌకగా అంత పెద్ద ప్లాట్‌ను కట్టబెట్టడానికి ఏ బంధం పనిచేసింది? కోనేరు-బాబు బంధమా? ఇంకేదైనానా?

స్కీమ్ ప్రకారమే! 

అసలు 2000లో ఇక్కడికొచ్చిన దుబాయ్ బృందం గోల్ఫ్ కోర్సు - విల్లా ప్రాజెక్టును దక్కించుకోవటం తప్ప ఇంకేమైనా పెట్టుబడులు పెట్టిందా? ఇక్కడ మైనింగ్, జియాలజీ, పర్యాటకాల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నామంటూ ఆర్భాటంగా చెప్పిన అల బ్బర్, పెట్టుబడులు పెట్టిందెక్కడ? పెడి తే ఎన్ని కోట్ల డాలర్లు? ఇదంతా చూస్తే.. 2000లో భూములు చూసి వెళ్లటం... తరవాత ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు బిడ్ వేయటం తప్ప దుబాయ్ వ్యాపారవేత్తలు చేసిందేమీ లేదు. మరి ఇదంతా పక్కా స్కీమ్ ప్రకారం జరిగిందని చెప్పటానికి ఇంతకన్నా ఏం కావాలి?
Share this article :

0 comments: