బాబుకు ఏ కోర్టూ, ఏ ఒక్క సభాసంఘం క్లీన్‌చిట్ ఇవ్వలేదు,బాబు అవినీతిపై జాతీయ పార్టీలే పుస్తకాలేశాయ్! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబుకు ఏ కోర్టూ, ఏ ఒక్క సభాసంఘం క్లీన్‌చిట్ ఇవ్వలేదు,బాబు అవినీతిపై జాతీయ పార్టీలే పుస్తకాలేశాయ్!

బాబుకు ఏ కోర్టూ, ఏ ఒక్క సభాసంఘం క్లీన్‌చిట్ ఇవ్వలేదు,బాబు అవినీతిపై జాతీయ పార్టీలే పుస్తకాలేశాయ్!

Written By ysrcongress on Wednesday, March 28, 2012 | 3/28/2012

* ఎన్టీఆరే బాబును క్లీన్‌‘చీటర్’, మేకవన్నె పులి అన్నారు
* బాబుకు ఏ కోర్టూ, ఏ ఒక్క సభాసంఘం క్లీన్‌చిట్ ఇవ్వలేదు
* ఆయన నీతిమంతుడంటే టీడీపీ నేతలు కూడా నమ్మరు
* చంద్రబాబు అవినీతిపై రాజకీయ పార్టీలు, స్వయంగా ఆయన బంధువులు కూడా పుస్తకాలు, కరపత్రాలు వేశారు
* బాబు ఏకంగా న్యాయస్థానాలనే మేనేజ్ చేసినట్లు బ్రిటన్ సంస్థ ప్రొఫెసర్ చెప్పారు
* మీ పాస్‌పోర్టులు బయటపెడితే మీ విషసామ్రాజ్యం ఎలా విస్తరించిందో బయటకొస్తుంది
* ఎన్నికల్లో ఖర్చుచేసిన వేలకోట్ల డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయి బాబూ..?
* మీపై సీబీఐ చూపిస్తున్న సానుభూతిని చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు
* జగన్ తాత, తండ్రుల ఆస్తులపై నువ్వు చెప్పే అబద్ధాలు నిజాలైపోవు

హైదరాబాద్, న్యూస్‌లైన్:టీడీపీ అధినేత చంద్రబాబు నీతిపరుడని ఆయన పార్టీ కార్యాలయంలో ఏ ఒక్కరైనా నమ్ముతారా ? అని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సూటిగా ప్రశ్నించారు. అవినీతికి అసలు రూపం చంద్రబాబేనని, దేశంలో అత్యంత సంపన్నుడైన రాజకీయనేత ఆయనేనని తెహల్కా మేగజైన్ ఏనాడో తేల్చి చెప్పిందని గుర్తుచేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు, స్వయాన చంద్రబాబు మామగారైన ఎన్టీ రామారావు.. ఆయన్ను క్లీన్ ‘చీటర్’గా, మేకవన్నె పులిగా అభివర్ణించారన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు ఏ ఒక్కరూ చంద్రబాబును విశ్వసించే పరిస్థితి లేదని చెప్పారు. మంగళవారం ఇక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో పద్మ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు చేసిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించారు. బాబు వ్యాఖ్యలు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి వ్యాఖ్యల్లా కాకుండా ఒక ఉన్మాది, బజారు స్థాయి నాయకుడు చేసిన వ్యాఖ్యల్లా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రోజుకు పదిసార్లు తనను ఏ కోర్టూ తప్పు పట్టలేదని చెబుతున్న చంద్రబాబు.. ప్రతిసారీ కోర్టులో తనపై కేసులు విచారణకు రాకుండా ఎందుకు అడ్డుపడుతున్నారో చెప్పాలి. ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాం.. చంద్రబాబుకు ఏ ఒక్క కోర్టూ క్లీన్‌చిట్ ఇవ్వలేదు. ఏ ఒక్క హౌస్ కమిటీ క్లీన్‌చిట్ ఇవ్వలేదు’’ అని తెలిపారు. చంద్రబాబు వ్యవస్థలను సైతం మేనేజ్ చేయడంలో మహాదిట్టని పేర్కొన్నారు. ఆయన న్యాయస్థానాలను కూడా మేనేజ్ చేయటానికి చేసిన ఘనకార్యాలను బ్రిటన్ ప్రభుత్వ సంస్థ డీఎఫ్‌ఐడీకి చెందిన ప్రొఫెసర్ జేమ్స్ మేనర్ వెల్లడించిన విషయాన్ని పద్మ గుర్తుచేశారు. 

బాబు అవినీతిపై జాతీయ పార్టీలే పుస్తకాలేశాయ్!
మూడు జాతీయ పార్టీలు ఈ దేశంలో ఒక నాయకుడి అవినీతి గురించి పుస్తకాలు ప్రచురించాయంటే... అది కేవలం ఒక్క చంద్రబాబు మీద మాత్రమేనని పద్మ తెలిపారు. బీజేపీ 1999లో ‘బాబు చార్జిషీటు’ పేరిట, సీపీఐ, సీపీఎంలు 2003లో ‘బాబు జమానా అవినీతి ఖజానా’ పేరిట పుస్తకాలు ప్రచురించిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ‘స్వయానా మీ తోడల్లుడు, మీకన్నా పెద్దవాడు, అంతో ఇంతో నిజాయతీపరుడైన దగ్గుబాటి.. తాను స్వయానా చూసిన అవినీతి బాగోతాలను గ్రంథస్తం చేసి ఉంచారు. మీ అత్తగారు లక్ష్మీపార్వతిని అడిగితే నీ అవినీతి బాగోతాలను రోజుల తరబడి సీరియళ్ళుగా చెప్పగలరు. అంతెందుకు మీ బామ్మర్ది హరికృష్ణే అప్పట్లో నీ అవినీతి వ్యవహారాల్ని పాంప్లెట్లు, పుస్తకాల రూపంలో ప్రజలందరికీ పంచి పెట్టిన సంగతి అందరికీ తెల్సిందే’’ అని చెప్పారు. మీ ఇంట్లో వాళ్ళే నీ అవినీతి గురించి ఇంతగా సాక్ష్యాలిస్తుంటే నువ్వా చంద్రబాబు వేరొకరిని వేలెత్తి చూపించేది? అని మండిపడ్డారు. 

తండ్రి పొలాన్ని తిరిగి ఆయనకే అమ్మిన దౌర్భాగ్యుడు!
‘‘చంద్రబాబు మొట్టమొదటిసారి కాంగ్రెస్ మంత్రిగా సినిమాటోగ్రఫీ శాఖ బాధ్యతలు చేపట్టిన నాటినుంచే అవినీతి అనే పదానికి మారుపేరుగా ఎదిగారు. నెల్లూరు జిల్లా బాలాయిపల్లి భూములు ఎక్కడ నుంచి వచ్చాయి? నీ తల్లి, తండ్రి, తమ్ముడు, కొడుకు, కోడల్ని, ఆఖరికి భార్యని అడ్డం పెట్టుకొని చేసిన అవినీతిని విజయమ్మ తన పిటిషన్‌లో వివరించారు. ఈ రాష్ట్రంలో సాక్షాత్తూ కన్నతండ్రికే.. ఆయనిచ్చిన పొలాన్నే తిరిగి అమ్మిన దౌర్భాగ్యుడు చంద్రబాబు’’ అని తెలిపారు. కన్నతల్లితో మనీ ల్యాండరింగ్ చేయించి హైదరాబాద్ మాదాపూర్ సమీపంలో తన కొడుకు పేరిట 5 ఎకరాల భూమిని, బంజారాహిల్స్‌లో ఒక ఇంటిని కొనిపించిన నీచ చరిత్ర చంద్రబాబుదని చెప్పారు. ‘ఇంకా చిత్రమేంటంటే బాబు భార్య అపర పారిశ్రామికవేత్త భువనేశ్వరి వ్యాపార మెళుకువలను చూసి ప్రపంచంలోనే టాప్ టెన్ కంపెనీల సీఈవోలు సిగ్గుపడుతున్నారట! అసలు ఆ రోజుల్లో నీ హెరిటేజ్ పబ్లిక్ ఇష్యూనే బోగస్ కాదా..? నువ్వు పితుకుతున్నది పాలనా? జనం రక్తాన్నా?’ అని నిలదీశారు. చిత్తూరు డెయిరీని నాశనం చేసిన మిమ్మల్ని అక్కడి రైతులు, ప్రజలు ఏ నాటికైనా క్షమిస్తారనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. 

కొడుకు, కోడలి పాస్‌పోర్టులు బయటపెట్టు...
చంద్రబాబు తన కోడలు బ్రహ్మణికి ఎమ్మార్ విల్లాలు ఎలా వచ్చాయో బయటపెట్టాలని పద్మ డిమాండ్ చేశారు. ‘అంతేకాదు మీ కొడుకు నారా లోకేష్, కోడలు బ్రహ్మణి విదేశాల్లో ఏం చేస్తున్నారో వెల్లడించు. ఇరవై ఏళ్లుగా మీ అందరి పాస్‌పోర్టులు బయటపెట్టు. మీరంతా ఏఏ దేశాల్లో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ తిరిగిందీ బయటకొస్తుంది. మీ ఆర్థిక సామ్రాజ్యం ఒక విష వృక్షంలా ఎన్ని దేశాలకు విస్తరించిందో వెల్లడవుతుంది’’ అని అన్నారు. బాబు అధికారంలో ఉండగా ఏ ఏ కంపెనీలకు ఎంతెంత ధరకు ఎన్నెన్ని భూములు ఇచ్చారన్నది బయటపెడితే రాష్ట్ర ప్రజలు సంపూర్ణంగా మిమ్మల్ని, మీ కుంటుంబాన్ని, పార్టీని సమాధి చేస్తారని హెచ్చరించారు. ‘బాబు రాజ్యసభ సభ్యులను ఎంపిక చేయటమే ఈ దేశంలో అన్నిటికన్నా అతిపెద్ద క్విడ్ ప్రో కో, ఎమ్మెల్యే టికెట్ల దగ్గర నుంచి ఎంపీల వరకూ మీకు ఉన్నవన్నీ నోట్లు, కోట్లు ప్రాతిపదికలే కదా!’ అని నిలదీశారు. 

కాంగ్రెస్ హైకమాండ్‌నే మేనేజ్ చేశావ్!
భూకేటాయింపుల మీద సభా సంఘం వేయాలని అసెంబ్లీలో చంద్రబాబు గొడవ చేసిన వెంటనే సీఎం కిరణ్ ఒప్పుకోవడమే కాకుండా కేవలం దివంగత వైఎస్ హయానికి సంబంధించి మాత్రమే విచారణ చేయాలనడం చూస్తే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంతలా మేనేజ్ చేశారో అర్థమవుతుందని పద్మ పేర్కొన్నారు. ఢిల్లీలో చిదంబరాన్ని, కర్ణాటకలో గవర్నర్ భరద్వాజ్‌ను కలుసుకున్న చంద్రబాబు.. తన మీద ఆర్థిక నేరాలకు సంబంధించి గానీ, ఇతరత్రా కేసుల్లో దర్యాప్తు చేయకుండా ఆపుకోగలిగారని, కాంగ్రెస్ హైకమాండ్‌ను కూడా మేనేజ్ చేయగలిగారని తెలిపారు. 

‘కాంగ్రెస్‌తో చంద్రబాబు బంధం ఎంతలా పెనవేసుకుందంటే ఎమ్మెల్సీ ఎన్నికల దగ్గరనుంచి మొన్న కోవూరు ఎన్నిక దాకా జరిగింది జాయింట్ ఆపరేషనే కదా! అమీర్‌పేట భూముల కుంభకోణం గురించి నోరు మెదపవెందుకు? మద్యం కుంభకోణం గురించి నీకు వ్యతిరేకులైన ఒకరిద్దర్ని మాత్రమే టార్గెట్‌గా చేసుకొని మాట్లాడుతున్నావు. 20 మంది మంత్రులు... వంద మందికి పైగా ఎమ్మెల్యేలు ఇందులో భాగస్వామ్యులయ్యారని వార్తలొస్తున్నా.. సభను స్తంభింపజేయాలని ప్రయత్నించరెందుకు? ఏం చంద్రబాబూ ఇదంతా కుమ్మక్కు కాదా?’’ అని నిలదీశారు. అన్నింటికీ మించి చంద్రబాబు కాంగ్రెస్‌తో ఆడుతున్న నాటకాలకు ఎన్నో రిహార్సల్స్ నడిచాయన్న అనుమానం ప్రజల్లో ఉందన్నారు. రిలయన్స్ కేజీబేసిన్‌ను కారుచౌకగా కొట్టివేస్తుంటే సహకరించిన బాబు అందుకు ప్రతిఫలంగా రామోజీ కంపెనీల్లోకి డబ్బు ప్రవహింపజేసిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఆ గ్యాస్ మనకే చెందినట్లైతే ఈ రోజు రాష్ట్రంలోని ఆడపడుచులందరికీ నెలకు 200 రూపాయలైనా ఆదా అయ్యేవి కదా.. అని పద్మ అన్నారు. 

బాబూ.. నిజాలు తొందర్లో బయటకొస్తాయి
‘వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదంపై ప్రజల్లో ఎన్నెన్నో అనుమానాలు ఉన్నాయి. అయినా గంటల్లోనే చిదంబరం ప్రకటన వచ్చేసింది. విచిత్రంగా సీబీఐ కూడా నాలుగు రోజుల్లోనే అది కేవలం ప్రమాదమేనని తేల్చేసింది. చంద్రబాబు రిలయన్స్‌కు కేజీ బేసిన్ కట్టబెట్టడం, తీవ్రమైన నష్టాల్లో ఉన్న రామోజీ కంపెనీల్లో చడీచప్పుడు లేకుండా డబ్బా కంపెనీల ద్వారా రిలయన్స్ వందల కోట్లు పెట్టుబడులు పెట్టడం, వైఎస్సార్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం, ఇందులో ఎటువంటి కుట్రా లేదని ఆగమేఘాల మీద కేంద్రం, సీబీఐ తేల్చేయడం.. ఈ వ్యవహారాలన్నిటిపైనా జనంలో అనుమానాలున్నాయి’ అని పద్మ వివరించారు. 

‘చంద్రబాబూ తేలాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ దేశంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వారి భయానక కుట్రలు మరెన్నో వెలుగు చూస్తాయి. జగన్‌కు ఆయన తండ్రి, తాతలకు ఉన్న ఆస్తులు ఆ ప్రాంతంలోనే కాక రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన బహిరంగ రహస్యాలే. వాటి గురించి పదే పదే నోరు పారేసుకున్నంత మాత్రన అబద్ధాలు నిజాలైపోవు. జగన్ తాతగారైన వైఎస్ రాజారెడ్డి తండ్రే, ఆరోజుల్లోనే ఏ-1 కాంట్రాక్టర్. ఆదాయపన్ను చెల్లింపుదారుడు కూడా. తన 11 మంది పిల్లలకు తలా 20, 30 ఎకరాలు పంచి ఇచ్చిన వ్యక్తి. వాస్తవాలు ఇలావుంటే.. చంద్రబాబు అవాకులు, చెవాకులతోనే జనాన్ని నమ్మించవచ్చనే పిచ్చి భ్రమల్లో ఉన్నారు’ అని పద్మ ఎద్దేవా చేశారు. 

‘రాజశేఖరరెడ్డిపై సైతం చీటికీ మాటికీ ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు.. 2004లోనే వైఎస్ ఇల్లు అమ్మకానికి పెట్టాడంటూ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు.. ఈ సందర్భంగా చంద్రబాబును నేనొక్కటే అడుగుతున్నా..వైఎస్సార్ మీకు ఫోన్ చేసి చంద్రబాబూ..చంద్రబాబూ నా ఇల్లు కాస్త అమ్మి పెట్టవా.. అని అడిగారా? అడిగితే మరి ఎందుకు ఆ ఇల్లు అమ్మలేదు?’ అని నిలదీశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోజుల్లోనే డొనేషన్ కట్టి మరీ గుల్బర్గాలో ఎంబీబీఎస్ చదివిన సంగతి నీకు తెలియదా..చంద్రబాబూ?. ఆయన చదువుకుంటున్న రోజుల్లోనే ఆదాయపుపన్ను కట్టిన సంగతీ నీకు తెలియదా? నీకు అన్ని విషయాలూ తెలుసు. నీకు, నీలాగా మరెందరికో.. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు రాజశేఖరరెడ్డి ఆర్థికసాయం చేసిన విషయం గుర్తులేదా? గుర్తులేకపోతే ఇప్పుడు మీ పార్టీలోనే ఉన్న కె.ఇ.కృష్ణమూర్తిని ఒక్కసారి అడుగు చంద్రబాబూ.. ‘చంద్రబాబుకు, కాంగ్రెస్‌కు ఉన్న ఏకైక ఎజెండా జగనే. ఏదోలా అడ్డు తొలగించుకోవాలని ఇద్దరూ ప్రయత్నిస్తున్నారు తప్పితే వీరికి ప్రజా సమస్యలు పట్టవు. ఇదే విషయాన్ని గడిచిన రెండున్నరేళ్లలో ప్రజలు కూడా గమనించారు’ అని పద్మ పేర్కొన్నారు. 

బాబు రక్తంలో నిజాయతీయే లేదు! 
అవినీతి గురించి మాట్లాడుతున్న చంద్రబాబు రక్తంలో ఒక్క శాతం కూడా నిజాయతీ లేదని, ఒక వేళ అది ఉండుంటే కోర్టుల్లో విచారణకు సిద్ధపడుండేవారని పద్మ అన్నారు. ‘2004 ఎన్నికల్లో టీడీపీ ఖర్చు చేసిన వేల కోట్ల డబ్బు ఎవడబ్బ సొమ్ము? 2009 ఎన్నికల్లో ఏకంగా విదేశాల నుంచి నీ పెంపుడు మనుషుల అకౌంట్ల ద్వారా ప్రవహించిన వందల కోట్లు, ఇక్కడ మీరు బయటకు తీసిన వేల కోట్లు ఎక్కడ నుంచి పుట్టాయి? అంతెందుకు మొన్న కోవూరులో కుమ్మరించిన వందల కోట్లు ఎక్కడివి? అంతకుముందు పులివెందుల, కడప ఉప ఎన్నికల్లో కుమ్మరించిన వందల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయి?’ అని నిలదీశారు. అన్నా హజారేకు గురువులా చంద్రబాబు పోజు కొడుతుంటే సిగ్గుపడి చివరకు హజారేనే ఉద్యమం ఆపేస్తారేమోననే అనుమానం కలుగుతోందన్నారు.

సీబీఐని ఎలా మేనేజ్ చేశావ్?
ఎమ్మార్, ఐఎంజీ కుంభకోణాల వెనుక చంద్రబాబు హస్తం కళ్ళకు కట్టినట్లు స్పష్టంగా తెలుస్తున్నా.. సీబీఐ అటుగా కన్నెత్తి చూడటం లేదంటే ఆయన ఎంతలా మేనేజ్ చేశారో అర్థమవుతోందని పద్మ తెలిపారు. ఈ కుంభకోణాలకు సంబంధించి మీకు కనీసం నోటీసు ఇవ్వలేదంటేనే... సీబీఐని ఎంతలా మేనేజ్ చేశారో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో సీబీఐ ప్రవర్తిస్తున్న తీరును చూసిన ప్రజలు... బాబు విషయంలో చూపిస్తున్న సానుభూతిని చూసి ముక్కున వేలేసుకుంటున్నార ని చెప్పారు. 

జగన్ విషయంలో సీబీఐ ఎలా ప్రవర్తించిందంటే... ‘ఎంత తొందరగా కావాలంటే అంత తొందరగా చేస్తామని కోర్టుల్లో చెప్పింది. వారాల్లోనే ముగించి ప్రాథమిక నివేదిక ఇచ్చేస్తాం అని సీబీఐ తనకు తానే న్యాయస్థానంలో తొందరపడింది. ఆ తర్వాత కోర్టు ఎంక్వయిరీకి ఆదేశించిన మరుక్షణం నాలుగు రోజుల్లోనే జగన్ సంస్థల్లో, పెట్టుబడిదారుల ఇళ్ళమీద ఆఖరికి ఆయన ఇంట్లో సోదాలకు దిగింది. అదే విజయమ్మ పిటిషన్ మేరకు విచారణకు ఆదేశించిన నెల తర్వాత కూడా సీబీఐ అధికారులు కనీసం మీతో ఫోన్‌లో మాట్లాడటానికి కూడా ప్రయత్నించలేదంటే.. చంద్రబాబూ ఎలా మేనేజ్ చేశావో ఇప్పటికైనా చెప్పు’’ అని పద్మ నిలదీశారు.
Share this article :

0 comments: