నేడు వైఎస్సార్ సీపీ జెండా ఆవిష్కరణలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు వైఎస్సార్ సీపీ జెండా ఆవిష్కరణలు

నేడు వైఎస్సార్ సీపీ జెండా ఆవిష్కరణలు

Written By ysrcongress on Monday, March 12, 2012 | 3/12/2012


ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాడుతూ, ప్రజల హృదయాల్లో గూడు కట్టుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి నేటి(మార్చి 12)కి ఏడాది పూర్తవుతోంది. ఈ సందర్భంగా అన్ని జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరిస్తారు. అలాగే దేశ, విదేశాల్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ అభిమానులు, నేతలు జెండా ఎగురవేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. జిల్లా కేంద్రం, ముఖ్య పట్టణాలు, మండల కేంద్రాల్లో జెండా ఆవిష్కరణ తర్వాత నేతలు సమావేశమై.. పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ప్రజా సమస్యలపై పార్టీ తరఫున ఇంతవరకు చేపట్టిన ఉద్యమాలనే స్ఫూర్తిగా తీసుకుని, మున్ముందు కూడా ఇదే పంథాను మరింత ఉధృతం చేయాలని శ్రేణులకు సందేశం ఇవ్వనున్నారు. పార్టీ అధినేత జగన్ మాదిరిగా అనునిత్యం ప్రజల్లో ఉంటూ.. వారికి అండగా ఉండేలా ఈ సమావేశాల సందర్భంగా సంకల్పం తీసుకుంటారు. 

పార్టీ సభ్యత్వ నమోదు కోసం గడప గడపకూ వెళ్లినపుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు అందించే సువర్ణపాలనను వివరించాలని, పార్టీ తొలి ప్లీనరీ(ప్రజా ప్రస్థానం)లో అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన పథకాలను ప్రజల్లోకి విసృ్తతంగా తీసుకెళ్లాలని ముఖ్య నేతలు నిర్ణయించారు. దీనిపై కూడా సమావేశంలో చర్చిస్తారు. దివంగత మహానేత వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలకు, ఆయన రెక్కల కష్టంపై ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా తూట్లు పొడుస్తున్నదీ ప్రజలకు వివరించాలని నేతలు శ్రేణులకు సూచించనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌ను మొగ్గలోనే తుంచేసేందుకు కాంగ్రెస్-టీడీపీ- ఎల్లోమీడియా చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను ప్రజలకు అర్థమయ్యేలా ఎలా వివరించాలన్నదానిపైనా సమావేశంలో చర్చిస్తారు.
Share this article :

0 comments: