మే ద్వితీయార్థంలో ఉప ఎన్నికలు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మే ద్వితీయార్థంలో ఉప ఎన్నికలు?

మే ద్వితీయార్థంలో ఉప ఎన్నికలు?

Written By ysrcongress on Wednesday, March 28, 2012 | 3/28/2012

రాష్ర్టంలో రెండో విడత ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మే ద్వితీయార్థంలో ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో 17 అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. తిరుపతి సీటుకు చిరంజీవి రాజీనామా చేయనున్నారు. అలాగే నెల్లూరు లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ సోమవారం కేంద్ర ఎన్నికల కమిషనర్లను కలిసి చర్చించిన సంగతి తెలిసిందే. 

రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూలు విడుదల చేసే సమయానికి దేశంలో ఎక్కడా అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు ఖాళీ లేకుండా చూడటం సంప్రదాయంగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ర్టంలోని ఖాళీల భర్తీకి ఈసీ ప్రాధాన్యమివ్వనున్నట్టు సమాచారం. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణకు అనువైన పరిస్థితులు ఉన్నట్లు భన్వర్‌లాల్ నివేదించిన దృష్ట్యా.. సాధ్యమైనంత త్వరలో ఉప ఎన్నికల ఏర్పాట్లపై కసరత్తును పూర్తిచేయాలని ఈసీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే వారం పదిరోజుల్లో దీనిపై స్పష్టత ఏర్పడనున్నట్లు చెబుతున్నారు.
Share this article :

0 comments: