బాబుపై సీబీఐ జేడీకి ఎందుకంత ప్రేమ? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబుపై సీబీఐ జేడీకి ఎందుకంత ప్రేమ?

బాబుపై సీబీఐ జేడీకి ఎందుకంత ప్రేమ?

Written By ysrcongress on Thursday, March 15, 2012 | 3/15/2012

జేడీ ప్రవర్తన సీబీఐకి మచ్చ తెచ్చేలా ఉంది 
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనక్‌ప్రసాద్ 


హైదరాబాద్, న్యూస్‌లైన్: టీడీపీ అధినేత చంద్రబాబు పట్ల సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ చూపిస్తున్న ప్రత్యేక అభిమానంపై ప్రజలకు అనేక అనుమానాలు కలుగుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జనక్‌ప్రసాద్ చెప్పారు. లక్ష్మీనారాయణ తీరు సీబీఐకి మచ్చ తెచ్చేదిలా ఉందని అన్నారు. స్వతంత్ర సంస్థలో పనిచేస్తున్న వ్యక్తి పక్షపాత ధోరణితో వ్యవహరించడం పజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేదిలా ఉందని చెప్పారు. బుధవారం ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాగితపు కంపెనీ ఐఎంజీకి అప్పన్నంగా భూములు కట్టబెట్టారు. బాబుకు బినామీ అయిన బిల్లీరావుకు కారు చౌకగా 850 ఎకరాలు కట్టబెట్టిన ఈ వైనం ప్రపంచంలో అతిపెద్ద కుంభకోణం. ఈ విషయమై 2007లో విచారణకు ఆదేశిస్తే ఇదే సీబీఐ జేడీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. చంద్రబాబు బాగోతం కళ్లముందు కనబడుతున్నా లక్ష్మీనారాయణకు పట్టదు. ఎమ్మార్ విషయంలోనూ అదే పద్ధతి అనుసరించారు. దుబాయ్ కంపెనీని రాష్ట్రానికి తెచ్చి భూములు కట్టబెట్టిన చంద్రబాబుపై సీబీఐ కన్నెత్తి చూడదట. చంద్రబాబు పట్ల సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు ఎందుకంత ప్రేమ?’’ అని ప్రశ్నించారు. 

‘‘జగన్ కేసులకు సంబంధించి కోర్టులు వెలువరించిన కాపీలను 24 గంటల్లోపే లక్ష్మీనారాయణ స్వయంగా వెళ్లి తెచ్చుకున్నారు. 48 గంటలు గడవకముందే జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన కంపెనీలపై ఏక కాలంలో దాడులు చేస్తూ టై సృష్టించారు. చంద్రబాబు ఆస్తుల కేసులో దర్యాప్తు చేయాలని కోర్టులు ఆదేశిస్తే 15 రోజులు పూర్తై వాటివైపు కన్నెత్తి చూడలేదు. ఎందుకింత పక్షపాత వైఖరి? బాబు, ఆయన బినామీలు ‘స్టే’ తెచ్చుకునేదాకా నెమ్మదించడంలో ఉన్న ఆంతర్యమేమిటి’’ అని నిలదీశారు. ఎమ్మార్ కేసులో నిందితుడిగా ఉన్న రంగారావు చెప్పిన విషయం ఆధారంగా సునీల్‌రెడ్డిని అరెస్టు చేయడంలో ఆయన ఉద్దేశమేమిటని జనక్‌ప్రసాద్ ప్రశ్నించారు. అదే కేసులో నేరస్తుడైన రంగారావుపై ఈగ వాలనీయకుండా చూస్తున్నారని విమర్శించారు. జేడీ వాలకం చూస్తుంటే గతంలో సీబీఐలోనే పనిచేసి పదవీ విరమణ పొంది ప్రస్తుతం టీడీపీలో ప్రముఖపాత్ర పోషిస్తున్న వ్యక్తి సూచనల మేరకే పనిచేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఆ మాజీ సీబీఐ అధికారి ప్రధానమంత్రి పీవీ హయాంలో కేంద్రంలోని ముఖ్యమైన సమాచారాన్ని రాష్ట్రంలో ఆయనకు కావాల్సిన వ్యక్తులకు అందించిన ఘనత కలిగిన వారని ఆరోపించారు. అలాంటి వ్యక్తి సూచనలతో టీడీపీ ఎజెండాను జేడీ అమలు చేస్తున్నట్లుందనే అనుమానం కలుగుతోందని అన్నారు.

విచారణపై సీబీఐ ప్రజలకు వివర ణ ఇవ్వాలి: ‘‘జగన్ విషయంలో క్విడ్ ప్రో కో జరిగిందని శంకర్రావుతో కలిసి టీడీపీ నేతలు కోర్టులో కేసులేశారు. దీనిపై స్పందిం చిన హైకోర్టు వివాదాస్పద 26 జీవోలపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసులో జగన్‌ను 52వ బాధ్యునిగా పేర్కొంటే సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో మొదటి ముద్దాయిగా చేర్చింది. అసలు జీవోలు విడుదల చేసిన మంత్రులను చేర్చలేదంటే సీబీఐ లక్ష్యమేమిటో అర్థమవుతుంది. ఇప్పటికైనా ఆ 26 జీవోలపై సీబీఐ చేసిన విచారణ పై ప్రజలకు వివరణ ఇవ్వాలి’’ అని జనక్‌ప్రసాద్ డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: