రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా ఢిల్లీలోని సోనియాను ప్రసన్నం చేసుకోవడానికి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా ఢిల్లీలోని సోనియాను ప్రసన్నం చేసుకోవడానికి

రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా ఢిల్లీలోని సోనియాను ప్రసన్నం చేసుకోవడానికి

Written By ysrcongress on Sunday, March 25, 2012 | 3/25/2012

ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులు చూస్తే బాధనిపిస్తొందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినే త వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా ఓదార్పుయాత్రలో భాగంగా ప్రత్తిపాడులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడుతూ.. పేదవాడి చిరునవ్వు చూడాలని, రైతుల గుండెల్లో గూడు కట్టుకోవాలని, ప్రతి ఇంట్లో ఫోటొ ఉండేలా సేవ చేసే నాయకుడు రాష్ట్రంలో ఒక్కడంటే ఒక్కడు లేడని జగన్ ఆవేదన వ్యక్తం చేశాడు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా ఢిల్లీలోని సోనియాను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, అటువంటి వారే రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రానున్న ఉప ఎన్నికల్లో రైతులు, పేదవాడు ఒకవైపు, కుళ్లు, కుతంత్రాలు ఒకవైపు ఉంటాయన్నారు. 

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి బ్రతికే ఉంటే పరిస్థితులు ఈ మాదిరిగా ఉండేవి కాదని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారని, రాష్ట్రంలో వ్యవసాయం చేయడం కంటే ఉరి వేసుకోవడం మేలని రైతు భావిస్తున్నాడన్నాడు. వరి మద్దతు ధర కోసం పోరాడే వారు రాష్ట్రంలో కరువైనారన్నారు. లక్ష ఎకరాలు బీడుగా మార్చి రైతు క్రాప్ హాలీడే ప్రకటించిన వైనం రాష్ట్రంలో ఎప్పుడూ లేదన్నారు. ఈ ప్రభుత్వం రైతుల్ని, రైతు కూలీలను గాలికి వదిలేశారని ఆయన విమర్శించారు. ఇక విద్యార్థుల పరిస్థితి చూస్తూ గుండె తరుక్కుపోతోందని, విద్యార్థుల, రైతుల గురించి పట్టించుకునే నాధుడే లేడన్నాడు.

అవినీతిపై మాట్లాడే చంద్రబాబు.. కోవూరు ఉప ఎన్నికలో ఓటుకు ఐదు వందల రూపాయల్ని పంచిపెట్టాడని.. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పేద ప్రజల సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కైపోయాయని ఆయన ఆరోపించారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీని విలీనం చేసిన తర్వాతనే చంద్రబాబు అవిశ్వాస తీర్మానం పెట్టారన్నారు. జగన్ రాకతో ప్రత్తిపాడు జనసంద్రమైంది.
Share this article :

0 comments: