కోవూరులో పని చేయని కుట్రలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కోవూరులో పని చేయని కుట్రలు

కోవూరులో పని చేయని కుట్రలు

Written By ysrcongress on Monday, March 19, 2012 | 3/19/2012

కోవూరు నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ స్థానంలో 2,09,626 ఓట్లకుగాను, 1,75, 461 ఓట్లు పోలయ్యాయి. రికార్డుస్థాయిలో 84 శాతం పోలింగ్ నమోదైంది. కోవూరు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడూ పోలింగ్ నమోదుకాకపోవడం గమనార్హం. ఎండలు మండుతున్నా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళలు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విజయం ఖాయమని ప్రభుత్వ, ప్రైవేటు, రాజకీయ పార్టీల సర్వేలు తేల్చాయి. ఈ ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు భారీ మెజారిటీ లభిస్తే తమపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న ఆందోళనతో కాంగ్రెస్, టీడీపీలు ఉమ్మడి వ్యూహం రచించి, అమలు జరిపాయి. కాంగ్రెస్ పార్టీ ఓటుకు రూ.1,000-రూ.2వేలు, టీడీపీ ఓటుకు రూ.500-రూ.800 పంపిణీ చేశాయి.

గ్రామాల్లో మద్యాన్ని పారించాయి. మహిళలకు వెండి దీపం ప్రమిదలు, చేతి వాచీలు పంపిణీ చేశాయి. ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకూ పోలింగ్ కేంద్రాల వద్ద జనం తక్కువ సంఖ్యలోనే ఉండటంతో ఈ రెండు పార్టీల నాయకులు పోలింగ్ శాతం తగ్గి తమకు లాభం జరుగుతుందని భావించాయి. అయితే 9 గంటల నుంచి అనూహ్యంగా పోలింగ్ శాతం పెరగడం, మహిళలు, యువకులు ఉత్సాహంగా వచ్చి ఓటింగ్‌లో పాల్గొనడంతో కాంగ్రెస్, టీడీపీ ఆందోళనలో పడ్డాయి. ఈ రెండు పార్టీల డబ్బు, మద్యం, కుట్రలు, కుతంత్రాలు ఏమాత్రం ప్రభావం చూపలేదని పోలింగ్ సరళి రుజువు చేసింది. కోవూరు నియోజకవర్గంలోని 17 కేంద్రాల్లో 90 శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది. చెల్లాయపాళెం 92%, జొన్నవాడ 92.28%, పల్లెపాళెం 92.08, పోతిరెడ్డిపాళెం 90.05, ఇనమడుగు 91.04, జమ్మిపాళెం 91.88, లేగుంటపాడు 91.52, చెర్లోపాళెం 91.32, మోడేగుంట 92.08, ఆలూరుపాడు 92.11, కొడవలూరు 92.32, పద్మనాభసత్రం 96.28, వెంకన్నపురం 93.20, దామేగుంట 93.31, పెయ్యిలపాళెం 91.87, రాచర్లపాడు 91.89, రేగడిచెలిక 92.04 శాతం నమోదైంది. 

మరోవైపు కోవూరు నియోజకవర్గ పరిధిలోని శ్రీపురంధరపురం (శ్రీహరికోట) గ్రామస్తులు తొలుత ఓటింగ్‌ను బహిష్కరించారు.ఈ గ్రామంలో 480 మంది ఓటర్లు ఉన్నారు. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరిస్తేనే ఓట్లు వేస్తామని అక్కడి ప్రజలు భీష్మించుకుని కూర్చున్నారు. మధ్యాహ్నం వరకు రెండు ఓట్లు మాత్రమే పోలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎన్నికల ముఖ్య పరిశీలకులు, కావలి ఆర్డీఓ, బుచ్చిరెడ్డిపాళెం తహశీల్దార్ గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపారు. సమస్యను పరిష్కరించేవరకూ ఓటింగ్‌లో పాల్గొనేది లేదని వారు స్పష్టం చేయడంతో చేసేదేమీలేక వెనుదిరిగారు. తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి వెళ్లి గ్రామస్తులతో మాట్లాడారు. అనంతరం ప్రజలు ఓటు వేసేందుకు పోలింగ్‌బూత్‌కు తరలివెళ్లారు.
Share this article :

1 comments:

Vikram said...

This creadit is straightly goes 2 jagan mohan reddy only