వైఎస్సార్‌ పథకాలపై నిర్లక్ష్యం: రోజా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్‌ పథకాలపై నిర్లక్ష్యం: రోజా

వైఎస్సార్‌ పథకాలపై నిర్లక్ష్యం: రోజా

Written By news on Sunday, March 11, 2012 | 3/11/2012

 దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను ఇప్పటి పాలకులు మాత్రం తుంగలో తొక్కారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రోజా విమర్శించారు. వైఎస్‌ను క్రిమినల్‌గా చిత్రీకరించిన కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు ఆయన ఫోటో పెట్టుకుని ఎన్నికల ప్రచారం చేయడం సిగ్గుమాలిన చర్యని అన్నారు. కోవూరు ఉప ఎన్నికల ప్రచారంలో ప్రసన్నకుమార్ రెడ్డికి మద్దతుగా రోజా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సోనియా, రాహుల్‌కు చరిష్మాలేదనే విషయాన్ని యూపీ ఎన్నికలు తేల్చాయన్నారు. సొంత జిల్లాలో ఎమ్మెల్సీని కూడా గెలిపించుకోలేని సీఎం జనాల్ని రప్పించుకోవడానికి రికార్డింగ్‌ డాన్స్‌లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు.
Share this article :

0 comments: