అలా చేసి ఉండకపోతే ఆయన ప్రశాంతంగా ఉండేవారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అలా చేసి ఉండకపోతే ఆయన ప్రశాంతంగా ఉండేవారు

అలా చేసి ఉండకపోతే ఆయన ప్రశాంతంగా ఉండేవారు

Written By ysrcongress on Monday, March 12, 2012 | 3/12/2012

వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించి ఏడాదైంది. తనపై కొన్ని శక్తులు కుట్ర చేయడంతో ఏడాది క్రితం జగన్ ప్రజలకు హామీనిస్తూ పార్టీని స్థాపించారు. పేదలకు, రైతులకు ప్రయోజనకరమైన వైయస్సార్ సూత్రాలను, వైయస్సార్ తరహా పాలనను హామీ ఇస్తూ ఆ పార్టీ ఏర్పడింది. తెలుగు మహానేత వైయస్సార్ ప్రతిష్టను దిగజార్చడానికి కొన్ని శక్తులు కుట్ర చేశాయి. అయితే, ప్రజలు జగన్‌కు మద్దతు పలికారు. జగన్ వెంట ఉంటామని హామీ ఇచ్చారు. ఉప ఎన్నికల్లో వైయస్ జగన్‌ను, విజయమ్మను భారీ మెజారిటీతో గెలిపించడం ద్వారా ఆ విషయాన్ని రుజువు చేశారు. 

వైయస్ జగన్ తాను నమ్మిన సిద్ధాంతాలపై నిలబడి భారీ శక్తులను ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు. అలా చేసి ఉండకపోతే ఆయన ప్రశాంతంగా ఉండేవారు. ముఖ్యమంత్రి పదవి కోసం నిరీక్షించే నాటకాన్ని ఆడాల్సి వచ్చేది. సిబిఐ దర్యాప్తులు ఉండేవి కావు. ధైర్యంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నించారు. హీరోల పట్ల ప్రజలు అమితమైన అభిమానాన్ని ప్రదర్శిస్తారు. ప్రత్యర్థులను ఎదుర్కోవడం వల్ల మాత్రమే కాకుండా క్లిష్ట పరిస్థితిలో సరైన నిర్ణయం తీసుకునే ధైర్యాన్ని ప్రదర్శించడం వల్ల ప్రజలు ఆయన వెంట నడుస్తున్నారు. తాను తప్పు చేయనంత వరకు జగన్‌కు భయం లేదు. చాలా మంది మంత్రులు ఉన్నారు. కానీ పదవి వల్ల కాకుండా ప్రజలు వ్యక్తిత్వం వల్ల జగన్‌ను ఆదరిస్తున్నారు. వెనకడుగు వేయకపోవడం వల్ల జగన్‌ను ప్రజలు ఆదరిస్తున్నారు. 

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలంగా ఉంది, అయితే ఇంకా చొచ్చుకుపోవాల్సిన అవసరం ఉంది. పరిణతి సాధించడానికి మరి కొంత సమయం పడుతుంది. కానీ, క్లిష్ట సమయంలో పార్టీకి మద్దతు పలికి వైయస్ అభిమానులు ప్రశంసాత్మకమైన కృషి చేశారు వైయస్ జగన్‌కు, ఆయన మద్దతుదారులకు హ్యాట్సాఫ్. తన కృషి వల్ల, విధానాల వల్ల, వైయస్సార్ దీవెనల వల్ల తాను విజయాన్ని అందుకుంటానని జగన్ ప్రత్యర్థులకు చూపిస్తున్నారు. జగన్‌కు మరిన్ని కష్టాలు ఎదురు కావచ్చు, కానీ అంతిమంగా జయిస్తారు. 

అహ్మద్ పటేళ్లు, మొయిలీలు, సోనియా గాంధీల చుట్టు తిరగడం మానేసి, తన తండ్రి వారసత్వాన్ని స్వీకరించడానికి వైయస్ జగన్ తన సొంత లక్ష్యాలను, ప్రజలకు మేలు చేసే విధానాలను, తన తండ్రి ఆకాంక్షలను నెరవేర్చడానికి ముందుకు వచ్చారు. అవిశ్వసనీయతను, అప నమ్మకాన్ని, నిజాయితీలేమిని ప్రదర్శించిన కాంగ్రెసు పార్టీలోనివారిని ఆయన నమ్మాల్సిన అవసరం లేదు. ఆశ్చర్యకరంగా, విశేషమైన పరిణతిని ప్రదర్శించి సత్యమే జయిస్తుందని నిలబడ్డారు. జగన్ చర్యలను, ఆయన పట్ల జరిగిన మోసాన్ని గ్రహించిన తర్వాత ప్రజలు వైయస్ రాజశేఖర రెడ్డి మరణించలేదని, ఆయన తనయుడిలో ప్రాణం పోసుకున్నారని భావిస్తున్నారని భావిస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని ఆదరించినట్లే జగన్‌ను ఆదరిస్తున్నారు.
Share this article :

0 comments: