ఇద్దరూ కలిసి కోర్టులకు వెళతారు. కేసులు వేస్తారు. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇద్దరూ కలిసి కోర్టులకు వెళతారు. కేసులు వేస్తారు.

ఇద్దరూ కలిసి కోర్టులకు వెళతారు. కేసులు వేస్తారు.

Written By ysrcongress on Thursday, March 15, 2012 | 3/15/2012

రైతన్నను ఎలా ఉన్నావని అడిగితే.. 
వ్యవసాయం చేయాలంటేనే ప్రాణం పోయేట్లుగా ఉందని అంటున్నాడు
{పభుత్వం ఫీజులు చెల్లించలేదని ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలలు 
విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వడంలేదు

(బుచ్చిరెడ్డిపాళెం నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి)

రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలను, వారి సమస్యలను గాలికొదిలేసి, సోనియాగాంధీని ప్రసన్నం చేసుకోవడంలో మునిగిపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. కోవూరు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన రోడ్‌షోలు నిర్వహించారు. పలు సభల్లో మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రజల గురించి, వారి ఇబ్బందుల గురించి ఆలోచించాల్సిందిపోయి వారిని పట్టించుకోవడంలేదని ధ్వజమెత్తారు. రైతులు, విద్యార్థులు ఎన్ని బాధలు పడుతున్నా ప్రభుత్వం ఆలోచించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘దివంగత ప్రియతమ నాయకుడు వై.ఎస్.రాజశేఖరరెడ్డి మన మధ్య నుంచి వెళ్లిపోయాక.., చనిపోయిన తరువాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో నిలిచి పోవాలని తపన పడే నాయకుడు ఒక్కరంటే ఒక్కరు లేకుండా పోయారు. పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయంటే.. రైతన్నను ఎలా ఉన్నావని అడిగితే.. వ్యవసాయం చేయాలంటేనే ప్రాణం పోయేట్లుగా ఉందని అంటున్నాడు. రైతులు క్రాప్ హాలిడే ప్రకటించి, సమ్మె చేసినా పట్టించుకోరు. కూలీలకు వంద రూపాయల కూలీ గిట్టుబాటు కాకపోయినా పట్టించుకోరు. కాంట్రాక్టు ఉద్యోగాల్లో పనిచేసే వారు ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితుల్లో పని చేస్తూ ఉన్నారు. జూనియర్ డాక్టర్లు వారి సమస్యల పరిష్కారానికి నిరాహార దీక్షలు చేసినా ప్రభుత్వం చలించదు. చేనేత కార్మికుల రుణ మాఫీ ప్రకటించినా, రద్దు చేసిన రుణాలను వారికి ఇవ్వని పరిస్థితుల్లో వారు చనిపోయే విధంగా వ్యవహరిస్తున్నారు’’ అని జగన్ పేర్కొన్నారు.

వరలక్ష్మి గుర్తొస్తూనే ఉంది: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం విషయంలో ప్రభుత్వం తీరుపై జగన్ ధ్వజమెత్తారు. ఇంజినీరింగ్ ఫీజు కట్టలేక చదువు ఆగిపోతుందన్న బాధతో ఆత్మహత్యకు పాల్పడిన వరలక్ష్మిని ఉదహరిస్తూ.. విద్యార్థులు పడుతున్న అవస్థలను వివరించారు. ‘‘ఇంజినీరింగ్ చదువుతూ ఫీజు కట్టలేక ఆత్మహత్య చేసుకున్న రంగారెడ్డి జిల్లాలోని వరలక్ష్మి అనే విద్యార్థినిని నేను ఇవాళ్టికీ మర్చిపోలేకుండా ఉన్నాను. వరలక్ష్మి తండ్రి సెక్యూరిటీ గార్డు. తల్లి స్వీపర్‌గా పనిచేస్తోంది. పరీక్షలకు హాజరు కావాలంటే రూ.30 వేల ఫీజు కావాలని తల్లిదండ్రులను వరలక్ష్మి అడిగింది. అంత పెద్ద మొత్తం ఆ పేద తల్లిదండ్రులు ఎక్కడి నుంచి తెస్తారు? డబ్బు లేక చదువు ఆగిపోతుందేమోనన్న బాధతో వరలక్ష్మి ఆత్మహత్య చేసుకుంది’’ అని వివరించారు. కష్టపడి చదివిన ఇంజినీరింగ్, మెడిసిన్ విద్యార్థులకు తీరా పరీక్షల సమయంలో ప్రభుత్వం ఫీజు చెల్లించలేదని ఆయా కళాశాలల యాజమాన్యాలు హాల్ టికెట్ ఇవ్వని పరిస్థితి తలెత్తుతోందని విమర్శించారు. ‘‘రూ.30 వేలు ఇంజినీరింగ్ విద్యార్థి ఎక్కడి నుంచి తెస్తాడు? రూ.55 వేలు చెల్లించాలని మెడిసిన్ విద్యార్థిని కళాశాల యాజమాన్యం కోరితే ఎక్కడి నుంచి తెస్తాడు’’ అని ప్రశ్నించారు. 

‘‘ప్రతి ఇంటి నుంచీ ఒక్కరైనా చదువుకుంటే పేదరికం లేకుండా చేయొచ్చునన్నది దివంగత రాజశేఖరరెడ్డి కల. దానిని నిజం చేసేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టారు. ఇప్పుడు దాన్ని నీరు గారుస్తున్నారు’’ అని అన్నారు. ‘‘దివంగత నేతది మరో స్వప్నం కూడా. ప్రజల కోసం ప్రవేశపెట్టిన పథకాలు ఎలా అమలవుతున్నాయో తెలుసుకోవడానికి రచ్చబండ కార్యక్రమం చేపట్టాలని సంకల్పించారు. ఎవరికీ చెప్పకుండా, ఏ గ్రామానికి వెళ్లేదీ ముందుగా తెలియకుండా ప్రజల మధ్యకు వెళ్లి అక్కడ ప్రజల సమక్షంలోనే నిలబడి.. ఈ ఊళ్లో రేషన్ కార్డులు లేని వారు ఎంత మంది ఉన్నారో చేతులెత్తండి.. ఇల్లులేని వారుంటే చేతులెత్తండి.. పెన్షన్‌లు రానివారుంటే చేతులెత్తండి.. అని అడగాలనుకున్నారు. వారి సమస్యలను పరిష్కరించాలనుకున్నారు. ప్రతి పేదవాడికి పథకాలు అందుబాటులోకి తేవాలని ఆయన కలగన్నారు. ఇప్పుడు వాటిని పట్టించుకునే వారు లేరు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రజలు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే ప్రతిపక్షమైనా ప్రభుత్వాన్ని కాలర్ పుచ్చుకుని అడుగుతుందేమోనని ఆశిస్తే.. అధికార కాంగ్రెస్ పార్టీతో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కుమ్మక్కైన పరిస్థితి కనిపిస్తోందని విమర్శించారు. ‘‘ఎక్కడా లేని విధంగా అధికార, ప్రధాన ప్రతిపక్షం కుమ్మక్కైన పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది. ఇద్దరూ కలిసి కోర్టులకు వెళతారు. కేసులు వేస్తారు. రాజశేఖరరెడ్డిని అప్రతిష్ట పాలు చేయడమే లక్ష్యంగా పని చేస్తారు. రాజకీయాలు ఎంత అన్యాయంగా ఉన్నాయంటే బతికి ఉన్న చంద్రబాబుకు ఒక న్యాయమట, మరణించిన వైఎస్‌కు మరో న్యాయమట’’ అని జగన్ తప్పుపట్టారు. విలువలకు కట్టుబడి ఎమ్మెల్యే, ఎంపీ పదవులను వదులుకున్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డికి ప్రజలు చల్లని దీవెనలు అంద జేయాలని జగన్ విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు వ్యవహార శైలి న చ్చకనే ప్రసన్నకుమార్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి వచ్చారన్నారు. వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై ఆయన వచ్చారని చెప్పారు. ప్రసన్నకుమార్ రెడ్డిని విమర్శించే అర్హత చంద్రబాబుకు లేదన్నారు.


Share this article :

0 comments: