పతనమైపోతున్న రాజకీయ వ్యవస్థకు వైఎస్సార్ కాంగ్రెస్ మంచి రోజులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పతనమైపోతున్న రాజకీయ వ్యవస్థకు వైఎస్సార్ కాంగ్రెస్ మంచి రోజులు

పతనమైపోతున్న రాజకీయ వ్యవస్థకు వైఎస్సార్ కాంగ్రెస్ మంచి రోజులు

Written By ysrcongress on Tuesday, March 20, 2012 | 3/20/2012

విలువలు, విశ్వసనీయతను కోవూరు ఎన్నికలో 
ఆచరణలో పెట్టి చూపించాం
అధికార, ప్రతిపక్షాలు మంచినీళ్లలా డబ్బు ఖర్చుపెట్టినా..
వాటికి భిన్నంగా మేం వ్యవహరించాం

హైదరాబాద్, న్యూస్‌లైన్: పతనమైపోతున్న రాజకీయ వ్యవస్థకు వైఎస్సార్ కాంగ్రెస్ మంచి రోజులు తీసుకురాగలిగిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ‘రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయతను కోవూరు ఉప ఎన్నిక ద్వారా ఆచరణలో పెట్టి నిరూపించగలిగాం. కోవూరులో కాంగ్రెస్, టీడీపీలు కోట్లాది రూపాయలను మంచి నీళ్లలా ఖర్చుపెట్టి, మద్యాన్ని ఏరులై పారించాయి. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ ఆ రెండు పార్టీలకు భిన్నంగా ప్రజల అభిమానంతో గెలవాలనే పట్టుదలతో పోటీ చేసింది. మా నమ్మకాన్ని ప్రజలు నిజం చేశారు’ అని చెప్పారు. తమ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందనున్నారని పలు సర్వేలు, ఎగ్జిట్‌పోల్స్ చెబుతున్నాయని.. ఆఖరికి కొందరు కాంగ్రెస్ నేతలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ గెలుస్తుందని చెబుతున్నారని ఆమె గుర్తు చేశారు. సోమవారమిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడుతున్న తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి.. కోవూరు ఉప ఎన్నిక ద్వారా దాన్ని ఆచరణలో పెట్టి చూపించారని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ నిజాయతీని ప్రశంసిస్తూ పలు ఆంగ్ల దినపత్రికలు కథనాలు ప్రచురించాయని తెలిపారు. ఈ సందర్భంగా ‘ది హిందూ’ పత్రిక ప్రచురించిన కథనాన్ని వాసిరెడ్డి పద్మ చదివి వినిపించారు. ‘కోవూరులో కాంగ్రెస్ పార్టీ ఓటుకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయల దాకా ఖర్చు చేసింది. అదే మాదిరిగా అధికార పార్టీకి సరితూగుతూ పోటాపోటీగా టీడీపీ కూడా డబ్బు ఖర్చు పెట్టింది. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆ రెండు పార్టీలకు భిన్నంగా వ్యవహరించింది. డబ్బు, మద్యం పంపిణీ కాకుండా కేవలం దివంగత సీఎం వైఎస్ పేరుతో ఎన్నికలను ఎదుర్కొంది’ అని ఆ పత్రిక రాసినట్లు ఆమె చెప్పారు. కోవూరులో కాంగ్రెస్, టీడీపీ నేతలకు చెందిన కోట్లాది రూపాయలు, మద్యం పట్టుబడ్డాయని తెలిపారు. తమ పార్టీ విషయంలో అలాంటివి ఎక్కడా జరగలేదని.. వాటన్నిటికీ దూరంగా ఉండి ప్రజల అభిమానాన్ని చూరగొన్నామని చెప్పారు. 

మరో కొత్త కుట్ర...

అన్నదాతకు అండగా నిలిచి పదవులను వదులుకున్న వైఎస్ అభిమాన మాజీ ఎమ్మెల్యేల విషయంలో అధికార పార్టీ మరో కుట్ర చేస్తోందని పద్మ మండిపడ్డారు. ఎమ్మెల్యేల అనర్హతపై చట్టప్రకారం జరగాల్సిన ప్రక్రియ జరగకుండా నీచమైన రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. గెజిట్ నోటిఫికేషన్, ప్రింట్ అందలేదంటూ అయోమయం సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు.
Share this article :

0 comments: