నా మాటను గౌరవించి నా చెల్లి రైతన్నకు అండగా నిలబడింది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నా మాటను గౌరవించి నా చెల్లి రైతన్నకు అండగా నిలబడింది

నా మాటను గౌరవించి నా చెల్లి రైతన్నకు అండగా నిలబడింది

Written By ysrcongress on Wednesday, March 28, 2012 | 3/28/2012

* ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి రెండు పార్టీలూ కుమ్మక్కయ్యాయి
* ‘కొన్ని సీట్లలో మీరు.. కొన్ని సీట్లలో మేం’ అంటూ ఒప్పందాలు చేసుకున్నాయి
* పేదలకు తోడుగా, అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటేసిన మా ఎమ్మెల్యేలకు ప్రజల దీవెనలు, ఆశీస్సులు ఇవ్వాలని కోరుతున్నా

ఓదార్పు యాత్ర నుంచి ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక ప్రతినిధి: రాబోయే ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు కలిసికట్టుగా ఒక్కటై కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. ‘కొన్ని సీట్లలో మీరు పోటీ చేయండీ.. మరికొన్ని సీట్లలో మేం పోటీ చేస్తాం’ అంటూ ఈ రెండు పార్టీల పెద్దలూ అప్పుడే లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని వెల్లడించారు. రైతన్నలకు అండగా నిలబడటం కోసం.. పేదలకు తోడుగా ఉండటం కోసం అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికి మళ్లీ ప్రజల మధ్యకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు చల్లని దీవెనలు, సంపూర్ణ ఆశీస్సులు ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. 

గుంటూరు జిల్లా ఓదార్పు యాత్ర 78వ రోజు మంగళవారం జగన్ ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఆరు వైఎస్సార్ విగ్రహాలను ఆవిష్కరించారు. తిక్కిరెడ్డిపాలెంలో మాకినేని వెంకటకృష్ణ కుటుంబాన్ని ఓదార్చారు. గ్రామాల్లో మిరప పంట కోసి కళ్లంలో ఆరబోసినరైతుల వద్దకు వెళ్లి వారితో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. కొప్పర్రు గ్రామ శివారులో కూలీలతో పాటుగా ఆయన కూడా కొద్దిసేపు మిరపకాయలు కోశారు. మిరపకాయను తుంచి తిని గుంటూరు మిరపఘాటు రుచి చూశారు. యాత్రలో పలు గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

విలువలను గెలిపిద్దాం...
త్వరలో ఇక్కడ(ప్రత్తిపాడు) ఎన్నికలు జరుగుతాయి. ఇవి ఇద్దరు వ్యక్తుల మధ్యనో, రెండు పార్టీల మధ్యనో జరుగుతున్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికల్లో రైతన్న, పేదవాడు వీళ్లిద్దరు కూడా ఒకవైపు ఉంటే.. కుళ్లు, కుతంత్రాలతో కూడిన రాజకీయ వ్యవస్థ మరోవైపు ఉండి పోటీ పడుతున్నాయి. ఇవాళ జరుగుతున్న ఈ పోటీల్లో విలువలు, విశ్వసనీయత ఒకవైపున ఉంటే.. వంచనతో కూడిన రాజకీయాలు మరోవైపున ఉన్నాయి. ఈ పోటీల్లో విలువలను మనం గెలిపించుకుందాం.. విశ్వసనీయతకు తోడుగా నిలబడదాం.. చెడిపోయి ఉన్న ఈ రాజకీయ వ్యవస్థను బాగుచేద్దాం.

తులసిమొక్కలా ఉందామని చెప్పా..
నా చెల్లి సుచరితమ్మ(ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత) గొప్ప పనిచేసి ఇవాళ మీ ముందు నిలబడింది. నేను నా చెల్లికి గుంటూరు నుంచి హైదరాబాదుకు వెళ్తున్నప్పుడే చెప్పా.. అమ్మా..! వాళ్ళు ఏ ఉద్దేశంతో అవిశ్వాసం పెట్టినా నాయకుడు అనే వాడికి విలువలు ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. గ్రామాల్లో రైతన్నలు కష్టాలు పడుతున్నారు.. పేదలు కన్నీళ్లు పెడుతున్నారు. వీళ్లకు తోడుగా నిలబడదాం.. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో మనం తులసి మొక్కగా పెరుగుదాం అని చెప్పా. అలా నిలబడినందుకు మనం డిస్‌క్వాలిఫై అవుతాం.. మన పదవులు పోతాయి.. మన స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయి, అయినా ఫర్వాలేదు. ఉప ఎన్నికల్లో ప్రజలిచ్చే తీర్పుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలి. గ్రామాల్లో రైతన్న పడుతున్న బాధలు వీళ్లకు అర్థం కావాలి. వీళ్లను నడిపిస్తున్న ఢిల్లీ పెద్దలకు తెలిసిరావాలి అని చెప్పా.. నా మాటను గౌరవించి నా చెల్లి రైతన్నకు అండగా నిలబడింది. ఆమెను చూసి గర్వపడుతున్నా.
Share this article :

0 comments: