ఉపాధి హామీ సమ్మెకు వైఎస్ఆర్ సీపీ మద్దతు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉపాధి హామీ సమ్మెకు వైఎస్ఆర్ సీపీ మద్దతు

ఉపాధి హామీ సమ్మెకు వైఎస్ఆర్ సీపీ మద్దతు

Written By news on Wednesday, March 28, 2012 | 3/28/2012

ఉపాధి హామీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. ఉపాధి హామీ సిబ్బంది చేస్తున్న సమ్మె న్యాయమైందని వారి సమస్యలను వెంటనే నెరవేర్చాలని వైఎస్ఆర్ సీపీ పార్టీ నేత గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఉపాధి హమీ పథకానికి తూట్లు పొడిచి ఉద్యోగాల నుంచి తొలగించాలనే యోచనలో ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు.

కోటికి పైగా కార్డులుంటే 40 లక్షలమందికి కూడా పని కల్పించలేదన్నారు. కిరణ్ ప్రజల్ని మభ్య పెట్టేందుకు చూస్తున్నారని గట్టు ధ్వజమెత్తారు. సమ్మె చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవటం సరికాదన్నారు. ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిందని ఆయన గుర్తుచేశారు. 

వైఎస్ఆర్ పథకాలను నీరుగార్చి ఆయనను ప్రజల మనస్సు నుంచి తొలగించాలనే కుట్రకు ప్రభుత్వం తెర లేపిందని గట్టు ప్రభుత్వంపై మండిపడ్డాడు. కొవ్వూరులో కోట్ల రూపాయలు పంచిన వ్యక్తి మా దగ్గర డబ్బులు లేవంటు పేద ఏడుపులు ఏడుస్తన్నారని ఇదంతా ముందస్తుగా డబ్బులు పంచడానికి చంద్రబాబు పన్నిన వ్యూహమని గట్టు విమర్శించారు. 

ఎన్నికల్లో పోటీ చేసినా గెలవలేమని కిరణ్, బాబులకు అర్థం అయిపోయిందన్నారు. బాబు ఓటమిని ముందే అంగీకరిస్తే, కిరణ్ దింపుడు కళ్లెం ఆశతో ఉన్నారన్నారు. ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో కావాలనే ప్రభుత్వం డబ్బు ఖర్చు పెడుతోందని గట్టు వ్యాఖ్యానించారు.
Share this article :

0 comments: