ఉప ఎన్నికల కోసం పార్టీ ఫండ్‌గా సర్కారు సొమ్ము! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉప ఎన్నికల కోసం పార్టీ ఫండ్‌గా సర్కారు సొమ్ము!

ఉప ఎన్నికల కోసం పార్టీ ఫండ్‌గా సర్కారు సొమ్ము!

Written By ysrcongress on Wednesday, March 28, 2012 | 3/28/2012

* కాంగ్రెస్ నేతలకు నామినేషన్‌పై పనుల మంజూరుకు కేటాయింపులు 
* రెండు రోజుల్లో 5 నియోజకవర్గాలకు రూ. 10.16 కోట్లు విడుదల 
* ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి మంజూరు చేస్తూ జీవోలు జారీ 
* త్వరలో మొత్తం 17 నియోజకవర్గాలకూ రూ. 100 కోట్ల నిధులు 
* నియోజకవర్గానికి రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వరకు కోటా 
* ఎన్నికల ఫండ్‌గా కాంగ్రెస్ నాయకుల జేబులు నింపటమే లక్ష్యం! 

హైదరాబాద్, న్యూస్‌లైన్: ఎన్నికల్లో వరుస పరాజయాలతో పతనమవుతున్న అధికార కాంగ్రెస్ పార్టీ.. రాబోయే ‘సెమీ ఫైనల్స్’లో పరాభవం తప్పించుకోవటానికి తనకు అందుబాటులో ఉన్న ‘అన్ని దారులూ’ వెదుకుతోంది. త్వరలో 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగబోయే ఉప ఎన్నికల్లో పరువు నిలుపుకునేందుకు.. అధికార దుర్వినియోగానికీ ప్రజల సొమ్ము పందేరానికీ వెనుకాడటం లేదు. సదరు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కోరినప్పుడు నిధులు మంజూరు చేయని కాంగ్రెస్ సర్కారుకు.. ఇప్పుడు ఉన్నపళంగా వాటిపై ప్రేమ పుట్టుకొచ్చింది. రాబోయే ఎన్నికలకు పెట్టుబడిగా నిధుల వరదకు గేట్లెత్తేసింది. ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడే లోపు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి.. తన విచక్షణ నిధి కింద ఉండే సొమ్మును ఆ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతల ఉపాధి కోసం పెట్టుబడిగా మార్చేశారు. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నాయకులకు ‘నామినేషన్ పనుల’ పేరుతో దాదాపు రూ. 100 కోట్ల మేర ప్రజా నిధులను దోచిపెట్టేందుకు స్వయానా సీఎం రంగం సిద్ధం చేశారు. ఆ క్రమంలో ప్రభుత్వ విధివిధానాలను గాలికొదిలేశారు. 

నియోజకవర్గానికి కనీసం రూ.5 కోట్లు..! 
ఉప ఎన్నికలు జరగనున్న నర్సన్నపేట, రైల్వేకోడూరు, రామచంద్రాపురం, రాయచోటి, రాజంపేట నియోజకవర్గాల్లో నామినేషన్‌పై కాంగ్రెస్ నాయకులకు పనులు అప్పగించేందుకు వీలుగా ఇప్పటికే రూ. 10.16 కోట్లు విడుదల చేశారు. ముఖ్యమంత్రి విచక్షణాధికారంతో మంజూరు చేసే ప్రత్యేక నిధి నుంచి నిధులు కేటాయిస్తూ ఇప్పటికే జీవోలు జారీ చేశారు. కొద్ది రోజుల్లో ఇతర నియోజకవర్గాలకు కూడా నిధులు విడుదల చేసేందుకు ఆగమేఘాల మీద విన్నపాలు స్వీకరిస్తున్నారు. ఏప్రిల్ నుంచి కొత్త బడ్జెట్ అమల్లోకి వస్తున్నందున వచ్చే నెల తొలి వారంలో ప్రత్యేక నిధి నుంచి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తానని రెండు రోజుల కిందట సీఎం స్వయంగా మంత్రులకు తెలిపారు. 

ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే ఈ నిధుల పందేరాన్ని పూర్తి చేయాలని సీఎం నిర్ణయించారు. ఒక్కో నియోజకవర్గానికి రూ. 5 కోట్లకు తగ్గకుండా నామినేషన్‌పై పనులు అప్పగించేందుకు వీలుగా నిధులు మంజూరు చేయనున్నారు. ఇందులో భాగంగా ఉప ఎన్నికలు జరగనున్న నియోజకవర్గాలకు చెందిన ఆయా జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులకు పనుల ప్రతిపాదనలు పంపాల్సిందిగా సూచించారు. దీనికి అనుగుణంగా మంత్రులు లేదా కాంగ్రెస్‌కు చెందిన స్థానిక నేతలు, వచ్చే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయనున్న వారు నియోజకవర్గంలో పనుల కోసం సీఎం ప్రత్యేక నిధి నుంచి నిధులు మంజూరు చేయాల్సిందిగా లేఖ ఇస్తారు. ఆ లేఖ ఆధారంగా ఆగమేఘాల మీద ఉప ఎన్నికల స్థానాల్లో నామినేషన్‌పై పనులు ఇచ్చేందుకు నిధులు మంజూరు చేస్తూ సీఎం నిర్ణయం తీసుకుంటున్నారు. 

అప్పుడు పక్కన పెట్టి... 
వాస్తవంగా ఉప ఎన్నికలు జరగనున్న 17 స్థానాలకు గతంలో ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించిన వారు ఈ ప్రత్యేక నిధి నుంచి అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని గతంలో దరఖాస్తులు చేసుకున్నప్పటికీ ముఖ్యమంత్రి పక్కన పెట్టారు. అప్పుడు వారందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచినందునే సీఎం ఉద్దేశపూర్వకంగా నిధులు మంజూరు చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ఆ స్థానాలకు ఉప ఎన్నికలు రావటంతో.. స్థానిక పార్టీ నేతలు చేజారిపోకుండా నిలువరించటంతో పాటు ఉప ఎన్నికల్లో పార్టీ తరపున పనిచేయించేందుకు వీలుగా ప్రభుత్వ సొమ్మును అధికారికంగా దోచిపెడుతున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. గతంలో ఏ ప్రభుత్వం, సీఎం కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులను నామినేషన్‌పై పార్టీ నేతలకు పందేరం చేయలేదని, ఇది ప్రభుత్వ సొమ్మును పార్టీ ఫండ్‌గా వినియోగించుకోవటమేనని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. 

నిన్న కోవూరులోనూ అదే తీరు
ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన కోవూరు నియోజకవర్గంలో కూడా ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ఇదే తరహాలో సీఎం ప్రత్యేక నిధి నుంచి నామినేషన్‌పై పనులు ఇచ్చేందుకు వీలుగా రూ. ఐదు కోట్ల మేర ఉప ఎన్నికల ఫండ్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఐదు లక్షల రూపాయల లోపు పనులను నామినేషన్‌పై ఇచ్చేందుకు వీలుంది. దీన్ని ఆసరాగా తీసుకుని ఉప ఎన్నికల స్థానాలకు మంజూరు చేస్తున్న నిధులకు పనులను నామినేషన్‌పై ఇచ్చేందుకు వీలుగా ఒక్కో పని రూ. 3 లక్షల నుంచి రూ. 4.90 లక్షల లోపు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నియోజకవర్గాలకు మంజూరు చేస్తున్న పనులన్నీ కూడా సీసీ రోడ్లుగానే పేర్కొంటున్నారు. 

ఆగమేఘాలపై మంజూరు
ఉప ఎన్నిక జరగనున్న నర్సన్నపేట నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయాల్సిందిగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరటంతో సీఎం ఆ మేరకు నిధులు మంజూరు చేశారు. అలాగే రైల్వేకోడూరు ఎమ్మెల్సీతో పాటు మాజీ ఎంపీ జి.రామయ్య కోరిక మేరకు ఆ నియోజకవర్గానికి నిధులు మంజూరు చేశారు. రాజంపేట నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయాల్సిందిగా ఎం.వెంకటమల్లికార్జున్‌రెడ్డి కోరగా నామినేషన్‌పై పనులు ఇచ్చేందుకు వీలుగా నిధులు మంజూరు చేశారు
Share this article :

0 comments: