టీడీపీ దొంగ డ్రామా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » టీడీపీ దొంగ డ్రామా

టీడీపీ దొంగ డ్రామా

Written By ysrcongress on Tuesday, March 13, 2012 | 3/13/2012

హైదరాబాద్, న్యూస్‌లైన్: సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్న ఆరుగురు మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలంటూ టీడీపీ అసెంబ్లీలో దొంగ డ్రామా ఆడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు విమర్శించారు. ఇన్నాళ్లూ సీబీఐ చేస్తున్న డొంక తిరుగుడు విచారణపై ఆ పార్టీ ఎందుకు నోరు మెదపలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ నేత శంకర్రావుతో కుమ్మక్కై కేసులు వేసి, వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న వీరికి సుప్రీం నోటీసులతో చుక్కెదురైందన్నారు. తమ దొంగనాటకం ఎక్కడ బయటపడుతుందోనని మంత్రులు రాజీనామా చేయాలంటూ టీడీపీ నేతలు సరికొత్త డ్రామాకు తెరదీశారన్నారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మూలింటి మారెప్ప, కొల్లి నిర్మలాకుమారితో కలిసి జూపూడి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయ నాయకులతో కలిసి సీబీఐ దేశాన్ని సర్వనాశనం చేస్తోందని మండిపడ్డారు. జగన్‌ను జైల్లో పెట్టించాలని టీడీపీ నేతలు ఢిల్లీ పెద్దలతో చేతులు కలిపి సీబీఐ చేత కథ నడిపిస్తున్నారన్నారు. సీబీఐకి నిజాయతీ ఉంటే ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వ విభాగాలను ఎందుకు విచారించలేదని ప్రశ్నించారు. 

సీబీఐకి ఎంతసేపూ జగన్‌ను ఏవిధంగా ఇరికించాలనే ధ్యాసే తప్ప చిత్తశుద్ధితో దర్యాప్తు చేయడం లేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా సీబీఐ జేడీకి కనీస పరిజ్ఞానం ఉంటే ఆ 26 జీవోలు సరైనవా కావా అనేది దర్యాప్తు చేపట్టాలన్నారు. బొత్స చెప్పినట్లు జీవోల్లో ఎలాంటి తప్పూ లేకపోతే జగన్‌పై కేసే ఉండదన్నారు. ఏనాడూ సచివాలయంలో అడుగు పెట్టని జగన్‌కు జీవోలతో ఏ విధంగా సంబంధం ఉంటుందని నిర్మలాకుమారి సీబీఐని నిలదీశారు. సుప్రీం తీర్పుతోనైనా సీబీఐ కళ్లు తెరవాలని మాజీ మంత్రి మారెప్ప హితవు పలికారు.
Share this article :

0 comments: