మహిళ సమాధానంతో కంగుతిన్న చంద్రబాబు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మహిళ సమాధానంతో కంగుతిన్న చంద్రబాబు

మహిళ సమాధానంతో కంగుతిన్న చంద్రబాబు

Written By ysrcongress on Monday, March 5, 2012 | 3/05/2012

కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం సెంటర్లో చంద్రబాబు మాట్లాడుతూ మధ్యలో సభకు హాజరైన ఓ మహిళనుద్దేశించి అమ్మా.. నీవు ఎవరికేస్తావమ్మా ఓటు అని అడిగారు. ఆమె వైఎస్ జగన్‌కే వేస్తానని చెప్పింది. దీంతో విస్తుబోయిన ఆయన.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఫలితం లేదమ్మా, టీడీపీకి ఓటేసి గెలిపిస్తే మేలు జరుగుతుందని చెప్పి ప్రసంగంలోకి వెళ్లారు. బాబు పర్యటన నిమిత్తం పలువురు మహిళలను తరలించారు. బాబు తన ప్రసంగంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్‌ను, జగన్‌ను విమర్శిస్తున్నప్పుడు మహిళల్లో చాలా మంది బాబును నిల దీయడం కనిపించింది. ‘నువ్వేం చేశావు.. మందు తీసేస్తే.. మళ్లీ నీవే కదా తెచ్చింది’ అంటూ బహిరంగంగానే విమర్శించారు. కొందరైతే ఆయన ప్రసంగం వినలేక ఆటోలు ఎక్కడ? మమ్మల్ని మా ఊర్లో దించండంటూ టీడీపీ నేతలను బతిమిలాడుకోవడం కన్పించింది. మీటింగ్ అయిపోతేనే వదులుతామని నేతలు చెప్పడంతో వారు చేసేదేమీలేక సభకు దూరంగా చెట్టు నీడన వేచి ఉన్నారు.
Share this article :

0 comments: