అమీర్‌పేట భూముల్ని కాంగ్రెస్ సీఎం ధారాదత్తం చేసింది అందుకే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అమీర్‌పేట భూముల్ని కాంగ్రెస్ సీఎం ధారాదత్తం చేసింది అందుకే

అమీర్‌పేట భూముల్ని కాంగ్రెస్ సీఎం ధారాదత్తం చేసింది అందుకే

Written By ysrcongress on Wednesday, March 21, 2012 | 3/21/2012

గుంటూరు ఓదార్పు యాత్రలో వైఎస్ జగన్ నిప్పులు
కాంగ్రెస్, టీడీపీ కలిసి కుమ్మక్కై రాజకీయాలను దిగజార్చాయి
వైఎస్‌ను అప్రతిష్టపాల్జేయడానికి ఇద్దరూ కలిసి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు
ప్రజా సమస్యలను మాత్రం ఇద్దరూ గాలికి వదిలేశారు
రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలే ఉండాలట.. మూడో పార్టీ ఉండనే కూడదట

ఓదార్పు యాత్ర నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఇవాళ రాష్ట్రంలో రాజకీయాలు ఎంతలా దిగజారిపోయాయంటే.. దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ పెద్దలు కుమ్మక్కయ్యారు. వీళ్లిద్దరూ కూడా కలిసికట్టుగా కోర్టులకు పోతున్నారు. కలిసి కేసులు వేస్తున్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిని అప్రతిష్టపాలు చేయడం కోసం వీళ్లు అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. ప్రజల సమస్యలను మాత్రం గాలికి వదిలేశారు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం, ఆవేదన వ్యక్తంచేశారు. పాలక, ప్రతిపక్షాల మ్యాచ్‌ఫిక్సింగ్‌ను ఆయన ఎండగడుతూ.. ‘‘మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు, కాంగ్రెస్ పెద్దలు కలిసి పోటీచేశారు. ఇద్దరూ కలిసి ఆర్‌టీఐ కమిషనర్ పదవులు పంచుకున్నారు. చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి సాక్షాత్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రే.. చంద్రబాబుకు చెందిన వ్యక్తికి హైదరాబాద్ నడిబొడ్డున అమీర్‌పేటలో ఐదెకరాల భూమిని ధారాదత్తం చేశారు’’ అని మండిపడ్డారు. ఇంత నిస్సిగ్గుగా రెండు పార్టీలూ కుమ్మక్కై రాజకీయాలు చేయడం చూస్తుంటే బాధనిపిస్తోందన్నారు. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రను మంగళవారం(72వ రోజు) పునఃప్రారంభించిన జగన్.. శామల్యాపురం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ప్రజల కోరిక మేరకు పలుచోట్ల ప్రసంగించారు. ప్రసంగాల సారాంశం 
ఆయన మాటల్లోనే..

డీలర్ల దగ్గరకుపోతే రేటు పెరుగుతోంది..

ఇవాళ ఈ పాలకులు ఎలా తయారయ్యారంటే.. రైతన్న వరి కోసుకునేటప్పుడు వడ్ల రేటును రూ. 650కో.. రూ.700కో తగ్గించేస్తున్నారు. మళ్లీ మూడు, నాలుగు నెలల తరువాత అవే వడ్లు మిల్లర్ల చేతిలోకో.. దళారుల చేతిలోకో వెళ్లిపోగానే అమాంతంగా బస్తాకు రూ.1,000 పై చిలుకు ధరకు రేట్లు పెంచుతున్నారు. మిర్చి రైతు పరిస్థితీ అంతే.. ఇవాళ మిర్చి ధర క్వింటాల్‌కు రూ.4,500, రూ. 5,000 కంటే పెచ్చు రావడం లేదు. ఇదే మిర్చి డీలర్ల చేతికి వెళ్లిన తరువాత ధరను మూడింతలు పెంచుకుంటూ పోతున్నారు.

రాజకీయాలు దిగజారిపోయాయి..

దివంగత నేత మీద బురదజల్లేందుకు పాలకపక్షం నేతలు, ప్రతిపక్షం నాయకులు పార్టీలకు అతీతంగా ఒక్కటయ్యారు. వీళ్లిద్దరి రాజకీయాలూ ఎంతకు దిగజారిపోయాయి అంటే.. ఇవాళ ఈ రాష్ట్రంలో రెండే రెండు పార్టీలు ఉండాలట! మూడో పార్టీ, మూడో వ్యక్తే ఉండకూడదట. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద విసుగెత్తినప్పుడు టీడీపీకి ఓటు వేస్తారు.. టీడీపీ మీద విసుగుపుడితే మళ్లీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారు. ఎందుకు ప్రజల గురించి ఆలోచన చేయాలి, మూడో పార్టీ లేకుండా చేస్తే సరిపోతుంది కదా..! అని నీచమైన ఆలోచనలు చేస్తున్నారు.
Share this article :

0 comments: