సెల్‌ఫోన్ చోరీ, మహిళలపై అసభ్య ప్రవర్తనతో దేహశుద్ధి చేయించుకున్నదెవరో తెలీదా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సెల్‌ఫోన్ చోరీ, మహిళలపై అసభ్య ప్రవర్తనతో దేహశుద్ధి చేయించుకున్నదెవరో తెలీదా?

సెల్‌ఫోన్ చోరీ, మహిళలపై అసభ్య ప్రవర్తనతో దేహశుద్ధి చేయించుకున్నదెవరో తెలీదా?

Written By ysrcongress on Friday, March 2, 2012 | 3/02/2012


వైఎస్ పెంపకాన్ని విమర్శించే అర్హత మీకు లేదు
కిరణ్, బొత్సల కాళ్లు వత్తే మీరా మాట్లాడేది?
మీకూ పుత్రులున్నారు.. మీ పెంపకాన్ని ప్రశ్నించుకోండి
సెల్‌ఫోన్ చోరీ, మహిళలపై అసభ్య ప్రవర్తనతో 
దేహశుద్ధి చేయించుకున్నదెవరో తెలీదా?

నెల్లూరు, న్యూస్‌లైన్: రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి మానవతా విలువలు తెలియవని నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన నెల్లూరులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా కన్వీనర్ కాకాణి గోవర్ధన్ రెడ్డి, పార్టీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. వైఎస్ విజయమ్మ అసెంబ్లీలో మాట్లాడుతూ తన కుటుంబానికి జరుగుతున్న అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేస్తే.. ఆమె ప్రసంగంపై ఆనం వ్యంగ్యంగా వ్యాఖ్యానించడం నీతిమాలిన తనమన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పెంపకాన్ని విమర్శించే అర్హత మంత్రికి లేదన్నారు. ఆయనకూ పుత్రులు ఉన్నారని, ఆయన పెంపకం ఎలాంటిదో ఆయనే ప్రశ్నించుకోవాలని సూచించారు. మహానేత పుణ్యమా అని రాజకీయంగా, ఆర్థికంగా స్థితిమంతులైన ఆనం సోదరులు ఇప్పుడు స్వార్థ రాజకీయాలు నడుపుతున్నారని విమర్శించారు. మహానేత మృతి చెందిన తర్వాత ఆనం రోశయ్య జపం చేశారన్నారు. ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి, బొత్స సత్యనారాయణ కాళ్లు వత్తుతూ పబ్బం గడుపుకొంటున్నారని మేకపాటి దుయ్యబట్టారు. ‘ధైర్యం ఉంటే రాజీనామాలు చేయాలని ఆనం సోదరులు అన్నారు.. దానికి అనుగుణంగానే రాజీనామాలు చేశాం... త్వరలో ఎన్నికలు కూడా వస్తున్నాయి.. దమ్ము, ధైర్యం ఉంటే మా సోదరులపై ఆనం సోదరులు పోటీ చేసి గెలవాలి’ అని చంద్రశేఖర్ రెడ్డి సవాలు విసిరారు.

మీ కుమారుల దుష్టచర్యలు నెమరేసుకోండి..

కాకాణి మాట్లాడుతూ.. ఆనం స్వార్థ రాజకీయాలతో జిల్లా వాసులను అప్రతిష్టపాలు చేశారన్నారు. అసెంబ్లీలో రక్షణ కవచం ఉందని, ఎలా మాట్లాడినా చెల్లుతుందని ఆనం భావిస్తున్నట్లుందని, ప్రజల్లోకి వచ్చి మహానేత కుటుంబంపై విమర్శించి చూడాలని సవాల్ విసిరారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ జగన్ లాంటి కుమారుడిని కన్న మహానేత రాజశేఖరరెడ్డి, విజయమ్మ అదృష్టవంతులన్నారు. 

వారి పెంపకానికి పేరుపెట్టేలా వ్యవహరించిన ఆనం రాంనారాయణరెడ్డి, తన కుమారుల దుష్టచర్యలను నెమరేసుకోవాలని హితవు పలికారు. తన కుమారుడికి చదువు రాకపోతే సొంత కాలేజీలోఇతరుల చేత పరీక్షలు రాయించిన ఘనత ఎవరిది? రౌడీ మామూళ్లు వసూళ్లు చేస్తూ దొరికిపోయిందెవరు? దేవాలయాల్లో, హోటళ్లలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి దొరికి పోయిందెవరు? సినిమా హాల్‌లో అసభ్యంగా ప్రవర్తించి దేహశుద్ధి చేయించుకుందెవరు? విదేశాలకు వెళ్లి మద్యం బాటిళ్లు తీసుకుని వస్తూ ఎయిర్‌పోర్టులో పట్టుబడిందెవరు? హైదరాబాద్‌లో అర్ధరాత్రి తప్పతాగి డివైడర్లను గుద్ది, అడ్డం వచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి చేసి లాకప్‌లో ఉన్నదెవరు? హైదరాబాద్‌లోని ఓ షోరూమ్‌లో సెల్‌ఫోన్ చోరీ చేసి కెమెరాకు చిక్కి పట్టుబడింది ఎవరు? అని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బాలచెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: