మెగా ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మెగా ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన

మెగా ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన

Written By ysrcongress on Monday, March 12, 2012 | 3/12/2012

భవిష్యత్ ఆశాదీపం జగనే: బాజిరెడ్డి 
అందరికీ కార్పొరేట్ వైద్యం వైఎస్ ఆశయం: కొణతాల

గజ్వేల్ (మెదక్)/ఎర్రావారిపాళెం (చిత్తూరు), న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం వేర్వేరు చోట్ల నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాలకు విశేష స్పందన లభించింది. మెదక్ జిల్లా గజ్వేల్ పట్టణంలో, చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళెం మండలం బోడేవాండ్లపల్లిలో ఈ శిబిరాలు జరిగాయి. ఉదయం నుంచే పరిసర గ్రామాల నుంచి వేలాది మంది వెద్య పరీక్షల కోసం బారులు తీరారు. పరీక్షల అనంతరం నిర్వాహకులు రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గజ్వేల్‌లో వైఎస్సార్ సీపీ, సేవాదళ్‌ల నేతృత్వంలో ఏర్పాటు చేసిన శిబిరంలో సుమారు 5 వేల మందికి పరీక్షలు నిర్వహించారు. 

శిబిరాన్ని సందర్శించిన వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ.. మహానేత వైఎస్ మరణం తర్వాత రాష్ర్టంలో పేదల ఆరోగ్యం గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల భవిష్యత్ ఆశాదీపం జగనేనని పేర్కొన్నారు. బోడేవాండ్లపల్లిలో పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన వైఎస్సా వుల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరంలో రెండు వేల మంది వైద్య సేవలు పొందారు. ముఖ్యఅతిథిగా హాజరైన పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రజలందరికీ కార్పొరేట్ వైద్యం అందించే లక్ష్యంతో మహానేత ఆరోగ్యశ్రీ, 108, 104 వంటి పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. వైఎస్ ఆశయాల సాధన ఆయన తనయుడు జగన్‌తోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
Share this article :

0 comments: