కోవూరు ప్రజలకు రుణపడివున్నా: నల్లపరెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కోవూరు ప్రజలకు రుణపడివున్నా: నల్లపరెడ్డి

కోవూరు ప్రజలకు రుణపడివున్నా: నల్లపరెడ్డి

Written By news on Wednesday, March 21, 2012 | 3/21/2012

 రాష్ర్టంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ రెండో ఎమ్మెల్యే గా ఎన్నికయిన నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. కోవూరు ఉప ఎన్నికలో తన గెలుపు కాంగ్రెస్, టీడీపీలకు చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. తానెప్పుడూ మెజారిటీ గురించి మాట్టాడలేదని, గెలుస్తానని మాత్రమే చెప్పానని అన్నారు. తనకు 23,496 ఓట్ల ఆధిక్యం రావడం మామూలు విషయం కాదన్నారు. కాంగ్రెస్, టీడీపీలు విచ్చలవిడిగా డబ్బులు పంచినా తనకు ఇంత మెజారిటీ రావడం చిన్న విషయం కాదని చెప్పారు. ఈ రెండు పార్టీలకు నూకలు చెల్లాయన్నారు. దివంగత మహానేత వైఎస్సార్ సేవలకు ఓటర్లు పట్టం కట్టారని ఆయన అభిప్రాయపడ్డారు. యువనేత వైఎస్ జగన్ నాయకత్వంలో తనను ఆశ్వీరదించి ప్రజలు గెలిపించారనన్నారు. కోవూరు ప్రజలకు రుణపడివున్నానని అన్నారు. తన గెలుపు కోసం కృషి చేసినవారందరికీ ప్రసన్నకుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

 ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ కు గుణపాఠం లాంటివని రాష్ర్ట మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. దీనికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బాధ్యత వహించాలన్నారు. వారు రాజీనామా చేస్తారా, లేదా అన్నది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. మంత్రులందరూ అధిష్టానానికి రాజీనామా ఇవ్వాలన్నారు. ఉప ఎన్నికల ఫలితాలను సీనియర్ నేతలు ఆషామాషీగా తీసుకోవద్దని హితవు పలికారు. తాజా ఫలితాలు కాంగ్రెస్ పై తీవ్ర ప్రభావం చూపిస్తాయన్నారు. మూడు చోట్ల మూడో స్థానంలో నిలవడం కాంగ్రెస్ బలహీనతకు అద్దం పడుతోందన్నారు.cnamepartyVotes
39272
37377
27308
17506
Y Srinivas Reddy Won by 1897 Votes

cnamepartyVotes
71001
43676
18608
N Janaradhan Reddy Won by 27,327Votes

cnamepartyVotes
58107
43083
35287
J Krishna Rao Won by 15,024 Votes
cnamepartyVotes
73876
50380
41343
PrasannaKumar Reddy Won by23,496 Votes
cnamepartyVotes
81279
48641
28965
Rajaiah Won by 32,638Votes

cnamepartyVotes
59452
28056
21249
J Ramanna Won by 31,396 Votes

cnamepartyVotes
75699
31234
17839
Goverdhan Won by 44,465 Votes

partyLeadwon
04
01
02
00
00Share this article :

0 comments: