ఎన్నికలలో డబ్బు ఎక్కువ ఖర్చు చేసిన చరిత్ర చంద్రబాబుకు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎన్నికలలో డబ్బు ఎక్కువ ఖర్చు చేసిన చరిత్ర చంద్రబాబుకు

ఎన్నికలలో డబ్బు ఎక్కువ ఖర్చు చేసిన చరిత్ర చంద్రబాబుకు

Written By ysrcongress on Wednesday, March 28, 2012 | 3/28/2012

ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ వ్యాఖ్యలు దుర్మార్గమైనవని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షి ఈరోజు హెడ్ లైన్ షో చర్చలో ఆయన పాల్గొన్నారు. ఉప ఎన్నికలలో డబ్బు ఖర్చుపై నిన్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన విమర్శించారు. ఎన్నికలలో డబ్బు ఎక్కువ ఖర్చు చేసిన చరిత్ర చంద్రబాబుకు ఉందన్నారు. కార్యకర్తలలో ధైర్యం నూరిపోయవలసిన వ్యక్తి ఇలా మాట్లాడటం ఆయన పరిస్థితిని తెలియజేస్తుందన్నారు.

వరుస పరాజయాలతో చంద్రబాబు తీవ్ర వత్తడికి లోనై ఈ విధంగా మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు అన్నారు. ఆయన చేద్దామనుకున్నదానిని ఇతరులకు ఆపాదించడం ఆయనకు అలవాటన్నారు. ఆ తరువాత ఆయనే ఆ పని చేస్తారని చెప్పారు. ఎన్నికలలో ఇతరులు అధిక మొత్తంలో ఖర్చు పెడుతున్నారని చెబుతున్నారంటే, 
ఆయన ఖర్చు చేస్తారని అర్ధం అన్నారు. ఆయన పార్టీకి చెందిన పలువురి వద్ద కోట్ల రూపాయలు దొరికిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. 

18 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న చిరంజీవి తక్కువవాడేమీ కాదని, అయితే ఆయన స్వభావ రీత్యా ఇబ్బందులకు తట్టుకోలేరని, అందుకే పార్టీని కాంగ్రెస్ లో కలిపి తప్పించుకున్నారన్నారు.ఇక్కడ బాధలు, ఇబ్బందుల నుంచి తప్పుకోవడానికే చిరంజీవి రాజ్యసభకు వెళ్లిపోయారన్నారు. 

ఉప ఎన్నికలలో పోటీ చేయడానికి డబ్బులు లేవని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే శేషారెడ్డి అన్నారు. 9 ఏళ్లు అధికారంలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం భావ్యంకాదన్నారు. అప్పుడు అధికారంలో ఉండి డబ్బు సంపాదించి ఇచ్చామని, ఇప్పుడు అధికారం లేనందున డబ్బు సంపాదనలేదని, అందువల్ల 
ఇవ్వలేకపోతున్నామని చెప్పినట్లు ఉందన్నారు. 

చంద్రబాబు వ్యాఖ్యలు టిడిపి దుస్థితిని తెలియజేస్తున్నాయని సీనియర్ జర్నలిస్ట్ బండారు శ్రీనివాస్ అన్నారు.
Share this article :

0 comments: