రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతోంది! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతోంది!

రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతోంది!

Written By ysrcongress on Thursday, March 29, 2012 | 3/29/2012

* మైక్రో ఫైనాన్స్ సంస్థలను కట్టడి చేసినా.. ప్రత్యామ్నాయం చూపని సర్కారు
* కరువవుతున్న ప్రభుత్వ తోడ్పాటు
* చితికిపోతున్న మహిళా సంఘాలు

హైదరాబాద్, న్యూస్‌లైన్: అటు ప్రభుత్వం రుణాలు ఇప్పించదు.. ఇటు సూక్ష్మ రుణ సంస్థలు ముందుకు రావు.. వెరసి రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతోంది! పల్లెల్లో మహిళలు నిర్వహించే చిన్నచిన్న వ్యాపారాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. ఏడెనిమిదేళ్ల నుంచి ప్రబల ఆర్థిక శక్తిగా ఎదిగిన మహిళా సంఘాల పరిస్థితి మళ్లీ మొదటికి వస్తోంది. మహిళలకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. దానికి తోడు స్వయం సహాయక సంఘాలు బ్యాంకుల నుంచి ఒకసారి రుణం తీసుకుంటే.. సంఘంలోని సభ్యులు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించిన తరువాత మరో ఆరు నెలలకుకానీ కొత్త రుణం లభించదు. 

బ్యాంకులు ఇచ్చే రుణాలకు అదనంగా రాష్ట్రంలో సూక్ష్మ రుణ సంస్థలు ప్రతి సంవత్సరం సుమారు రూ.8 వేల కోట్ల రుణాలను మహిళా సంఘాలకు ఇచ్చేవి. అయితే మైక్రోఫైనాన్స్ సంస్థల అత్యాశ, అకృత్యాల కారణంగా వారి దగ్గర తీసుకున్న రుణాలు చెల్లించలేక 2010లో దాదాపు వంద మంది వరకు మహిళలు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో విధి లేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సూక్ష్మ రుణ సంస్థల నియంత్రణ చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టం కారణంగా మహిళా సంఘాల సభ్యులకు తాత్కాలిక ఊరట లభించింది.

ప్రత్యామ్నాయాలు ఎక్కడ..?
రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించడంతో సూక్ష్మ రుణ సంస్థల నుంచి తీసుకున్న రూ.6 వేల కోట్లను 70 లక్షలకు పైగా మహిళలు తిరిగి చెల్లించలేదు. రెండేళ్ల నుంచి మహిళా సంఘాల నుంచి రుణాలు వసూలయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో.. ఆ సంస్థలన్నీ మహిళలను డిఫాల్టర్లుగా ప్రకటించి, వారికి భవిష్యత్తులో రుణాలు ఇవ్వకూడదన్న నిర్ణయం తీసుకున్నాయి. నాన్ బ్యాంకింగ్ సెక్టార్‌లోని అన్ని సంస్థలకు ఈ మహిళా సంఘాల ‘బ్లాక్‌లిస్ట్’ జాబితాను డేటాబేస్‌లో పెట్టి సమాచారం ఇస్తున్నారు. 

అయితే ఎక్కువ వడ్డీ వసూలు చేసి అకృత్యాలకు పాల్పడి, మహిళలు ఆత్యహత్యలు చేసుకునేలా ప్రేరేపించిన ఈ సంస్థలు ఇచ్చే సమాచారాన్ని పరిగణనలోకి తీసుకోవద్దని బ్యాంకులను ఒప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. సూక్ష్మ రుణ సంస్థలు ఏటా ఇచ్చే రుణాల మొత్తాన్ని వాణిజ్య బ్యాంకుల ద్వారా ఇప్పించకపోవడంతో వారి పరిస్థితి దారుణంగా మారింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాన్నే పరిశీలిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు రూ.8100 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఇప్పటివరకు ఇచ్చింది రూ.6888 కోట్లు మాత్రమే. అంటే బ్యాంకులు దాదాపు రూ.1300 కోట్ల రుణాలు తక్కువగా ఇచ్చాయి. 

సూక్ష్మరుణ సంస్థలు ఇచ్చే రూ.8 వేల కోట్లు ఆగిపోయాయి. ఫలితంగా రాష్ట్రంలో 70 లక్షల మంది పేద మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, ఏడాది కాలంగా వారి కార్యకలాపాలను పరిశీలిస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. ఇప్పుడు మహిళలు గ్రామాల్లోని వడ్డీ వ్యాపారులను ఆశ్రయించక తప్పడం లేదని, దీంతో పరిస్థితి మరింత దిగజారుతుందని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

స్త్రీ నిధి రుణాలు ఎక్కడ..?
సూక్ష్మ రుణ సంస్థల దగ్గరకు మహిళలు వెళ్లకుండా వారికి అవసరమైనప్పుడు రుణాలు ఇవ్వడానికి స్త్రీనిధిని ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం చెప్పుకుంటోంది. దీనిద్వారా ఏటా వెయ్యికోట్ల రుణాలు ఇస్తామని ప్రకటించింది. ఈ స్త్రీనిధి ఏర్పాటై ఆరునెలలు అవుతున్నా.. ఇప్పటివరకు ఆ నిధి నుంచి మహిళలకు ఇచ్చిన మొత్తం రూ.45 కోట్లు మాత్రమే.
Share this article :

0 comments: