తమకు ఓటేయకున్నా వైఎస్సార్ కాంగ్రెస్‌కు వేయొద్దంటూ వినతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తమకు ఓటేయకున్నా వైఎస్సార్ కాంగ్రెస్‌కు వేయొద్దంటూ వినతి

తమకు ఓటేయకున్నా వైఎస్సార్ కాంగ్రెస్‌కు వేయొద్దంటూ వినతి

Written By ysrcongress on Friday, March 16, 2012 | 3/16/2012

డబ్బు, మద్యం పంపిణీలోనూ పరస్పర సహకారం

కోవూరు నుంచి న్యూస్‌లైన్ ప్రత్యేక ప్రతినిధి: కోవూరు ఉప ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రసన్నకుమార్‌రెడ్డిని ఎలాగైనా ఓడించాలనుకుంటున్న టీడీపీ, కాంగ్రెస్‌లు గురువారం నుంచి బరితెగింపు రాజకీయానికి దిగాయి. తమ వద్ద డబ్బు తీసుకుని తమకు ఓటేయకపోయినా ఫర్వాలేదు కానీ, వైఎస్సార్ కాంగ్రెస్‌కు మాత్రం వేయవద్దని ఈ రెండు పార్టీల నేతలు ఓటర్లను కోరుతున్నట్లు సమాచారం. పరోక్షంగా టీడీపీకి వేయాలని కాంగ్రెస్ నేతలు సూచిస్తున్నారు. గురువారం ఉదయం నుంచి పలు గ్రామాల్లో ఓటుకు రూ.500 నుంచి రూ. వెయ్యి చొప్పున పంపిణీ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మాజీ శాసనసభ్యులు, పార్టీల ముఖ్య నేతలే రంగంలోకి దిగి దగ్గరుండి డబ్బులు పంపిణీ చేయిస్తున్నారు. 

మగవారికి డబ్బుతో పాటు, క్వార్టర్ బాటిల్ ఉచితంగా ఇస్తున్నారు. మత్స్యకార గ్రామాల ఓట్ల విషయంలో ముందు జాగ్రత్తగా ఇప్పటికే ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేల వరకు చెల్లించినట్లు తెలిసింది. పోలీసులు టీడీపీకి చెందిన నగదు, మద్యం పట్టుకున్నా.. కేసులు లేకుండా చేయడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తన వంతు సహకరిస్తోంది. టీడీపీ నేతల వద్ద కోట్లుకు కోట్లు దొరికినా వాటిని బయటపెట్టొద్దంటూ పోలీసులపై ఒత్తిళ్లు వస్తున్నాయి. ఇదే విధంగా.. ఇందుకూరు పేట మండలం కొరుటూరు చెక్ పోస్టు వద్ద టీడీపీకి చెందిన 2,031 మద్యం క్వార్టర్ బాటిళ్లు దొరగ్గా.. గుర్తు తెలియని వ్యక్తి వీటిని వాహనంలో తీసుకుని వచ్చి పరారయ్యాడని పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.
Share this article :

0 comments: