తుది గెలుపు విజయమ్మదే! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తుది గెలుపు విజయమ్మదే!

తుది గెలుపు విజయమ్మదే!

Written By ysrcongress on Friday, March 2, 2012 | 3/02/2012


ఫిబ్రవరి 16న జస్టిస్ రోహిణితో కూడిన హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు వైఎస్ సతీమణి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సంశ యాన్ని ధ్రువపరిచిందనే చెప్పాలి. తనకు ఈ కోర్టులో న్యాయం జరగదని, తన వ్యాజ్యాన్ని వేరొక హైకోర్టు కు మార్చమని రెండు నెలల కిందట 2011, డిసెంబర్ 12న సుప్రీంకోర్టును విజయమ్మ ఆశ్రయించింది. న్యాయవ్యవస్థ మీద అవిశ్వాసం ప్రకటించడం తగ దని సుప్రీం నివారించడంతో విజయమ్మ తన అభ్య ర్థనను సుప్రీం నుంచి ఉపసంహరించుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కాలు ష్యం ఎల్లెడలా వ్యాపించింది కనుక విజయమ్మ ఆ అభ్యర్థన చేసింది. 

తనకు హైకోర్టులో న్యాయం జరగకపోతే తిరిగి సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం చెప్పింది, కనుక ఇప్పుడు విజయమ్మ సుప్రీంను మరొకసారి ఆశ్ర యించడానికి నిర్ణయించుకుంది. ఇది ఊహించిన పరిణామంగానే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భావించి న్యాయపోరాటం కొనసాగించడానికే నిర్ణయించుకున్నారు. ఇక్కడ పాఠకుల దృష్టికి ఒక ముఖ్యాంశాన్ని తేవలసి ఉంది. 2004లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, డీఎల్ రవీంద్రారెడ్డి... చంద్రబాబు అక్రమ ఆస్తులపై సీబీఐ విచారణకు ఆదేశించమని హైకోర్టును ఆశ్రయిస్తే, ఇదే జస్టిస్ రోహిణితో కూడిన ధర్మాసనం వారి అభ్యర్థనను తోసిపుచ్చింది.

ఏది ప్రజా ప్రయోజనం? ఏది రాజకీయ ప్రయోజనం?

విజయమ్మ వేసిన ‘పిల్’ ప్రజా ప్రయోజనం ఉద్దేశించి వేసింది కాదని, తన కుమారుడు జగన్ రాజకీయ ప్రయోజనం కోసం వేసిందని ధర్మాసనం వ్యాఖ్యా నించడం విడ్డూరం. డాక్టర్ శంకర్రావు వేసిన పిల్‌కు, దీనికి సంబంధం లేదని కూడా వ్యాఖ్యానించింది. ఈ తర్కాన్ని సామాన్యుడు అర్థం చేసుకోలేకుండా ఉన్నాడు. జగన్ ఆస్తులను గురించి సీబీఐ విచారణకు పూనుకున్న తర్వాత శంకర్రావుకు ప్రమోషన్ లభించి మంత్రి అయిన సంగతి లోకవిదితమే. కాం గ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రోత్సాహంతోనే, ఆమె మెప్పు కోసమే పిల్ వేసినట్లు శంకర్రావు బాహాటంగా ప్రకటించుకున్నది కూడా విదితమే. జగన్‌ను అప్రతిష్టపాలు చేయకుండా తాము నెగ్గలేమని తెలిసే కాంగ్రెస్, టీడీపీ కలిసి ఈ నాటకం ఆడాయని జనానికి తెలుసు. రెండు పిల్స్ వేసిన వారు రాజకీయ ప్రత్య ర్థులే అయినప్పుడు రెండు రకాల తీర్పులేల అని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు. విజయమ్మ సమర్పించిన సాక్ష్యాలను పరిశీలించి తీర్పు చెప్పాలిగానీ, ఆమె జగన్ తల్లి కాబట్టి, ఆమె రాజకీయ ప్రయోజనాలు ఆశించి పిల్ వేసినట్లు భావిం చి తీర్పు చెప్పడం సమంజసం కాదు. అందువల్ల తీర్పును గౌరవిస్తూనే దానిని సుప్రీంలో సవాల్ చేయాలని విజయమ్మ నిర్ణయించుకోవటం సముచితం.

బాబు నిష్కళంక నాయకుడా?!

రాజకీయ ఉద్దేశాలను ఆపాదించి విజయమ్మ పిల్‌ను ధర్మాసనం కొట్టేస్తే, టీడీపీ నాయకులు సంబరపడి స్వీట్లు పంచుకున్నారట! ఈ తీర్పులోగానీ, మరో తీర్పు లోగానీ చంద్రబాబు నీతిమంతుడని కోర్టులు యోగ్యతా పత్రాన్ని ఇవ్వలేదు. జగన్ మీద సీబీఐ విచారణకు కోర్టు ఆదేశిస్తే, జగన్ విచారణలో తన నిజాయ తీని నిరూపించుకోవచ్చుగదా అని నీతులు బోధించిన చంద్రబాబు... 2011, నవంబర్ 14న జస్టిస్ గులాం మహమ్మద్‌తో కూడిన ధర్మాసనం చంద్రబాబు అక్రమ ఆస్తుల మీద సీబీఐ చేత ప్రాథమిక విచారణకు ఆదేశిస్తే, చంద్రబాబు ఢిల్లీకి పరుగులు తీసి, దానిని కొట్టేయించుకోడానికి నానా తంటాలు పడకపోతే, సీబీఐ విచారణలో తన నిజాచతీని నిరూపించుకోవచ్చుగదా! జగన్‌కు నీతి బోధించిన బాబు ఆ నీతిని తాను పాటించవచ్చుగదా! జస్టిస్ గులాం మహ మ్మద్ సీబీఐ చేత ప్రాథమిక విచారణకు ఆదేశించినప్పుడు విజయమ్మ సమ ర్పించిన డాక్యుమెంటరీ సాక్ష్యాన్ని పరిశీలించి ప్రాథమిక ఆధారాలున్నాయని నిర్ధారించుకొని తీర్పు చెప్పింది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేసి రిలయన్స్ కంపెనీకి, తన బినామీలకు లాభం చేకూర్చినట్లు జస్టిస్ గులాం మహమ్మద్‌తో కూడిన ధర్మాసనం ప్రాథమిక ఆధారాలున్నట్లు నమ్మిన తర్వాతనే సీబీఐ ప్రాథమిక విచారణకు ఆదేశించింది.

తన 32 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడుగా నిరూపించుకు న్నట్లు చంద్రబాబు తనకు తాను యోగ్యతా పత్రాన్ని ఇచ్చుకున్నాడు. ప్రత్యర్థుల ఆరోపణలకు చంద్రబాబు ఏనాడూ సరైన సమాధానం ఇవ్వలేదు. రెండెకరాల ఆసామి కోటీశ్వరుడు ఎలా అయ్యాడని ప్రశ్నిస్తే ఇంత వరకూ సమాధానం లేదు. దేశంలోని రాజకీయ నాయకులందరికంటే చంద్రబాబే ధనవంతుడని ‘తెహల్కా’ వారపత్రిక వెల్లడిస్తే దానికీ సమాధానం లేదు. ‘చంద్రబాబు జమానా అవినీతి ఖజానా’ అని సీపీఎం నాయకులు పుస్తకం వేస్తే ఈనాటికీ దానికి సమాధానం లేదు. రాజకీయాల్లో అవినీతికి ఆద్యుడు చంద్రబాబేనని తన తోడల్లుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు అవినీతి బాగోతాన్ని గురించి ఒక పుస్తకం వేస్తే సమాధానం లేదు. తన భక్త బృందం తప్ప తటస్థ వర్గాలు ఎవరైనా బాబును మచ్చలేని నాయకుడన్నారా? వరుసగా రెండు ఎన్నికల్లో ఈ మచ్చలేని మహా నాయకుణ్ణి ప్రజలు ఎందుకు పట్టుబట్టి ఓడిం చారో? మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సే కంటే చంద్రబాబే క్రూరుడని ఎన్టీఆర్ తన బాధను వ్యక్తం చేశారంటే అంతకంటే ఘోరమైన మచ్చ వేరొకటి ఉంటుందా?!

ఎవరికి ఎవరు క్షమాపణ చెప్పాలి?

ధర్మాసనం విజయమ్మ పిటిషన్‌ను తిరస్కరించింది కాబట్టి, చంద్రబాబు విజ యం సాధించినట్లుగా భావించి, బాబు అనుచరవర్గం చంద్రబాబుకు విజ యమ్మ క్షమాపణ చెప్పాలని తమ చిల్లరబుద్ధిని ప్రదర్శించుకున్నారు. వ్యాజ్యం లో జయాపజయాలు సర్వసాధారణం. కింది కోర్టులో గెలిచిన వారు పైకోర్టులో ఓడిపోవచ్చు. దీనికే ఇంత మిడిసిపాటా? ధర్మాసనం చంద్రబాబుకు క్లీన్‌చిట్ ఏమైనా ఇచ్చిందా? సభ్యత మరచి క్షమాపణ కోరడం సంస్కారం అనిపించు కోదు. పులివెందుల ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్ మీద చంద్రబాబు ఆ నియోజకవర్గంలో పర్యటిస్తూ అవినీతి దండకాన్ని వల్లె వేశాడు. అయినా పులి వెందుల ఓటర్లు చంద్రబాబుకు బుద్ధి చెప్పారు. విజయమ్మకు 1,10,098 ఓట్లు వస్తే చంద్రబాబు అభ్యర్థికి 11,239 ఓట్లు వచ్చాయి. డిపాజిట్టు గల్లంతు కావ డమే కాదు, పోలైన ఓట్లలో పది శాతం కూడా రాలేదు. విజయమ్మ ఓట్లలో పది శాతం వచ్చాయి. టీడీపీ మీద లక్ష ఓట్ల మెజారిటీతో విజయమ్మ నెగ్గింది. ఇంత ఘోరమైన ఓటమి దేశంలో మరెక్కడా జరిగి ఉండదు. విజయమ్మకు బాధ కలిగించినందుకు టీడీపీ వారే క్షమాపణ చెప్పి ఉండాలి.

హుందాతనం మచ్చుకైనా లేని చంద్రబాబు!

హుందాతనం మచ్చుకైనా లేని చంద్రబాబుకు పులివెందుల ఓటర్లు మంచి పాఠమే నేర్పించారు. దిమ్మతిరిగేటట్లు టీడీపీ అభ్యర్థిని ఓడించారు. వైఎస్ తన అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కలలుగన్నాడు. విజయం సాధించారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా చంద్రబాబు ముద్రవేసి, దుష్ర్పచారం చేసినా, దానిని నభూతో నభవిష్యతి అని నిపుణులు కొనియాడారు. ప్రజలు ఆయన్ను అపర భగీ రథునిగా, అపర కాటన్‌గా కీర్తించారు. మరోవైపు జనమంతా తనను ముఖ్య మంత్రిగా చూడాలనుకుంటున్నారని స్వయంగా బాబే చెప్పుకున్నాడు. అలా అయితే, కాంగ్రెస్‌తో మ్యాచ్ ఫిక్సింగ్‌కు ఎందుకు పాల్పడుతున్నాడు? ఎన్ని కలంటే ఎందుకంత ఫోబియా! 

సుప్రీంపై విశ్వాసం!

న్యాయదేవత కళ్లకు గంతలుకట్టుకొని తీర్పు ఇస్తుందని, న్యాయదేవతా చిత్రాన్ని కోర్టులో ప్రదర్శిస్తారు. మనిషిని బట్టి గాకుండా విషయాన్ని బట్టి తీర్పు చెప్పే నిష్పాక్షిక విధానానికి ఇది గుర్తు. జస్టిస్ రోహిణితో కూడిన ధర్మాసనం దీనిని పాటించినట్లు లేదు. సుప్రీంకోర్టు అయినా ఈ సూత్రాన్ని పాటించాలి. విజ యమ్మ ‘పిల్’ వేసినప్పుడు బాబు అతిక్రమణలను గురించి బోలెడు సాక్ష్యాధా రాలను సమర్పించింది. ఉదాహరణకు రిలయన్స్ గ్యాస్ విషయమే తీసుకోండి. నష్టాల్లో ఉన్న రామోజీ ‘ఉషోదయ’ను ఆదుకోవడానికి రిలయన్స్‌కు సంబంధిం చిన కంపెనీలు వేలాది కోట్ల రూపాయలతో ఆ కంపెనీలో వాటాలు కొన్నాయి. 100 రూపాయల షేర్ విలువ ఉన్న వాటాను 5 లక్షల 28 వేలకుపైగా పెట్టి కొన్నాయి. 

రామోజీ పట్ల రిలయన్స్ వారికి ఎందుకంత ములాజా? ఎన్టీఆర్ నుంచి ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు హస్తగతం చేసుకోవటంలో రామోజీ కీలకపాత్ర పోషించింది జగద్విదితమే. అలాగే రామోజీ పత్రిక ఈనాడు చంద్ర బాబు బాకాగా మారింది కూడా విదితమే! ముఖేష్ అంబానీ, రామోజీ, బాబు... ఈ ముగ్గురి మధ్య నడుస్తున్న ముక్కోణపు ‘క్విడ్-ప్రో-కో’ను సుప్రీం కోర్టు బయటికిలాగుతుందని ఆశిద్దాం. వైఎస్ ఉన్నప్పుడు ఆయనకు, రిల యన్స్‌కు మధ్య జరిగిన ఘర్షణ తెలుగు వారికి తెలిసిందే. ‘కాగ్’ కూడా రిల యన్స్ అవకతవకలను ప్రస్తావించింది. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం రిల యన్స్ మధ్య వివాదం నడుస్తోంది. సహజవాయు నిక్షేపాలు ఉన్న ప్రాంతం కేటాయింపులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర గురించి సందేహాలు న్నాయి. సుప్రీం విచారణలో చంద్రబాబు రంగు బయటపడకపోదు. దొంగ తనం, వ్యభిచారం దాగవు కదా?
Share this article :

0 comments: