బ్రాహ్మణ యువతితో రాహుల్‌కు పెళ్లిచేయాలి! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బ్రాహ్మణ యువతితో రాహుల్‌కు పెళ్లిచేయాలి!

బ్రాహ్మణ యువతితో రాహుల్‌కు పెళ్లిచేయాలి!

Written By ysrcongress on Wednesday, March 7, 2012 | 3/07/2012


హైదరాబాద్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీకి ఉత్తరప్రదేశ్‌లోని ఓ బ్రాహ్మణ యువతినిచ్చి పెళ్లిచేస్తే తప్ప, ఆ రాష్ట్రంలో పార్టీ బతికిబట్టకట్టదని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. యూపీలో పార్టీకి పూర్వ వైభవం సాధించాలంటే ఇదొక్కటే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుందని, వారి అండదండలు కాంగ్రెస్‌కు దూరం కావడం వల్లే పార్టీ ఓటమి పాలవుతోందని విశ్లేషించారు. రాహుల్ గాంధీ బ్రాహ్మణ యువతిని పెళ్లి చేసుకుంటే ఆ సామాజికవర్గం మొత్తం తిరిగి కాంగ్రెస్ వైపు వస్తుందని వివరించారు. ఎన్నికల్లో నేతల ఛరిష్మాలను నమ్ముకోరాదని యూపీ ఎన్నికలు రుజువు చేశాయన్నారు. జాతీయస్థాయి లేదా రాష్ట్ర స్థాయి నేతలంటూ వారిని తీసుకువచ్చి బహిరంగ సభలు పెట్టినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేసే రోజులు పోయాయని చెప్పారు. ఆ ట్రెండ్ ఇప్పుడు లేదని, పోటీచేసే నేతలకు, నియోజకవర్గ ప్రజలకు ఉన్న పరిచయాలు, వారితో ఉన్న సాన్నిహిత్యం మాత్రమే గె లుపోటములను నిర్ణయిస్తుందన్నారు. భారీ బహిరంగ సభలు ఎన్ని పెట్టినా చివరకు యూపీలో ఫలితాలు ఆశాజనకంగా రాలేదని, సభలతో ఖర్చు తప్ప ఓట్లు రాలవని తేలిపోయిందన్నారు. 
Share this article :

0 comments: