ఒకటి రెండు టీవీ చానళ్లు, నిస్సందేహంగా విచారణాధికారులకూ స్వార్థప్రయోజనాల కోసం ‘సరైన భద్రత’నే కల్పిస్తు న్నాయి. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఒకటి రెండు టీవీ చానళ్లు, నిస్సందేహంగా విచారణాధికారులకూ స్వార్థప్రయోజనాల కోసం ‘సరైన భద్రత’నే కల్పిస్తు న్నాయి.

ఒకటి రెండు టీవీ చానళ్లు, నిస్సందేహంగా విచారణాధికారులకూ స్వార్థప్రయోజనాల కోసం ‘సరైన భద్రత’నే కల్పిస్తు న్నాయి.

Written By ysrcongress on Tuesday, March 20, 2012 | 3/20/2012

జగన్‌మోహన్‌రెడ్డి వర్సెస్ పాలకపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పూర్వరంగంలో ఇల్లు కాలుతుండగా బొగ్గులేరుకోడానికి ముందువరుసలో ఉండడానికి అలవాటుపడిన రెండు పత్రికలు, ఒకటి రెండు టీవీ చానళ్లు, నిస్సందేహంగా విచారణాధికారులకూ స్వార్థప్రయోజనాల కోసం ‘సరైన భద్రత’నే కల్పిస్తు న్నాయి. కొందరికి ‘పచ్చచొక్కా’ అఫీసర్లని, కొందరికి ‘ఎల్లో జర్నలిస్టుల’నీ పేరొచ్చింది కూడా ఇలాగనే! ఇక పూర్వాశ్రమంలో చంద్రబాబు కనుసన్నల్లో నడుచుకున్న ఒకరిద్దరు పాత్రికేయ సోదరులు కూడా ఒక స్థానిక ఆంగ్ల దినపత్రికలో తమ రూపురేఖలు దిద్దుకుంటున్నారు! వారి నుంచి కూడా చిలవల పలవులతో కూడిన అల్లికతో వచ్చే వార్తల ద్వారా కూడా అధికారులు ఆశిస్తున్న ‘సరైన భద్రత’కు ఢోకా ఉండదు! ‘సమన్యాయం’ అని ఎందుకు అనవలసి వచ్చిందంటే, బాబు హయాంలో చెప్పినట్టు విని పనులు చేసిపెట్టిన ఇద్దరు ఉన్నతాధికారులు ఇప్పటికీ రెండు కీలకమైన శాఖల్లో ఉండి, అయినవారికి ఫైళ్లు సరఫరా చేస్తున్నారు. ఇది మరో దారుణం!

పాలనా వ్యవహారాలకు సంబంధించి, కొన్ని అవినీతి సంబంధిత ఆరోపణల విచారణ తతంగం గురించి చట్టవిరుద్ధంగా జారీ అయి ఉన్న ‘26 ప్రభుత్వ ఉత్తర్వుల’ గురించి సీబీఐ సహా ఎనిమిది మంది రాష్ట్ర మంత్రులకు, వివిధ శాఖలకు చెందిన ఎనమండుగురు ఉన్నతాధికారులకూ సుప్రీం కోర్టు జారీ చేసిన నోటీసుల గురించీ కొద్దిరోజుల నాడు అనేక వార్తలు వెలువడ్డాయి. ఈ పూర్వరంగంలో న్యాయవ్యవస్థకూ, ధర్మాసన చైతన్యానికీ, స్థూలంగా మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థ మనుగడకూ, నీతికీ, నిజాయతీకీ ఎదురవుతున్న సవాళ్లు పరిశీలిస్తుంటే ఇంగ్లండ్ చరిత్రలో ఘటిల్లిన కొన్ని సంఘటనలు స్ఫురణకు వస్తున్నాయి. 

దేశ అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన నోటీసుల సామంజస్యంలోకి వెళ్లబోయే ముందు న్యాయవ్యవస్థా చట్రంలో ధర్మాసన చైతన్యానికి లేదా ఆ పదం సృష్టికే (జ్యుడీషియల్ యాక్టివిజమ్) గల మూలకారణాన్ని గురించి నేటి పాలకులూ, నేర విచారణ సంస్థలూ తెలుసుకొని మెలగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ‘ధర్మాసన చైతన్యా’నికి పునాదులన్నీ ‘స్వతంత్ర న్యాయవ్యవస్థ’ సూత్రంలో ఉంది. పాలకులకు అతీతంగా న్యాయానికి, సమన్యా యానికి అతి సన్నిహితంగా చట్టాన్ని ఉంచడమే ధర్మాసన చైతన్యానికి శాసనం! ఈ విశిష్ట సూత్రం 400 ఏళ్లనాడు ఇంగ్లండ్ ప్రభుత్వ వర్గాల అహంకారానికి, అనాలోచిత చర్యలకు, వారి ఉన్మాదానికి అడ్డుకట్ట వేయడం కోసం రూపొందింది. అది 1608 సంవత్సరం. పాలకుడు ఒకటవ జేమ్స్‌రాజు. నాడు ఇంగ్లండ్ ప్రధాన న్యాయ మూర్తిగా జస్టిస్ కోక్‌ను రాజు నియమించాడు. న్యాయ మూర్తిని నియమించింది తానే కాబట్టి అతను ‘రాజు చెప్పిందల్లా ధర్మం’ అనుకుని తనకు అణకువగా పడిఉం టాడని రాజు జేమ్స్ ఊహించాడు! ఆ ఊహాలోకం నుంచి బయలుదేరిన రాజు రాయల్‌కోర్టులో అడుగుపెడుతూనే ఓ ప్రకటన చేశాడు. 

‘కోర్టు పరిధి నుంచి ఏ కేసునైనా సరే నేను తప్పించగలను, ఆ కేసు ఆనవాళ్లు కూడా లేకుండా చేయగలను, నిర్ణయాధికారం నాదే’ అని విర్రవీగాడు. అప్పుడు చీఫ్ జస్టిస్ కోక్ కన్నెర్రజేస్తూ ‘రాజు కూడా చట్టానికి బద్ధుడై ఉండాల్సిందే. చట్టం ప్రకారం ఇంగ్లండ్ సంప్రదాయాల ప్రకారం కేసును పరిశీలించి నిర్ణయించి, కోర్టులో తీర్పు చెప్పక తప్పదు’ అన్నాడు! అందుకు ఉడికి పోయిన రాజు ‘చట్టం ప్రకారం నేను నడుచుకోవాలా, దానికి బద్ధమై నేనుండాలా? లేదు, ఇది రాజద్రోహం’ అంటూ వీరంగం వేశాడు! అప్పుడు జస్టిస్ కోక్, ‘పాలకుడెన్నడూ మరో మనిషి అదుపాజ్ఞల్లో ఉండకూ డదు, కానీ అతడు దైవం, చట్టం అధీనంలో ఉండాలి’ అని ప్రకటించాడు! ఎవరూ చట్టానికి అతీతులు కారన్నాడు. ఇదీ ధర్మాసన చైతన్యానికి స్ఫూర్తినిచ్చిన విశిష్ట సంప్రదాయం. 

ఈ మాటలు వింటునప్పుడు మన దేశంలో ఇందిరాగాంధీ హయాంలో పౌరుల ప్రాథమిక హక్కులకు సైతం ఎసరు పెడుతూ ప్రకటించిన నాటి ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తాయి! అలాగే ‘సహజన్యాయం’ అంటే ఏమిటో జస్టిస్ చిన్నప్పరెడ్డి చెబుతూ ‘ఆరోపణకు గురైన ఏ వ్యక్తినీ అతను ఏం చెబుతాడో వినకుండానే అతణ్ణి ఖండించడానికి వీల్లేదు; ఏ వ్యక్తీ తానే న్యాయమూర్తి గానూ వ్యవహరించకూడదు. ఈ పరమ సూత్రమే సహజన్యాయానికి ధర్మాసన చైతన్యానికీ మూలకందమ యింది’ అన్నారు! ఎందుకంటే, ‘హేతువు చట్టానికే జీవశక్తి’ కాబట్టి! కనుకనే, భయమూ, అనుమానమూ రాజ్యమేలుతున్న చోట ఏ ప్రజాస్వామ్య సంస్థా వృద్ధిలోకి రాదు. 

అలాంటి ‘సహజ న్యాయమూ, సమన్యాయమూ’ ఉండిఉంటే వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై వచ్చిన ఆరో పణల తాలూకు కేసులో కేవలం ‘రెండు పేజీలు’న్న పిటిషన్‌ను అనుమతించి సీబీఐ విచారణకు ఆదేశించి, దానికి ప్రతివాదులుగా ఉన్నవారు వేసిన వందల పేజీల తో కూడిన రిట్ పిటిషన్‌ను తోసిపుచ్చేవారు కాదు! అదిగో! ఇలాంటి ఉపద్రవమేదో పాలకుల్ని కూడా వెన్నా డుతున్నట్టుంది. అందుకే, అధికారమూ, సంపూర్ణాధికార మూ పాలకుల్ని అవినీతికి నెట్టడమేగాక, అధికారం కోల్పో తున్న దశలో అవీనితి బరితెగించి మరీ పెచ్చరిల్లి పోతుం దని రాజకీయ శాస్త్ర పండితులు పేర్కొన్నారు! ఈ నేపథ్యంలోనే రెండురోజులుగా ఉన్నతస్థానాలలో ఉన్న కొందరి నోట వినిపిస్తున్న కొన్ని వ్యాఖ్యానాలను పరిశీలిం చాల్సిన అవసరం ఉంది. 

1. ‘‘కేబినెట్ నిర్ణయాలకు సంబంధించి మంత్రులం దరికీ సమష్టి బాధ్యత ఉంటుంది. సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చినంత మాత్రాన వారి రాజీనామా ప్రసక్తి లేదు. సీబీఐ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో కోర్టు నోటీసులకు మంత్రులు, అధికారులే స్పందిస్తారు. నోటీసులిచ్చినంత మాత్రాన మంత్రులు తప్పు చేసినట్టుకాదు. జగన్‌మోహన్‌రెడ్డి కేసుకు, ఈ నోటీసులకు సంబంధం లేదు’’.
- కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి (12-03-2012)

2. ‘‘చట్టాలకు లోబడి పనిచేస్తున్నా గానీ అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు తప్పడంలేదు. సీబీఐలోని చట్టాలనూ మార్చాల్సి ఉంది’’ 
- సీబీఐ జాయింట్ డెరైక్టర్ వి. లక్ష్మీనారాయణ
((విశాఖలో) 12-03-2012)

ఈ ఇరువురి ప్రకటనల్లోనూ చిత్రమైన ఒప్పుకోళ్లూ, విచిత్రమైన వైరుధ్యాలూ మనకు కన్పిస్తాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసులకు స్పందనగా గౌరవ ముఖ్యమంత్రి కిరణ్ చెప్పిన ప్రకారం మంత్రిమండలి నిర్ణయాల విషయంలో ‘మంత్రులందరికీ సంబంధముంటుంది’. మరి మంత్రులందరి ‘సమష్టి బాధ్యత’ ప్రకారమే 26 జీవోలు ఉన్నతాధికారుల ద్వారా విడుదలకు కారకుల యిన, ప్రస్తుతం నోటీసులు అందుకున్న కిరణ్ క్యాబినెట్ మంత్రులూ, అధికారులూ (మొత్తం 14 మంది) గత వైఎస్ రాజశేఖరరెడ్డి క్యాబినెట్‌లో కూడా ఉన్నవారైన ప్పుడు ‘వారి రాజీనామాల ప్రసక్తి లేద’ని నేటి ముఖ్య మంత్రి ఎలా చెప్పగలుగుతారు? ఒక వేళ సమస్య ‘ముదురుపాకాన’ పడే పక్షంలో ఆనాటి క్యాబినెట్‌లో ఉన్న ఈనాటి మంత్రులు రాజీనామాలిచ్చే పరిస్థితి వస్తే, అదీ ఒకందుకు మంచిదే, తనకు నచ్చినవారిని మంత్రిగా తీసుకోవడం ద్వారా కొత్తగా పలుకుబడిని సంపాదించు కోవచ్చునని ప్రస్తుత ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారా? 
అంతే గాదు, ఇటీవలనే ఒకటికి రెండు సార్లు సుప్రీంకోర్టు ఒక ఆదేశంలో వైఎస్ పాలన సాగిన 2004-2009 మధ్య కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన విచారణ జరుపుతున్నట్టుగానే, ఎమ్మార్, ఐఎన్‌జీ కంపెనీల తాలూకూ కుంభకోణాలకు పునాదులు పడిన ఆరోపణలు వచ్చినందున చంద్రబాబునాయుడి టీడీపీ పాలన నుంచీ (2000 సంవత్సరం నుంచి 2004 దాకా) నేర విచారణకు ‘సీబీఐ ఎందుకు సిద్ధపడదు’ అని ప్రశ్నించింది (13-02-2012). అందుకు ‘అలాగే జరుపుతాం’ అని మొక్కుబడిగా అప్పటికి సీబీఐ కూడా ఓ మాట చెప్పింది! ఆ ఒప్పుకోలు కూడా రికార్డయింది. 

కాని, ఈ రెండో విచారణకు సంబంధించి ఇంతవరకూ సీబీఐ ‘ఓనమాలు’ కూడా దిద్దకపోవడం ప్రజలలో అనవసర అనుమానాలకు ‘చెవికొరుకుళ్ళ’కు విధిగా దారితీస్తోంది! అంతేగాదు, జగన్‌మోహన్‌రెడ్డి కేసుకు, మంత్రులకిచ్చిన నోటీసులకు సంబంధం లేదని కిరణ్ నమ్మమంటున్నారుగాని, అదేదో ‘మినహాయించి కన్యాదానమన్నట్టు’గా వైఎస్ కేబినెట్ లోని కొందరు మంత్రులే ప్రస్తుత మంత్రిమండలిలో కూడా కొనసాగుతున్నందున వారిని మినహాయించి ‘నోటీసుల్ని’ చూడ్డం ఎలా, ఏ చట్టం కింద ఏ న్యాయ సూత్రం కింద సమర్థనీయమవుతుందో కిరణ్ చెప్పాలి!

ఇక సీబీఐ ఉన్నతాధికారి లక్ష్మీనారాయణ ‘చట్టాలకు లోబడి పని చేస్తున్నా గానీ అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు తప్పడం లేద’ని చెప్పడమంటే, ఒత్తిళ్లు తమపై ఉన్నాయని అంగీకరించడమే గదా! అయితే ఆ ‘ఒత్తిళ్లు’ ఎవరి నుంచి, ఏ వైపు నుంచి ‘తప్పడం లేదో’ కూడా ఆయన ప్రకటించి ఉంటే అందరికీ విషయం అర్థమై ఉండేదిగదా! అయితే లక్ష్మీనారాయణ ప్రకటనలో మరో కొసమెరుపు ఉంది. కీలక బాధ్యతలు అప్పగిస్తున్న అధికారులకు భద్రత కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన విశాఖ విలేకరులతో అన్నప్పుడు విలేకరులు ఒక ఎదురు ప్రశ్న వేశారు. ‘కీలకమైన కేసుల పరిష్కారంలో మీక్కూడా భద్రత కావాలా’ అని ప్రశ్నించగా ‘నాకు మీడియానే సరైన భద్రత’ అని స్పష్టం చేశారు. మీడియాపైన అంత ‘విశ్వా సం’ ప్రకటించినందుకు ఆయనను అభినందించాల్సిందే! ఎందుకంటే జగన్‌మోహన్‌రెడ్డి వర్సెస్ పాలకపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పూర్వరంగంలో ఇల్లు కాలు తుండగా బొగ్గులేరుకోడానికి ముందువరుసలో ఉండడా నికి అలవాటుపడిన రెండు పత్రికలు, ఒకటి రెండు టీవీ చానళ్లు, నిస్సందేహంగా విచారణాధికారులకూ స్వార్థ ప్రయోజనాల కోసం ‘సరైన భద్రత’నే కల్పిస్తు న్నాయి. కొందరికి ‘పచ్చచొక్కా’ అఫీసర్లని, కొందరికి ‘ఎల్లో జర్నలిస్టుల’నీ పేరొచ్చింది కూడా ఇలాగనే!

ఇక పూర్వాశ్రమంలో చంద్రబాబు కనుసన్నల్లో నడుచుకున్న ఒకరిద్దరు పాత్రికేయ సోదరులు కూడా ఒక స్థానిక ఆంగ్ల దినపత్రికలో తమ రూపురేఖలు దిద్దుకుం టున్నారు! వారి నుంచి కూడా చిలవల పలవులతో కూడిన అల్లికతో వచ్చే వార్తల ద్వారా కూడా అధికారులు ఆశిస్తున్న ‘సరైన భద్రత’కు ఢోకా ఉండదు! ముందస్తుగానే ఉభయ తారక పద్ధతిలో అనుకూల ప్రశ్నల ద్వారా అనుకున్నవారి నుంచి అనుకూల సమాధానాలు రాబట్టడంలో లీడింగ్ క్వొశ్చెన్స్ వేసే లాయర్లను మించిన తెలివితేటలు గలవాళ్లు ‘నారద సంతతి’లో లేకపోలేదు! వ్యవస్థాగత వైఫల్యాల పైన, తప్పుడు రాజకీయ-ఆర్థిక విధానాలపైన బతికి బట్టకట్టజూస్తున్న పాలకులు... వారి అడుగులకు మడుగు లొత్తే విచారణ సంస్థలూ అనేక సందర్భాల్లో ప్రజావ్యతిరేక చర్యలనూ, సంపన్న వర్గాల ప్రయోజనాలకు అనుకూల మైన నిర్ణయాలనూ ఆశ్రయించక తప్పదు. 

కనుకనే ‘జైన్ హవాలా కేసు’ (వినీత్ నారాయణ్ పిటిషన్)లో విచారణ తంతును పసికట్టిన సుప్రీంకోర్టు, సీబీఐ సంస్థ ప్రధాన మంత్రికి గాకుండా తనకు జవాబుదారీగా ఉండాలని అప్పటి సందర్భానికి తగినట్టుగా ఆదేశించి, శాసించాల్సి వచ్చింది! ఆ సమయంలోనే సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడేందుకుగాను స్వతంత్ర సంస్థగా ప్రకటించిన కేంద్ర నిఘా సంస్థ (విజిలెన్స్ కమిషన్) పర్యవేక్షణలో సీబీఐ పనిచేయడం శ్రేయస్కరమని సుప్రీంకోర్టు చెప్పాల్సి వచ్చింది. అయితే ఇటీవల కాలంలో ‘సుప్రీం’ స్థాయిలో కాకపోయినా స్థానికంగా (హైదరాబాద్ కేంద్రంగా) హైకోర్టు, సీబీఐ కోర్టు కూడా సీబీఐ వైఖరులను ప్రశ్నించాల్సి రావడం ఎంతో చరిత్ర గల నేర విచారణ సంస్థ పరువుప్రతిష్టలకు మంచిది కాదని గుర్తించాలి. 

ఉదాహరణకు, కేంద్రం అనుమతిలేకుండా (కేంద్ర సర్వీసు లలో ఉన్న అధికారులపై కేసులు పెట్టడానికి, విచారణ జరపడానికి కేంద్రప్రభుత్వ అనుమతి అవసరమని రాజ్యాంగం నిబంధన) ఎమ్మార్ కుంభకోణాలపై పెట్టిన చార్జిషీట్‌లో ఐఏఎస్ అధికారులను చేర్చడానికి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానమే అభ్యంతరం తెలిపింది. అదే కేసులో అందరూ నిందితులు అయినప్పుడు 13వ నిందితుడిగా ఉన్న తుమ్మల రంగారావుకు ముందస్తు బెయిల్‌కు అభ్యంతరం లేదన్న సీబీఐ మరో నిందితుడైన సునీల్‌రెడ్డికి బెయిల్ ఇవ్వకుండా ‘ఎంతకాలం జైల్లో ఉంచుతారని’ గౌరవ న్యాయమూర్తి నాగమారుతి శర్మ ప్రశ్నించాల్సివచ్చింది. అసలు సునీల్‌రెడ్డి అరెస్టును ఎలా సమర్థించుకుంటారని ఆయన ఎందుకు ప్రశ్నించాల్సి వచ్చింది? సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జీని ‘సీబీఐ ప్రభావితం చేస్తోందన్న’ ఆరోపణలతో ఈ నెల 12వ తేదీన ఒక న్యాయవాది రాష్ట్ర హైకోర్టులో ఎందుకు పిటిషన్ దాఖలు చేయాల్సివచ్చింది? అలాగే ఓఎంసీ కేసులో తాము చేయని తప్పును ఒప్పుకోమని సీబీఐ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఒక ప్రిన్సిపల్, ఒక వ్యాపారి రక్షణ కోసం హైకోర్టును ఎందుకు ఆశ్రయించాల్సివచ్చింది?

ఇటీవల దేశంలో సంభవించిన కొన్ని సంఘటనల విషయంలో కూడా సీబీఐ పరువు, ప్రతిష్టలు మసకబారాయి. విచారణ ద్వారా కేంద్ర మంత్రులనే ‘స్కాము’ల నేపథ్యంలో జైళ్లకు పంపించగలిగిన ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో సుప్రీంకోర్టు ఆదేశించినట్టు 2000 సంవత్సరం నుంచి జరిగిన కుంభకోణాలలోకి మెడలు నిక్కించడానికి ఎందుకు వెనుకాడాల్సివచ్చింది? 1993 జనవరిలో ముంబైలోని హరి మజీద్ వద్ద నమాజులో ఉన్న ఆరుగురు ముస్లిములను నిఖిల్ కాఫ్‌సే అనే సబ్‌ఇన్‌స్పెక్టర్ కాల్పులు జరిపి హతమార్చిన కేసును విచారణ జరిపిన మూడుసార్లూ పోలీసు అధికారిని శిక్షించాలని హైకోర్టు తీర్మానించినా సీబీఐ ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు శిక్షించకుండానే కేసును మూసేసినట్టు? ‘క్లోజర్’ రిపోర్టును ఎందుకు దాఖలు చేయాల్సివచ్చింది? ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ముంబై హైకోర్టు ఆదేశాలకు లోబడి విచారణ జరిపిన శ్రీకృష్ణ కమిషన్... ‘‘కాఫ్‌సే నిష్కారణంగా, దారుణంగా, అమానుషంగా, సమర్థించుకోవడానికి వీల్లేని విధంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారని’’ నిర్ధారణ చేసినా, అతీగతీ లేదు! 

హైకోర్టు సీబీఐ విచారణను తప్పు పడుతూ ‘ఈ కేసు మొత్తం భారతదేశం ఆత్మనే దెబ్బతీస్తుందన్న’ ఆవేదన వ్యక్తం చేసినా చీమ కుట్టలేదు! ‘‘న్యాయంపై, చట్టంపై ప్రజలు కోల్పోతున్న విశ్వాసాన్ని తిరిగి పునరుద్ధరించాలని మీకు అనిపించడం లేదా?’’ అని నిస్సహాయంగా హైకోర్టు ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నించింది! కాఫ్‌సేపై ఎఫ్‌ఐఆర్‌ను దాఖలు చేయకుండా తాత్సారం చేస్తున్న సీబీఐని ఉద్దేశించే జస్టిస్ రెబెల్లో, జస్టిస్ ఆర్.ఎఫ్.మొహిత్‌ల బెంచ్ ఈ వ్యాఖ్య చేసింది. చివరికి ‘తెహల్కా’ పత్రికపై కేసు సందర్భంగా అనేక కూపీలు లాగి ప్రభుత్వాన్ని, పాఠకలోకాన్ని చైతన్యవంతులు చేయడానికి ప్రయత్నించిన మాథ్యూస్, బాదల్ వంటి అత్యున్నత ప్రమాణాలు గల పాత్రికేయులను సైతం తప్పుడు కేసులతో నెలల తరబడి జైళ్లలో ఉంచింది సీబీఐ. ఇప్పటికైనా మించిపోయింది లేదు - ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదివి ఐపీఎస్‌కు ఎంపికై వృద్ధిలోకి వచ్చిన లక్ష్మీనారాయణ వంటి అధికారులు పాలకుల రాజకీయ కుట్రలకు దూరంగా ఉంటే మంచిది. మార్చవలసింది సీబీఐ చట్టాన్నే కాదు, కలవారి లోగిళ్లకు కాటికాపలా కాసే పాలకుల విధానాలనూ మార్చుకోవాలి. 

ఇది నిందారోపణతో, ప్రత్యారోపణలతో అయ్యే పనికాదు. దేశ అత్యున్నత న్యాయస్థానం సాధారణ పౌరులపై అత్యాచారాలను, హత్యాకాండను సాగించిన సైనికుల్ని ప్రాసిక్యూట్ చేయాలని ఆదేశించినా, దాన్ని బేఖాతరు చేసిన హోంశాఖ వంటి సంస్థలు ఉన్నంత కాలం దేశ ప్రజల రక్షణ అసంభవం. ఈ అకృత్యాలను సుప్రీంకోర్టు ‘యూనిఫారాలలో సాగుతున్న హత్యలు’గా వర్ణించవలసివచ్చిందని మరువరాదు! ‘కేంద్రం అనుమతితోనే ప్రాసిక్యూషన్’ అని కొందరు వల్లిస్తున్నారు. ఈ ప్రశ్నకూ సుప్రీంకోర్టు ముఖం వాచిపోయేట్టు సమాధానం చెప్పింది. ‘‘ప్రత్యేకాధికారాల చట్టం చాటున ఓ ప్రాంతంలోకి వెళ్లి స్వేచ్ఛగా అత్యాచారాలు, హత్యలు చేసి వచ్చేవారికి, వేరే అనుమతి దేనికి’’? విచారణ సంస్థలు సమన్యాయం పాటిస్తే ఈ చిక్కులుండవు గదా! ‘సమన్యాయం’ అని ఎందుకు అనవలసి వచ్చిందంటే, బాబు హయాంలో చెప్పినట్టు విని పనులు చేసిపెట్టిన ఇద్దరు ఉన్నతాధికారులు ఇప్పటికీ రెండు కీలకమైన శాఖల్లో ఉండి, అయినవారికి ఫైళ్లు సరఫరా చేస్తున్నారు. ఇది మరో దారుణం
Share this article :

0 comments: