మాటపై నిలబడే నేత జగన్: విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మాటపై నిలబడే నేత జగన్: విజయమ్మ

మాటపై నిలబడే నేత జగన్: విజయమ్మ

Written By ysrcongress on Monday, March 12, 2012 | 3/12/2012

పేదవాడి కన్నీరు తుడవాలన్న జీవితాశయంతో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పనిచేశారని ఆయన సతీమణి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. తమ కుటుంబం ఎల్లప్పుడు ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి ఏడాది పూర్తయిన సందర్భంగా పులివెందులలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆమె నివాళులర్పించారు. అనంతరం అభిమానులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రజా సంక్షేమం కోసం వైఎస్సార్ అహరహం కృషి చేశారన్నారు. 

ఒక్క రూపాయి కూడా పన్నులు పెంచకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత మహానేతకే దక్కుతుందన్నారు. తన రెక్కల కష్టంతో కాంగ్రెస్‌ను రెండోసారి అధికారంలోకి తెచ్చారన్నారు. వైఎస్సార్ పథకాలను నిర్లక్ష్యం చేస్తున్న ఇప్పటి ప్రభుత్వాన్ని చూస్తే తనకు బాధేస్తుందన్నారు. తన తండ్రిలా మాటపై నిలబడే పట్టుదల జగన్‌కు ఉందన్నారు. మహానేత ఆశయాల కోసం పనిచేస్తున్న జగన్‌కు ప్రజలందరి అండదండలు కావాలని కోరారు. పార్టీ పెట్టిన ఏడాదిలోనే వివిధ ప్రజా సమస్యలపై జగన్ రాజీలేని పోరాటం చేశారని విజయమ్మ గుర్తుచేశారు.
Share this article :

0 comments: