నేడు జగన్ పర్యటించే గ్రామాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు జగన్ పర్యటించే గ్రామాలు

నేడు జగన్ పర్యటించే గ్రామాలు

Written By ysrcongress on Friday, March 16, 2012 | 3/16/2012

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోవూరు ఉప ఎన్నికల ప్రచారం శుక్రవారంతో ముగియనుంది. ఆయన బుచ్చిరెడ్డిపాలెం మండల ంలో ఐదు గ్రామాల్లో పర్యటి ంచనున్నారు. ఉదయం 9 గంటలకు కాగులపాడు నుంచి ప్రారంభించి పెనుబల్లి, పంచేడు, మినగల్లు మీదుగా నాగాయగుంటకు చేరుకుంటారు. ఇక్కడతో ప్రచారం ముగించుకుని కడప జిల్లాకు వెళ్తారు.


 ‘జగన్ గెలిస్తే తిరుమలకొచ్చి తలనీలాలు సమర్పిస్తానని స్వామిని మొక్కుకున్నా’ చెర్లోపల్లిలో ఓ అవ్వ అభిమానం. 
మీరు చెప్పినా .. చెప్పకపోయినా ఫ్యాను గుర్తుకే నా ఓటు.. పడుగుపాడులో రమణమ్మ, పాటూరు, గుమ్మళ్లదిబ్బ, వేగూరు, లేగుంటపాడులో.. ఇలా దారిపొడవునా లక్ష్మిదేవి, క్రిష్ణవేణి, పెంచలమ్మ, సుజాత అన్న మాటలవి.. పల్లెల్లో మహిళలు చామంతి పుష్పాలతో ఫ్యాను గుర్తును ముగ్గులతో అలంకరించారు. మహానేత వైఎస్సార్ రూపం.. చుట్టూ పథకాలతో రూపుదిద్దుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను పుష్పాలు, రంగురంగుల ముగ్గులతో అలంకరించి అభిమానాన్ని చాటుకున్నారు. 

నెల్లూరు, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిని విజయాన్ని కాంక్షిస్తూ ఆ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి కోవూరు మండల పరిధిలో పాటూరు, గుమ్మళ్లదిబ్బ, పెద్దపడుగుపాడు, చెర్లోపాళెం, కట్టకింద చెర్లోపాళెం, మోడేగుంట, వేగూరు, లేగుంటపాడు, ఇనమడుగు, కోవూరు లో ప్రచారం నిర్వహించారు. ఈ గ్రామాల్లో ప్రజలు జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా అడ్డుకుని హారతులు ఇచ్చి విజయ తిలకం దిద్ది ముందుకు సాగనంపారు. 

మహానేత తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పల్లెకు వస్తున్నాడని తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారిపొడవునా జననేతకు ఘన స్వాగతం పలికారు. జగన్‌ను చూసేందుకు.. చేతి స్పర్శ కోసం తపించారు. ‘జగన్ జిందాబాద్.. వైఎస్సార్ అమరహే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే మా ఓటు’ అంటూ నినాదాలు చేస్తూ జగన్ ప్రచార రథం వెంట నడిచారు. ఎన్నడూ.. ఎవ్వరూ రాని మా గ్రామానికి వైఎస్ జగన్ వచ్చాడంటూ యువకులు కేరింతలు కొడుతూ ముందుకు సాగారు. ప్రచార రథం వెంట జెండాలు పట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని అభ్యర్థించారు.

నాయనా.. ఆరోగ్యం జాగ్రత్త
‘నాయనా.. మామీద నీకు ఎంత ప్రేమ. మా కోసం ఊరూరా తిరుగుతుండావు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో.. మా ఓట్లన్నీ నీకే నాయనా. ఎవరెన్ని చెప్పినా.. డబ్బులు ఇచ్చినా.. మా మనస్సు మారదు. మీ అయ్య మాకు శానా చేసినాడు. ఆయన రుణం తీర్చుకోవాలి. మా ఊరోళ్లంతా రాత్రే మాట్లాడుకున్నాం. అంతా ఒకటే మాటపై ఉండాలని నిర్ణయించుకున్నాం. నీవేం దిగులు చెందకు సల్లగుండు. అమ్మను అడిగానని చెప్పు. యేలకు అంత ముద్ద తినటం మరిచిపోకు’ అంటూ దేవకమ్మ వైఎస్ జగన్‌ను బుగ్గ నిమురుతూ దీవించారు. 

అంతే అభిమానంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరుపేరునా పలుకరిస్తూ.. నుదుటన ముద్దాడి.. ‘ఎలా ఉన్నావు అవ్వా.. ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ అడిగి తెలుసుకున్నారు. ప్రచారం ముగించుకుని ముందుకు సాగుతూ.. బాయ్ అవ్వా... బాయ్ తల్లీ... తాతా బాయ్.. తమ్ముడూ టాటా’ అంటూ చేతులూపుతూ ముందుకు సాగడాన్ని చూసి జనం మురిసిపోయారు. తన మనవడు కూడా ఇంత ప్రేమ, ఆప్యాయతలు చూపలేదని వృద్ధులు చర్చించుకోవడం కనిపించింది. ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కర్నూలు జిల్లా నాయకులు కేంద్ర గవర్నింగ్ సభ్యులు భూమానాగిరెడ్డి, ఎమ్మెల్సీ ఎస్వీమోహన్‌రెడ్డి, ఆ జిల్లా పార్టీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, నాయకులు బుగ్గన రాజారెడ్డి, వెంకటరెడ్డి పాల్గొన్నారు.


 
Share this article :

0 comments: