వాస్తవాలు సుప్రీంకోర్టుకు తెలపండి:సోమయాజులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వాస్తవాలు సుప్రీంకోర్టుకు తెలపండి:సోమయాజులు

వాస్తవాలు సుప్రీంకోర్టుకు తెలపండి:సోమయాజులు

Written By ysrcongress on Tuesday, March 13, 2012 | 3/13/2012

నోటీసులు అందుకున్న మంత్రులు సుప్రీం కోర్టుకు వాస్తవాలు తెలపండి చాలు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సలహాదారుడు డిఎ సోమయాజులు అని అన్నారు. మంత్రి పదవులకు రాజీనామా చేయమని తాము వారిని డిమాండ్ చేయడంలేదని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తప్పుడు జిఓలు అని పేర్కొన్న 26 జిఓలు సక్రమంగా ఉన్నాయా? లేదా? అన్నదే సుప్రీం కోర్టు ప్రశ్నిస్తుందని ఆయన తెలిపారు. ఆ జిఓలు సరైనవేనని సుప్రీం కోర్టుకు తెలుపవలసిన బాధ్యత మంత్రులపై ఉందన్నారు. సుప్రీం కోర్టు నోటీసులపై మంత్రులు తలా ఒక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. 

టిడిపి నేత అశోక్ గజపతిరాజు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి, శంకరరావులు చేసి ఫిర్యాదులు ఒక్కటేనన్నారు. కాంగ్రెస్, టిడిపి కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని ఏదో ఒక రకంగా ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ కేసు వేసిన అధికార పార్టీ ఎమ్మెల్యే శంకరరావుకు వెంటనే మంత్రి పదవి లభించిందని గుర్తు చేశారు. ఇది 'క్విడ్ ప్రో కో' కాదా? అని ఆయన ప్రశ్నించారు. 

ప్రభుత్వం జారీ చేసిన 26 జిఓల ఆధారంగా కేసులు పెట్టారు. పలువురు ఐఎఎస్ అధికారులను, ఇతరులను నిందితులుగా పేర్కొన్నారు. అందులో భాగంగా జగన్ ని 52వ ప్రతివాదిగా మాత్రమే చేర్చారని ఆయన వివరించారు. అయితే సిబిఐ మాత్రం ఎఫ్ఐఆర్ లో 26 జిఓలను ప్రస్తావించలేదు. సుప్రీం కోర్టు ఆ విషయాన్నే ప్రశ్నించిందన్నారు. ఆ జిఓలు రూపొందించిన ఐఎఎస్ అధికారులకు, వాటిని ఆమోదించిన మంత్రులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసిందని చెప్పారు. ఆ జిఓలు సరైనవేనని ప్రభుత్వం తరపున మంత్రులు, ఐఎఎస్ అధికారులు సుప్రీం కోర్టుకు వివరిస్తే సరిపోతుందన్నారు. ఆ 26 జిఓలకు, జగన్ కు సంబంధం ఏమిటని సోమయాజులు ప్రశ్నించారు. 

ఈ దేశంలో అతి సామాన్యులు ఎంతో మంది వ్యాపారాలు చేసి సంపన్నులు అయ్యారని తెలిపారు. కావాలంటే వారి పేర్లే తాను చెబుతాన్నారు. ధీరుబాయ్ అంబానీ దగ్గర నుంచి లగడపాటి రాజగోపాల్ వరకు అనేకమంది అనేక రకాల వ్యాపారాలు చేసి డబ్బు గఢించారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు కూడా ఎన్నో వ్యాపారాలు చేసి డబ్బు గఢించలేదా? అని ప్రశ్నించారు. ఆయన చేసిన వ్యాపారాలలో నష్టాలు వచ్చినా పెట్టుబడులు పెట్టారు. ఎలా పెట్టారని ఆయన ప్రశ్నించారు. అలాంటి వారందరి మీద కేసులు నమోదు చేశారా? అని అడిగారు. వారిని అరెస్ట్ చేశారా? అని ప్రశ్నించారు. అటువంటప్పుడు జగన్ ని ఎందుకు అరెస్ట్ చేస్తారని ఆయన అడిగారు. ఆయనని ఈరోజు అరెస్ట్ చేస్తారు, రేపు అరెస్ట్ చేస్తారని పలు చానెల్స్ ప్రసారం చేశాయని, పలు పత్రికలు ఇష్టమొచ్చిన విధంగా కథనాలు రాశాయని విమర్శించారు. 

పరిశ్రమలకు ప్రభుత్వం భూములు, నీరు, విద్యుత్, ఇతర రాయితీలు ఇవ్వడం సహజం అన్నారు. ప్రభుత్వం రాయితీలు ఇవ్వకుండా ఏ పరిశ్రమ స్థాపించడం సాధ్యం కాదన్నారు. 1956 నుంచి ప్రతి పరిశ్రమకు ప్రభుత్వం భూమి ఇస్తూనే ఉందన్నారు. ఒక్క సిమెంట్ పరిశ్రమకే కాకుండా, పలు రంగాలలోని పరిశ్రమలకు, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ వంటి సంస్థలకు కూడా ప్రభుత్వం భూమి, నీరు, విద్యుత్, ఇతర రాయితీలు ఇస్తూనే ఉందని గుర్తు చేశారు.
Share this article :

0 comments: