జగన్‌మోహన్‌రెడ్డి చుట్టూనే తిరుగుతున్న రాష్ట్ర రాజకీయాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌మోహన్‌రెడ్డి చుట్టూనే తిరుగుతున్న రాష్ట్ర రాజకీయాలు

జగన్‌మోహన్‌రెడ్డి చుట్టూనే తిరుగుతున్న రాష్ట్ర రాజకీయాలు

Written By ysrcongress on Monday, March 12, 2012 | 3/12/2012


తొలి రోజు నుంచీ ప్రజా సమస్యలపై పోరాడుతున్న పార్టీ
నిరంతరం ప్రజల్లో ఉంటూ రాజకీయాల్లో కేంద్ర బిందువైన జగన్
మధ్యంతర ఎన్నికలు, ప్రాంతీయ పార్టీల ప్రభావంపై దేశవ్యాప్తంగా చర్చ
రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభావంపై సర్వత్రా ఆసక్తి

ఆవిర్భావానికి ముందే ఎమ్మెల్సీ స్థానాలు కైవసం
పుట్టీ పుట్టగానే కడప, పులివెందుల ఫలితాలతో రాజకీయాల్లో సంచలనం.. దీంతో కాంగ్రెస్, టీడీపీ ఫిక్సింగ్ ముమ్మరం
ప్రజలకు దగ్గరకావడానికన్నా జగన్‌పై కుట్రలకే ప్రాధాన్యం
అవిశ్వాసంలోనూ జగన్‌మోహన్‌రెడ్డే లక్ష్యం..
17 మంది ఎమ్మెల్యేలు ఆయనవైపు నిలిచినా వేటేయని కాంగ్రెస్
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలోనే అనర్హత వేటు 
నిరంతరం ప్రజల్లో ఉంటూ రాజకీయాల్లో కేంద్ర బిందువైన జగన్

హైదరాబాద్, న్యూస్‌లైన్: లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు తప్పవన్న సంకేతాలు వెలువడుతున్న తరుణంలో రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభావంపై ఇప్పుడు తీవ్రస్థాయి చర్చ జరుగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి సోమవారంతో సరిగ్గా ఏడాది పూర్తవుతోంది. వైఎస్ మరణం నుంచి నేటి వరకు జగన్‌మోహన్‌రెడ్డి చుట్టూనే రాష్ట్ర రాజకీయాలు తిరుగుతుండటం, పుట్టినప్పటినుంచి ప్రజా సమస్యలే పునాదిగా పార్టీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుండడం... ఈ నేపథ్యంలో పార్టీ ప్రభావం రానున్న రోజుల్లో తీవ్రంగా ఉంటుందని అన్ని పార్టీలూ అంగీకరిస్తున్నాయి. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో రోజురోజుకూ చోటుచేసుకుంటున్న కొత్త పరిణామాలను, ఉత్తరప్రదేశ్‌తో కలిపి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తున్న అన్ని రాజకీయ పక్షాలూ ఇప్పుడు మధ్యంతర ఎన్నికలపై దృష్టిని సారిస్తున్నాయి. మధ్యంతర ఎన్నికలు, ప్రాంతీయ పార్టీల ప్రభావమే ఇప్పుడు అన్ని వర్గాల్లోనూ కీలకాంశంగా మారింది. ప్రజా సమస్యలపై పోరాడుతున్న నేతలకే జనం పట్టం కడుతున్న పరిణామాలను బేరీజు వేసుకుంటున్న రాజకీయ పార్టీలు రానున్న పరిణామాలపై ఇప్పటినుంచే రకరకాల విశ్లేషణల్లో మునిగిపోయాయి.

ఉప ఎన్నికలపై అందరి కన్ను..

2004, 2009 ఎన్నికల్లో రెండుసార్లు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణం రాష్ట్రంలో ఆ పార్టీని తీవ్ర అనిశ్చితిలోకి నెట్టింది. అధికారంలో ఉన్న పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను కాంగ్రెస్ అధిష్టానం ఇంతకాలం పెద్దగా పట్టించుకోనప్పటికీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఇప్పుడు డైలమాలో పడినట్టు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలు, ఆ తర్వాత రాబోయే 17 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల నేపథ్యంలో.. వాటి ఫలితాల అనంతరం రాజకీయ సమీకరణల్లో అనేక మార్పులు తప్పవన్న అంచనాకు వస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా గత రె ండేళ్లలో ఎదురైన ప్రతి ఉపఎన్నికలోనూ దెబ్బతింటోంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలోనే ఏర్పడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై అందరి దృష్టీ పడింది.

పుట్టీ పుట్టగానే..: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసిన కొద్ది మాసాల్లోనే జరిగిన కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ స్థానాల్లో రికార్డు స్థాయి మెజారిటీతో జగన్‌మోహన్‌రెడ్డి, విజయమ్మ గెలవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పార్టీ ప్రకటించడానికి ముందే స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే మూడు స్థానాలు కైవసం చేసుకున్న పార్టీ తొలి విజయంతో కాంగ్రెస్ కంగుతింది. దాంతో ప్రజలకు దగ్గర కావడానికన్నా కాంగ్రెస్ కుట్రపూరిత రాజకీయాలకు దిగడం ప్రారంభించింది. వైఎస్సార్ కాంగ్రెస్‌ను టార్గెట్ చేసుకుని సందర్భానుసారంగా అధికార, ప్రతిపక్ష పార్టీలు మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నాయి. పలు ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు సహకరించుకుంటూనే మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ రాానున్న రోజుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని ఒకసారి, తిరిగి కాంగ్రెస్‌తో కలిసిపోతుందని మరోసారి నిరాధార విషప్రచారానికి కూడా ఒడిగట్టాయి.

ప్రతిరోజూ ప్రజల మధ్యే జగన్..: అధికార, ప్రతిపక్షాల కుట్రలను పట్టించుకోకుండా ఏడాది కాలంలోనే అనేక ప్రజా ఆందోళనలతో ఆ పార్టీ ముందుకు సాగింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గడిచిన రెండేళ్లుగా ప్రజల మధ్యనే గడపటం, వారి సమస్యలను అవగాహన చేసుకోవడం, సందర్భాన్ని బట్టి ఆయా సమస్యలపై దీక్షలు చేయడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడంతో ఇటు కాంగ్రెస్, అటు టీడీపీ జీర్ణించుకోలేని పరిస్థితి. మ్యాచ్‌ఫిక్సింగ్ లాంటి సంకుచిత ఎత్తుగడతో వెళుతున్న టీడీపీ ఈ రెండేళ్ల కాలంలో ఎదురైన పలు ఎన్నికల్లో ఒక్క విజయాన్నీ తన ఖాతాలో వేసుకోలేకపోయింది. తాజా పరిణామాల్లో కేంద్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అనిశ్చితి. దాని ప్రభావం రాష్ట్రంపై ఎలా ఉంటుందో అర్థంకాని రాజకీయ వాతావరణం మధ్య రానున్న రోజుల్లో రాజకీయ పరిణామాలపైనే ప్రజల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

ఏడాది కాలంలో ఎన్నో కుట్రలు, కుతంత్రాలు..

అన్నింటా విఫలమైన ప్రభుత్వంపై సమయానుకూలంగా అవిశ్వాస తీర్మానం పెట్టడంలో టీడీపీ ఘోరంగా విఫలంకాగా, అలవికాని సమయంలో అవిశ్వాస తీర్మానం పెట్టినా ఆ పార్టీ కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసే దిశగా మాత్రమే పనిచేసింది. అవిశ్వాస తీర్మానానికి మద్దతునిచ్చిన ఎమ్మెల్యేలను తూలనాడిన చరిత్రను టీడీపీ మూటకట్టుకుంది. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో బెంబేలెత్తిన అధికార పార్టీ ఎన్నో ఆశలు చూపి ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసుకోకతప్పలేదు. శాసనసభలో 17 మంది ఎమ్మెల్యేలు వైఎస్సార్ కాంగ్రెస్ పక్షాన నిలిస్తే వారిపై వేటు వేయడానికి కూడా వెనుకడుగు వేసిన వాతావరణం, మరోవైపు వైఎస్సార్ సీపీవైపు మరికొందరు ఎమ్మెల్యేలు రాకుండా ఉండేందుకు నయానా భయానా అన్ని రకాలుగా ప్రలోభపెట్టి అడ్డుపడి ప్రభుత్వాన్ని కాపాడుకోవలసిన పరిస్థితి కాంగ్రెస్‌ది. ఏ రాజకీయ పార్టీ అండా లేనప్పటికీ, ఏ అధికారం లేనప్పటికీ ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఆదరించడం, ఆదరిస్తుండటంతో తెరవెనుక కుట్రలు, కుతంత్రాలకు తెరలేపారన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది.

వైఎస్సార్ సీపీకి నేటితో ఏడాది: గత ఏడాది మార్చి 12న పురుడుపోసుకున్న వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి ప్రజా ఉద్యమాలు, ఆందోళనలే ఊపిరిగా ముందుకు సాగుతోంది. ఏడాది కాలంలో అనేక అంశాలు, సమస్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ ఆందోళనలు నిర్వహించింది. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలుపై నిత్యం పోరాటం కొనసాగిస్తూనే ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి అనేక ఆందోళనలను ముందుండి నడిపించారు. రాష్ట్రానికి అత్యంత కీలకమైన అంశాలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను నిర్వీర్యం చేస్తుండటాన్ని ఎత్తిచూపడానికి స్వయంగా ఆయన అనేక దీక్షలు నిర్వహించారు. పార్టీ ఏర్పడిన ఏడాది కాలంలో కీలకమైన ఆయా అంశాలపై జగన్ 12 సార్లు దీక్షలు, ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. రైతులు, రైతు కూలీలు, చేనేతలు, విద్యార్థులు, మత్స్యకారులు, కరువుతో అల్లాడుతున్న ప్రజలు.. ఒకరేమిటి రాష్ట్రంలోని అన్ని వర్గాలను పరామర్శిస్తూ సమస్య ఉన్న ప్రతిచోటికీ జగన్ వెళ్లారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ, 104, ఫీజు రీయింబర్స్‌మెంట్, చేనేత, రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూనే పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఆ ఉద్యమాలే ఊపిరిగా కొనసాగించారు. రైతు దీక్ష, గిట్టుబాట ధర కోసం సాగుపోరు, ఫీజు రీయింబర్స్‌మెంట్, క్రాప్ హాలిడే రైతులకు అండగా కోనసీమలో, పెంచిన గ్యాస్ ధరలకు నిరసగా అనంతపురంలో, పండించిన పంటలకు గిట్టుబాట ధరల కోసం... ఇలా ఒకటేమిటి ఎన్నో ప్రజా ఆందోళనలే ఊపిరిగా ఆయన ముందుకు సాగుతున్నారు.
Share this article :

0 comments: