జగన్‌పై చెయ్యేస్తే ఉప్పెనే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌పై చెయ్యేస్తే ఉప్పెనే

జగన్‌పై చెయ్యేస్తే ఉప్పెనే

Written By ysrcongress on Friday, March 9, 2012 | 3/09/2012

వైఎస్ తనయుడికి అండగా ఉంటామని ప్రతిన
వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం

న్యూస్‌లైన్ నెట్‌వర్క్ : మహిళా సాధికారత, స్వావలంబనకు అహరహం శ్రమించిన దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా ఉంటామంటూ స్త్రీలోకం ఎలుగెత్తి చాటింది. ఆయనపై కుట్రలు చేసి, అరెస్టు చేయాలని ప్రయత్నిస్తే మాడి మసైపోతారంటూ హెచ్చరించిం ది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, ఏలూరు, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు, అనంతపురం తదితర ప్రాంతాల్లో వేడుకలా చేశారు. ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న స్త్రీలు తమకోసం వైఎస్‌ఆర్ చేపట్టిన పలు పథకాలను గుర్తు చేసుకున్నారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఆరుగురు మహిళలకు చోటు కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా నేతలు ప్రస్తావించారు. వితంతు, వృద్ధాప్య పింఛన్లను రూ. 75 నుంచి రూ.200కు, ఆడపిల్ల పుడితే రూ.లక్ష పథకం, 104 పథకం ద్వారా గ్రామాల్లో మహిళలకు సేవలు తదితర ఎన్నో పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్‌కే దక్కుతుందన్నారు. ఆ మహానేత ఫొటోను పెట్టుకుని గెలిచిన మంత్రులు అసెంబ్లీలో వైఎస్ విజయమ్మను హేళనగా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ప్రతి మహిళను లక్షాధికారిని చేయాలని వైఎస్ తపన పడేవారని, స్త్రీల కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు. పేదల సంక్షేమంతో పాటు మహి ళా సంక్షేమాన్ని కొడిగట్టేలా చేస్తోందని ధ్వజమెత్తారు. మహానేత ఆశయంతో మహిళాభివృద్ధి కోసం తపిస్తున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కుట్రలుచేస్తే మహిళలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మహిళలు స్వీట్లు పంచుకుని, హోలీ సందర్భంగా రంగులు జల్లుకుని శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

అంతకుముందు వైఎస్. రాజశేఖరరెడ్డి ఫోటోకు పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారితో పాటు నేతలు బాజిరెడ్డి గోవర్దన్, గట్టు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ లో వేలాదిమంది మహిళలు భారీ ప్రదర్శన నిర్వహించారు. తామంతా జగన్‌కు అండగా ఉంటామని,ఎలాంటి కష్టమొచ్చినా పోరాడేందుకు సిద్ధంగా ఉ న్నామని వారంతా నినాదాలు చేశారు. పార్టీనగర కన్వీనర్ జలీల్‌ఖాన్, మహిళా నేతలు తాతినేని పద్మావతి, ఎల్. సునీత తదితరులు పాల్గొన్నారు. అనంతపురంలో పార్టీ మహిళావిభాగం జిల్లా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై నిందలు మోపితే మహిళలే తగిన బుద్ధి చెబుతారని కర్నూలు జిల్లా కన్వీనర్ నారాయణమ్మ పేర్కొన్నారు. వైఎస్‌ఆర్ మహిళా సంఘం ఆధ్వర్యం లో స్థానిక ఎస్‌బీఐ సర్కిల్‌లోని వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో మహిళలకు న్యాయం జరగాలంటే జగనన్న పాలన రావాలన్నారు. విశాఖలో పార్టీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్, జిల్లా క న్వీనర్ గొల్ల బాబురావు సమక్షంలో సమాజం లో ఉత్తమ సేవలందించిన ఐదుగురు మహిళలను సత్కరించా రు.‘కట్నాలు తీసుకోం. ఆడపిల్లలను బాగాచదివిసామ’ని మహిళలు ప్రతిజ్ఞ చేశారు. స్థానిక సుబ్బలక్ష్మి కల్యాణ మంటపంలో పార్టీ నేత బులుసు జగదీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎంపీ సబ్బం హరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ప్రజలే తిప్పి కొడతారు: జ్యోతుల, జక్కంపూడి

రాజమండ్రిలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యురాలు జక్కం పూడి విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన మహిళా సదస్సుకు అపూర్వ స్పందన లభించింది. వివిధమండలాల నుంచి సుమారు 2000 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల జగన్‌ను అరెస్టు చేస్తారంటూ వస్తున్న వార్తలను నేతలు తీవ్రంగా ఖండించారు. ‘ప్రజలే అటువంటి చర్యలను తిప్పికొడతారు. ఉవ్వెత్తున ఎగసిపడే మహిళా ఆగ్రహ జ్వాలల్లో కుట్రదారులు మాడి మసైపోతారు’ అని హెచ్చరిం చారు. విజయలక్ష్మి మాట్లాడుతూ జగన్‌పై చర్యలకు దిగితే మహిళా లోకం ఉద్యమిస్తుందన్నారు. ఏదో ఓ కుట్ర చేసి జగన్‌ను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందని చిత్తూరు జిల్లా మహిళా నేతలు మండిపడ్డారు. తిరుపతి అర్బన్ మండలం శెట్టిపల్లి పంచాయతీలో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ లు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ మార్గాల్లో వైఎస్ కుటుంబాన్ని అణచి వేయాలనుకోవడం అవివేకమన్నారు.
Share this article :

0 comments: